09.04.2016 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి లీలామృత ధార
పోయిన
స్కూటర్ దొరుకుతుందా లేదా???
ఈ
రోజు మరొక అద్భుతమైన బాబా
లీల మనమందరం పంచుకుందాము. కుమారి మాయా సాద్వాని పూనా వారి ఈ లీల శ్రీసాయి లీలా మాసపత్రిక సెప్టెంబరు 1983 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
గత
ఏడు సంవత్సరాలనుండీ నేను సాయిని పూజిస్తూ
ఉన్నాను. ఆయన మీద
నాకెంతో భక్తి. ఆయన
నాకు ఎన్నో లీలలు చూపించారు. అన్నిటినీ
నేను
నా డైరీలో రాసుకుంటూ ఉంటాను. కాని
వేటినీ కూడా ప్రచురించే ఉద్దేశ్యం
మాత్రం లేదు. కాని,
క్రిందటి నెలలోనే జరిగిన ఈ లీలను మాత్రం
సాయి బంధువులందరితోను నేను పంచుకోదలచుకోవడానికి కారణం, ఇది
ప్రచురిస్తానని నేను బాబాకు మాట
ఇవ్వడం వల్ల. నా
సద్గురువు, తండ్రి అయిన సాయికి నేనిచ్చిన
మాట నిలబెట్టుకోవాలని.