Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, January 7, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 5 వ.భాగమ్

Posted by tyagaraju on 7:33 AM
           Image result for images of shirdi sai baba hd
Image result for images of hibiscus

07.01.2018  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ షిరిడి సాయిబాబా భక్తుల అనుభవాల ప్రచురణ తెలుగులో 06.1.2011 బాబా వారి అనుగ్రహంతో ప్రారంభింపబడింది.  అప్పటినుండి ఇప్పటివరకు బాబా వారి ఈ బ్లాగును ఆదరిస్తున్న పాఠకులకు బాబావారు తమ అనుగ్రహాన్ని నిరంతరం ప్రసాదించమని బాబాను వేడుకుంటున్నాను.  గత పదిహేను రోజులుగా ప్రచురించడానికి అస్సలు వీలు చిక్కలేదు.  మరొక నాలుగు రోజుల వరకు పనులవత్తిడి ఉంటుంది.  కాని నా ప్రయత్నం నేను చేస్తాను.  ఇక రాధాకృష్ణస్వామీజీ గారు అనుగ్రహ భాషణాల తరువాయి భాగాలు చదవండి.


శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు
Image result for images of radhakrishna swamiji

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 5 వ.భాగమ్
26.04.1971  ఈ రోజు స్వామిజీ కొంతమంది భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి వారు చేసే సాధనలను గురించి, వారి నమ్మకాలను గురించి వివరించారు.  "నిన్నటిరోజున ఇక్కడకు వచ్చిన ఇంజనీరును గమనించారా?  అతను నాచేతులు పట్టుకుని నాట్యం చేస్తూ ఆధ్యాత్మికంగా  భావోద్వేగాలను అనుభవిస్తూ వాటిని తాను అధిగమిస్తున్నట్లుగా కనిపించాడు. 


అతను నాట్యం చేస్తూ తన శరీరం బరువునంతటినీ నాపాదాలమీద వేశాడు.  నాపాదాలకు చాలా నొప్పి పెట్దింది.  ఇటువంటి నాట్యాలలో నాకెటువంటి భగవంతుడు గోచరమవలేదు.  భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి ఇది ఏవిధమయిన చైతన్యమో, ఇదేమి పద్దతో నాకేమాత్రమూ అర్ధం కాలేదు.


ఇటువంటి వేషాలన్నీ దేవుడిని త్వరగా చేరాలనే ప్రయత్నం.  ఆవిధంగా త్వరితంగా లభించే ప్రయత్నాలగురించి మనం ఏవిధమయిన ఆందోళనలు చెందకుండా ఒక్కొక్కమెట్టును అధిగమిద్దాము.  ఇది క్రమక్రమంగా కొనసాగవలసిన ప్రక్రియ.  అంతటా వ్యాపించి ఉన్న భగవంతుని గురించి తెలుసుకోవడానికి, ఆయనను చేరుకోవడానికి మనం అంత దూకుడుగా వెళ్ళవలసిన అవసరం లేదు.
Image result for images of shirdi sai baba hd
మరుసటిరోజు స్వామీజీ దేవుని గురించి చేసే ప్రార్ధనలు, భజనలలో భక్తులు అనుసరించవలసిన నిరాడంబరత గురించి దాని ఆవశ్యకత గురించి వివరించారు.  ఆ సమయంలో ఒక భక్తుడు స్వామీజీని ఒక సంస్థవారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న భజనలో మీరు పాల్గొంటున్నారా లేదా అని ప్రశ్నించాడు.  అందుకు స్వామీజీ, “నేను వారు నిర్వహిస్తున్న భజనలకి వెళ్ళడం మానేశాను.  ఇంతకుముందు ఆభజనలలో పాల్గొనే స్త్రీ పురుషులలో నేను ఎంతో నిరాడంబరతని గమనించాను.  కాని కాలక్రమేణా వారిలో ఆ నిరాడంబరత లోపించింది.  భజనలయందు భక్తి ఉన్నట్లయితే ఆవిధంగా ఉండటం సమంజసమేనా?  ఇవన్నీ గమనించిన తరువాత అటువంటి భజనలకు వెళ్లవలసిన అవసరం లేదనిపించింది నాకు.  ముఖ్యంగా ఆధ్యాత్మికతలో స్త్రీ పురుషులలో ప్రాధమికంగా ఉండవలసినది నిరాడంబరత.  ఉదాహరణకు ఆధ్యాత్మికోపన్యాసాలు యిచ్చే ప్రవచన కర్త ధనాన్ని అర్ధించకూడదు.  ఆవిధంగా అర్ధించి, దభాయించి పుచ్చుకుంటే భగవంతుడిని అమ్ముకున్నట్లే.  భక్తులు ఏమిస్తే అదే పుచ్చుకోవాలి. నిరాడంబరం అంటే అదే. “ అని సమాధానమిచ్చారు.  ఆతరువాత స్వామీజీ భగవంతుడిని సంతోష పెట్టడానికి అనుసరించవలసిన విధానాలను ఉదహరించారు. “భగవంతుడు సంతృప్తి  చెందితే అందరూ సంతోషంగా ఉంటారు”  కాని ఏవిధంగా ఆయనని సంతోష పెట్టగలము?  పూజ్యులయిన నరసింహస్వామీజీ గారు ప్రతిరోజూ బీదలకు అన్నదానం చేస్తూ ఉండేవారు.  ఒకవేళ ప్రతిరోజూ సాధ్యం కాకపోతే ప్రతి పక్షానికి అనగా పౌర్ణమినాడు, అమావాస్యనాడు. అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించాలి.  ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం భగవంతుని సంతృప్తి పరచే విధానాలలో ఒకటి.”

