07.01.2018 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడి సాయిబాబా భక్తుల అనుభవాల ప్రచురణ తెలుగులో 06.1.2011 బాబా వారి అనుగ్రహంతో ప్రారంభింపబడింది. అప్పటినుండి ఇప్పటివరకు బాబా వారి ఈ బ్లాగును ఆదరిస్తున్న పాఠకులకు బాబావారు తమ అనుగ్రహాన్ని నిరంతరం ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను. గత పదిహేను రోజులుగా ప్రచురించడానికి అస్సలు వీలు చిక్కలేదు. మరొక నాలుగు రోజుల వరకు పనులవత్తిడి ఉంటుంది. కాని నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక రాధాకృష్ణస్వామీజీ గారు అనుగ్రహ భాషణాల తరువాయి భాగాలు చదవండి.
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో
జరిపిన అనుగ్రహ భాషణమ్ - 5 వ.భాగమ్
26.04.1971 ఈ రోజు స్వామిజీ కొంతమంది భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి
వారు చేసే సాధనలను గురించి, వారి నమ్మకాలను గురించి వివరించారు. "నిన్నటిరోజున ఇక్కడకు వచ్చిన ఇంజనీరును గమనించారా? అతను నాచేతులు పట్టుకుని నాట్యం చేస్తూ ఆధ్యాత్మికంగా భావోద్వేగాలను అనుభవిస్తూ వాటిని తాను అధిగమిస్తున్నట్లుగా కనిపించాడు.