Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 20, 2016

శ్రీసాయి అంకిత భక్తులు – జస్టిస్ ఎమ్.బి.రేగే – 3వ.భాగమ్

Posted by tyagaraju on 5:21 AM
Image result for images of shirdi sai baba with garlands
Image result for images of rose garden chandigarh

20.05.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ప్రచురించేదానిలో దక్షిణ గురించి తెలుసుకుందాము
Image result for images of m b rege.

శ్రీసాయి అంకిత భక్తులు – జస్టిస్ ఎమ్.బి.రేగే – 3వ.భాగమ్

అదే సంవత్సరం 1912 లో ఆయన వంద రూపాయలతో మరలా షిరిడీకి వచ్చారు.  బాబాను దర్శించుకున్నపుడు బాబా రూ.40/- దక్షిణ అడగగానే వెంటనే సమర్పించారు.  కొంత సేపయిన తరువాత మరలా రూ.40/- దక్షిణ అడిగారు.  రేగే వెంటనే దక్షిణ ఇచ్చారు.  తరువాత మిగిలిన రూ.20/- కూడా దక్షిణ అడిగారు.  రేగే ఎటువంటి సంకోచం లేకుండా ఇచ్చేశారు.  తన వద్దనున్న డబ్బంతా బాబాకు దక్షిణగా సమర్పించినందుకు చాలా సంతోషించారు.  



ఇపుడాయన వద్ద ఒక్క పైసా కూడా లేదు.  ఆ తరువాత బాబా మరలా రేగేకు కబురు పంపించారు.  రేగే రాగానే బాబా మరలా ఆయనను దక్షిణ అడిగారు.  అటువంటి పరిస్థితిలో ఆయన తన వద్ద డబ్బు లేదని బాబాకు చెప్పారు.  అయితే ఎవరి దగ్గరకయినా వెళ్ళి అడిగిపట్టుకురా అని చెప్పి శ్యామా వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు.  ఆయన శ్యామా దగ్గరకు వెళ్ళి మసీదులో జరిగిన విషయమంతా వివరించి బాబాకు దక్షిణ ఇవ్వడానికి డబ్బు అడిగారు.  అప్పుడు శ్యామా రేగే తో “నువ్వు బాబా మాటలను సరిగా అర్ధం చేసుకోలేదు. బాబాకు నీడబ్బేమీ అవసరం లేదు.  ఆయనకు డబ్బు గడ్డిపోచతో సమానం.  ఆయన ఉద్దేశ్యం ప్రకారం నీ తనువు, మనస్సు, బుధ్ధి, నీ సమయం అంతా ఆయన మీదే లగ్నం చేయమని, బాబా మాటలలోని అంతరార్ధాన్ని వివరించాడు.  రేగే బాబా దగ్గరకు తిరిగి వెళ్ళి శ్యామా చెప్పినదంతా చెప్పాడు.  బాబా చిరునవ్వు నవ్వి “దీక్షిత్ దగ్గరకు వెళ్ళి అడుగు” అన్నారు.  ఆయన దీక్షిత్ దగ్గరకు వెళ్ళి బాబాకు దక్షిణ కోసం డబ్బడిగారు.  దీక్షిత్ గారు రేగే చెప్పినదంతా విన్న తరువాత బాబా మిమ్మల్ని నాదగ్గరకు ఎందుకని పంపించారో పరిస్థితులను బట్టి అది మీకు ఒక ఉపదేశం చేస్తున్నట్లుగా గ్రహించుకోవాలి.  డబ్బు లేకపోవడం గాని, యాచించడం గాని ఇవేమీ అవమానకరంగా భావింపరాదనీ, యాచించడం విషయానికి వస్తే మనలో  గొప్పవాళ్ళమనే భావన, మనం ఇంకొకరిని యాచించడమేమిటి అనే భావం మనసులోకి రానివ్వరాదని బోధించడానికే బాబా మిమ్మల్ని నావద్దకు పంపించారని” దీక్షిత్ విడమర్చి చెప్పాడు.  రేగే తిరిగి బాబా వద్దకు వెళ్ళి దీక్షిత్ చెప్పినదంతా వివరంగా చెప్పారు.  బాబా చిరునవ్వు నవ్వి ఆయనని నానా సాహెబ్ దగ్గర అప్పు అడిగి తీసుకురమ్మని పంపించారు.  రేగే నానా సాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళారు.  