14.06.1971:  బాబా తన కోరికలను ఏమీ తీర్చటంలేదని ఒక భక్తుడు స్వామీజీకి తన అసంతృప్తిని వెల్లడించాడు.  దానికి సమాధానంగా స్వామీజీ, “బాబా మనలను పరీక్షించడానికి ప్రతిదానిలోను ఒకటి మనకు దక్కకుండా చేస్తారు.  ఒకరి నమ్మకాన్ని ధృఢపరచడానికే పరీక్షకు గురిచేస్తూ యిబ్బందులను కలిగిస్తూ ఉంటారు.  ఉదాహరణకి నేను ఊటీలో ఎంతో సుఖంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను.  ఆ తరువాత శ్రీ నరసింహస్వామీజీ గారితో కలిగిన అనుబంధం నన్ను మద్రాసుకు తీసుకుని వచ్చింది.  నేను నిద్రించడానికి స్వామీజీ నాకు ఒక చెక్క బల్లనిచ్చారు.  దానిమీద నేను దిండు లేకుండా పడుకోవాల్సి వచ్చింది.  నాచేతినే తలగడగా పెట్టుకుని నిద్రించేవాడిని.  ఇపుడు నీకర్ధమయిందా, ఊటీలో ఎంతో హాయిగా సుఖంగా ఉన్నవాడిని మద్రాసు వచ్చాక ఎంతగా కష్టపడాల్సివచ్చిందో.  ఇది నాకొక పరీక్ష.  సుఖమయినా, దుఃఖమయినా మనం మన మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి.  రెండిటినీ సమభావంతో చూసినపుడు మాత్రమే భగవంతుడు మనలోకి ప్రవేశిస్తాడు.  భగవద్గీతలో  శ్రీ కృష్ణుడు, “సుఖ దుఃఖ సమేకృత్వ…” అని చెప్పలేదా?  సుఖ దుఃఖాలలో భేదాన్ని చూడనివాని హృదయంలోకే భగవంతుడు ప్రవేశిస్తాడు.  మానవునికి ఎన్నో కోరికలు ఉంటాయి.  అవి అనంతం.  అవి ధనము, పేరు ప్రఖ్యాతులు వగైరా… కాని గీతలో భగవానుడు మానవుడు పూర్తిగా త్యజించవలసిన మూడు ముఖ్యమయిన కోరికలను చెప్పాడు.  అవి కామ, క్రోధ, లోభ.  ఇవి ‘త్రయంత్యజేత్’.  కాని, భగవంతుడు మనకు మరలా మరలా పరీక్షలు పెడుతూ ఉంటాడు.  బాబా మనకి ఎన్నో సుఖాలను, సంపదను యివ్వడానికి కారణం మనం వాటికి అంటిపెట్టుకుని ఉన్నామా లేక తోటివారితో పంచుకుంటున్నామా లేదా అని గమనిస్తూ  ఉంటారు.  మరలా మనకి మరొక పరీక్ష పెడతారు.  మనకి క్రోధం వస్తుందా లేదా అని.  ఉదాహరణకి ఎవరయినా నిన్ను అగౌరవపరచడం గాని, నిందించడం గాని చేయువచ్చు.  అపుడు నీకు కోపం వస్తుంది.  