02.08.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 46వ.అధ్యాయము
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 77వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: విశ్వమూర్తిర్మహామూర్తి ర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |
అనేకమూర్తి రవ్యక్త శ్శతమూర్తి శతాననః ||
పరమాత్మను విశ్వమంతటా నిండిన పెద్ద రూపముగా, ప్రకాశవంతముగా, అందు అనేక రూపములు, వివిధ ఆకారములతో ముఖములతో, వందల సంఖ్యలో నుండగా మరల తనకట్టి రూపమే లేనివానిగా, భౌతిక రూపముగా దర్శించుట వీలుగానివానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడిలో దొరికిన రత్నమణి సాయి - 46 వ.అధ్యాయము
17.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో హేమాద్రిపంతు చక్కని శ్రీసాయి లీలలు వర్ణించినారు. ఆలీలను అనుభవించిన శ్యామా చాలా అదృష్ఠవంతుడు. నేను శ్యామా అంతటివాడిని కాను, కాని, శ్రీసాయి ఆనాడు శ్యామాకు కలిగించిన అనుభూతిని నాకు ప్రసాదించినారు.