అక్కడ  నానాసాహెబ్, ఉపాసనీ శాస్త్రి గారి మార్గదర్శకత్వంలో కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను చదువుతూ ఉన్నారు.  ఆయనకు కూడా మసీదులో జరిగినదంతా చెప్పి ఆయనని అప్పు అడిగారు.  అంతా విన్న నానా సాహెబ్ లౌక్యంగా ఇలా అన్నారు “ఇది చాలా సున్నితమయిన అంశం.  బాబా దక్షిణ అడగగానే ఇవ్వడానికి మన దగ్గర లేనప్పుడు మన పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉంటుందో నేను ఊహించుకోగలను.  ఇకనుండి నువ్వు నేను చేసే విధంగానే చేస్తూ ఉండు అని ఒక సలహా ఇచ్చాడు.  నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోవర్ గావ్ లో దాచి ఉంచుతాను.  లేకపోతే బాబా దక్షిణ అడిగినప్పుడు “లేదు” అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంటుంది.  బాబా దక్షిణ అడిగినపుడు ఆయనకి సమర్పిస్తూ, అయిపోగానే కోపర్ గావ్ నుంచి తెప్పించి ఇస్తూ ఉంటాను.  నువ్వు కూడా అదే విధంగా చేయి” అని సలహా ఇచ్చారు. రేగే మశీదుకు వెళ్ళి నానా చెప్పినదంతా చెప్పి ఆయన ఇచ్చిన సలహా కూడా చెప్పారు.  అ వెనువెంటనే బాబా నానాకు కబురు పంపించారు.  నానా రాగానే అతనిని రూ.40/- దక్షిణ అడిగారు.  అతను సంతోషంగా సమర్పించి వెళ్ళిపోయాడు.  మరలా అతనికి కబురు పంపించి మరొక రూ.40/- దక్షిణ అడిగారు.  అదికూడా సమర్పించాడు నానా.  మరలా నానాను మసీదుకు పిలిపించి అతని వద్ద మిగిలిన డబ్బును కూడా దక్షిణగా స్వీకరించేసారు.  
    Image result for images of khandoba temple

నానా సాహెబ్ వెంటనే కోపర్ గావ్ లో తాను దాచుకున్న డబ్బును తెమ్మని ఒక మనిషిని పంపించాడు.  కానీ ఈలోగానే బాబా మళ్ళీ దక్షిణ అడిగారు.  అతను షిరిడీకి రెండువందల రూపాయలతో వస్తూ,  వందరూపాయలను కోపర్ గావ్ లో దాచుకుని వందరూపాయలతో షిరిడీకి వచ్చాడు.  బాబాకు ముందర వంద రూపాయలు దక్షిణగా సమర్పించేసాడు. ఇక తన వద్ద డబ్బు లేదని చెప్పవలసివచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు.  ఈ సంఘటన ద్వారా బాబా వారికందరికీ చెప్పదలచుకున్నదేమిటంటే తాము ఏమడిగినా బాబాకు ఇవ్వగలమని, ఆయన అవసరాలన్నీ తీర్చగలమనీ అనుకుంటే అదంతా ఒట్టి భ్రమేనని తెలియ చెప్పడానికే బాబా ఆవిధంగా చేశారు.  బాబా దక్షిణ అడగడంలోని ఆంతర్యం వారికర్ధమయింది.   బాబా ధనాన్ని, కానుకలను లెక్క చేయరు. అవి ఆయనకు అవసరం లేదు.  వారు తన భక్తులనుండి కోరుకునేది ధృఢమయిన హృదయపూర్వకమయిన ప్రేమ మాత్రమే.  అటువంటి ప్రేమ రేగేలో ఉందని బాబాకు తెలుసు.  కాని అందరి భావాలు ఏవిధంగా ఉన్నాయో రేగేకు తెలియచెప్పాలనుకొన్నారు.  

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List