ఇది మరొక పరీక్ష.  ఏదో విధంగా మానవుడిని మాయ భగవంతుడినించి దూరంగా నెట్టివేస్తుంది.  బాబా మనలనించి కోరుకునేది సర్వశ్య శరణాగతి.    అపుడే భగవంతుడు భక్తుడియొక్క రక్షణ భారాన్ని వహిస్తాడు.  “అనన్యాశ్చింతయంతోమా….” శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకోండి.  మనలను అన్ని విషయాలలోను కాపాడుతానని పరమ శ్రేష్ఠమయిన అభయప్రదానాన్ని మనకిచ్చారు.  అయన అనుగ్రహాన్ని పొందాలంటే,మనం పేరుప్రఖ్యాతులకోసం గాని, ధనాన్ని పురస్కారాలని   గాని ఆశించి  ఎప్పుడూ పనిచేయరాదు.  ఇప్పటివరకు బాబా నాకు ఎన్నోవిధాలుగా కఠిన పరీక్షలకు గురిచేశారు.  1939 నుంచి నేను నరసింహస్వామీజీ గారిని అనుసరించడం ప్రారంభమయింది.  అప్పటినుండి బాబా నాకు కలిగించిన అనుభవాలన్నిటిలోను ఆయన నన్ను ఎన్నో పరీక్షలకు గురిచేసారు.  ఆఖరికి కష్టాలను కూడా కలిగించారు.  నాగురువుతో నాకున్న సంబంధాన్ని పూర్తిగా తెంచివేసి నన్ను బొంబాయికి రప్పించారు.  నాకు చాలా బాధకలిగింది.  కాని అదంతా బాబా నిర్ణయమని భావించి బాబా సంకల్పానికి అనుగుణంగా నడచుకోవాలనుకున్నాను.  ఆయన ఆజ్ఞను శిరసావహించవలసిందే.  ఆ తరువాత షిరిడీ సంస్థాన్ వారి మానేజింగ్ కమిటీలో సభ్యుడిగా చేరాల్సివచ్చింది.  బాబా నన్ను ఈవిధంగా తనకు సేవ చేయమని కోరుకున్నారు.  ఆతరువాత నేను బెంగళూరుకు వచ్చాను.  ఇపుడు మళ్ళీ నన్ను మద్రాసుకు రప్పించారు.  ఎవరినయినా భక్తునిగా తయారుచేతడానికి బాబా యివన్నీ చేస్తూ ఉంటారు.  ఇటువంటి పరీక్షలలో నెగ్గుకుని విజయాన్ని సాధించేటంత వరకు బాబా అటువంటి పరీక్షలన్నిటిని పెడుతూనే ఉంటారు.  భక్తి మార్గంయొక్క సారాశం అదే.   ఆవిధంగా భక్తి మార్గం ద్వారా ఒక్కసారి భగవంతుడు భక్తుడిని తనవాడిగా చేసుకుంటే,  భగవంతుడు తన  భక్తుడిని  ఎన్నటికీ  వదలడు. భగవంతుడు అతనిని ఎప్పటికీ అలక్ష్యం   చేయడు.”

(స్వామీజీగారి అనుగ్రహ భాషణాలు యింకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List