Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, May 22, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 11వ.భాగమ్

Posted by tyagaraju on 4:22 AM
  Image result for images of baba in flower garden
   Image result for free images of rose gardens

22.05.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని ఈ రోజు మీకోసం.

Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 11వ.భాగమ్
 సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు 



101.  నీ కుటుంబ సభ్యులతో కలిసి సంసార జీవితము కొనసాగిస్తున్నపుడు అందరూ కలిసిమెలిసి నీతో తిరుగుతారుఅదే నీకు కష్టాలు ఎదురయినపుడు ఎవరిమానాన వారు వెళ్ళిపోతారుకాని నీ భార్య మాత్రము నిన్ను కష్టాలనుండి దూరము చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది.  
Image result for images of wife giving advice to husband
Image result for images of wife giving advice to husband
అందుచేత కష్టసుఖాలు భార్యాభర్తలు కలిసి పంచుకోవాలి




12.09.2007

102.  జీవితంలో ఆఖరి దశలో ధనసంపాదన, కీర్తి సంపాదనల కోసము శ్రమించడం వ్యర్ధముఅంతిమ  కాలములో ఉన్నదానితో  ప్రశాంతముగా జీవిస్తూ మన జీవిత గమ్యాన్ని చేరడం ఉత్తమము.

103.  ఇతరులతో కలిసి మనకు తెలియని పనులలో తల దూర్చిన చికాకులు వచ్చినపుడు అవతలివాడు సులువుగా బయటపడతాడు.  
Image result for images of wife giving advice to husband

మనము ప్రమాదములో ఇరుక్కుని మనశ్శాంతిని పోగొట్టుకుంటాముఅందుచేత మనకు తెలియని విషయాలు సంబంధము లేని విషయాలలో తలదూర్చరాదు.  

Image result for images of lord rama going to forests
104.  రఘురాముడంతటివానికే  చేయని తప్పుకు పదునాలుగు సంవత్సరాల వనవాసము శిక్ష అనుభవించవలసివచ్చిందే, అందుకోసము విధి బలీయమైనదిదానిని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పక తప్పదు.  

Image result for images of crows

105.  కాకులలో ఐకమత్యం చూడుమానవులలో ఐకమత్యం లేదుఅందుచేత ఇతరులతో గొడవలు పడకుండా జీవించడం అలవాటు చేసుకో

05.02.2008

Image result for images of man in bad habits
106.  దుర్వ్యసనాలు అనేవి ఇసుక గుట్టవంటిదిదాని మీదకి మానవుడు ఎక్కితే ఇసుకలో కూరుకుపోతాడుఅందుచేత మానవుడు దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి

12.02.2008

107.  జీవితంలో వృధ్ధాప్యము ఒక వరమువృధ్ధాప్యంలో, నీ రక్త సంబంధీకులపై మమకారము పెంచుకునేకన్నా భగవంతునిపై మనసు లగ్నం చేయడం మిన్న.   

22.03.2008

108.  రోజుల్లో స్నేహం తమ అవసరాలు తీర్చుకొనడానికి మానవులు కల్పించుకున్న బంధం అదే స్నేహబంధంనిజానికి నీకు నీవే ఒక మంచి స్నేహితుడివని గ్రహించిననాడు నీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.   
Image result for images of good friends


18.04.2008
      
   Image result for images of friend helping friend


109.  నీ ప్రక్కింటివాడు కష్టంలో ఉన్నపుడు అతడు పిలవకపోయినా అతనికి సహాయం చేయటానికి వెళ్ళాలిఅదే అతను సంతోషంలో ఉన్నపుడు అతను పిలవకపోతే అతని ఇంటికి వెళ్ళరాదు.

03.05.2008

110.  జీవితంలో స్వశక్తిమీద నమ్మకము విశ్వాసము ఎదుటివాని నుండి ఏమీ ఆశించకుండా ఉండే విధానాలతో జీవిత యాత్రను కొనసాగించిన వాని జీవితము ధన్యము.

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List