Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 19, 2012

నిత్య ప్రార్ధనలు

0 comments Posted by tyagaraju on 8:23 AM

19.05.2012  శనివారము








నిత్య ప్రార్ధనలు 


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు


గత నాలుగు రోజులుగా స్వస్థలం నించి విజయవాడకు వచ్చిన కారణంగా ప్రచురణకు కొంత ఆటంకము కలిగింది.  మరలా సోమవారమునుంచి సాయి.బా.ని.స. డైరీ 1997 మీకు అందిస్తాను.  ఈ రోజు కొన్ని నిత్య ప్రార్ధనలను ఇస్తున్నాను. 


ఒక ముఖ్య విషయం ::


 యింతకుముందు శ్రీషిరిడీ సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు ప్రచురించడం జరిగింది.  ఆ అనుభవాలన్నిటినీ పుస్తకరూపంలో తీసుకురావడం జరిగింది.  ఇది అంతా కూడా బాబావారి అనుగ్రహముతోనే జరిగింది.  మన సాయిబంధువులకు ఎన్ని పుస్తకాలు  కావాలో నాకు మైల్ ద్వారా తెలియపరిస్తే కొరియర్ ద్వారా పంపుతాను.  ఒక విషయం మాత్రం గుర్తు ఉంచుకోండి.  ఈ పుస్తకం కేవలం ఒక నవలలాగా, కధలపుస్తకం లాగ చదివి పక్కనపడవేయవద్దు.  దీనిని కూడా సాయి సత్చరిత్రతో సమానంగా ఆదరించి పారాయణ చేసి బాబావారి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. 


కొరియర్ చార్జీలు మీకు కావలసిన పుస్తకాలను బట్టి యెంత అయేదీ మీ మైల్ ఐ. డీ. తెలియపరిస్తే మీకు మైల్ చేస్తాను.   


సెల్ నంబర్    :  9440375411 


 మైల్.ఐడి :  


tyagaraju.a@gmail.com  






ఉదయము నిద్రలేచి కుడి అఱచేతిని చూచుచు :: 


1.  కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ 


    కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం  


నేలపై కాలు పెడుతూ


2.  సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే 


    విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే  


స్నానము చేయుచు


3.  గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి


    నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు  


విభూతి ధారణ చేయుచు


4.  శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం 


    లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం  


తులసిమొక్కకు నీరు పోయుచు


5   యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః 


    యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం   


దీపారాధన చేయుచు


6.  దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహం 


    దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే 


ఇంటినుండి బయటకు వెళ్ళునపుడు


7.  ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం 


    లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం  


భోజనము చేయుటకు ముందు


8.  అహంవైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 


     ప్రాణాపాన  సమాయుక్తః  పచామ్యన్నం  చతుర్విధం 


నిద్రపోవుటకు ముందు


9.  ఉత్తారణో దుష్కృతిహా   పుణ్యో దుస్స్వప్న నాశనః 


    వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః 


  



సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

Wednesday, May 16, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (01)

0 comments Posted by tyagaraju on 6:14 PM


17.05.2012  గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1997 ప్రారంభము

సాయి.బా.ని.స. డైరీ -  1997 (01)

04.01.1997

నిన్న రాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

"ఆధ్యాత్మిక రంగములోని వ్యక్తులతో స్నేహానికి భాష, వయసు, మనిషి ఆకారము అనేవి అడ్డంకములు కావుమనిషి మనసు అతనికి భగవంతునిపై యున్న నమ్మకము ముఖ్యముభగవంతునిపైయున్న నమ్మకము ఉన్నవారితో కలసి ఆధ్యాత్మిక రంగములోని విషయాలు చర్చించాలి. కాని, ప్రయాణము మాత్రము ఏకాంతముగా చేయాలి.

08.01.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక ముసలివాని రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.

1) ఇతరులు చేసిన తప్పులు తెలుసుకోవటములో తప్పు లేదునీవు మాత్రము ఆతప్పులు చేయకుండ జీవించటము ఒక గొప్పవిషయము.

2) ప్రశాంత జీవితము గడపాలి అంటే మంచి చెడులను గుర్తించాలివాటిలో మంచివి మాత్రమే స్వీకరించాలి.      

19.01.1997

శ్రీసాయి ఒక తోటమాలి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు


"నీవు గతములో విషబీజాలు నాటితే అవి విష వృక్షాలుగా ఎదుగుతాయిఆవృక్షాలు నీకు చల్లటి నీడను యిస్తాయి అని తలచటము నీభ్రమ

 ఆచెట్టు సమాజానికి పనికిరాదు కనుక ప్రజలే ఆచెట్టును కూకటి వేళ్ళతో పెకలించివేస్తారు.

22.01.1997

శ్రీసాయి ఒకబస్సు డ్రైవరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
"నీవు ఆధ్యాత్మిక రంగములో ముందుకు పయనించాలి అంటే, ప్రాపంచిక రంగములోని నీబరువు బాధ్యతలను భగవంతునిపై నమ్మకముతో నిర్వహించాలిఅప్పుడే నీవు నీగమ్య స్థానమును ఒడిదుడుకులు లేకుండ చేరగలవు.   

24.01.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ఈసమాజములో ధనవంతులు, మరియు బీదవారు సంతోషముగా జీవించుతున్నారుజీవించటానికి ధనము ఒక్కటే ప్రధానము కాదు. సంతోషముగా జీవించాలి అనే పట్టుదల ముఖ్యము.

2) నీవునివసించుతున్న నీస్వంత ఇల్లుకు ఖరీదు కట్టడము అవివేకమునీయింటిలో నీవు సుఖ శాంతులతో జీవించటానికి ప్రయత్నించటము వివేకము

3) జీవిత ప్రయాణములో నీబంధువులు, నీస్నేహితులు నీసుఖసంతోషాలను దోచుకోగలరుకాని నీకు ఉన్న భగవంతుని అనుగ్రహాన్ని ఎవరు దోచుకోలేరుఅందుచేత భగవంతుని అనుగ్రహముతో ప్రశాంత జీవితము గడుపు.
 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Tuesday, May 15, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (11)

0 comments Posted by tyagaraju on 7:58 AM






15.05.2012  మంగళవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


అందరకు సర్వ శుభములూ కలగాలని హనుమంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 


ఈ రోజు హనుమజ్జయంతి  


హనుమత్ గాయత్రీ మంత్ర 


ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి


తన్నో హనుమత్ ప్రచోదయాత్ 




సాయి.బా.ని.స.  డైరీ -  1996  (11) 





28.11.1996

నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి, నాజీవితములో నాకు జరుగుతున్న అన్యాయాలు, నేను పడుతున్న కష్ఠాలు ఏకరువు పెట్టి నన్నుకాపాడమని వేడుకొన్నాను.  
శ్రీసాయి తుఫాన్ లో సముద్రముమధ్య ప్రయాణము చేస్తున్న ఓనావను చూపించినారు.  

ఆయన ఆనౌక నడిపే వ్యక్తిని పిలచి ఆనౌక మీద విష్ణు సహస్రనామం అనే జండాను ఎగరవేయమన్నారు.  అపుడు ఆతుఫాన్ తగ్గి నౌక చక్కగా తన ప్రయాణము సాగించసాగినది.  

తుఫాన్ తగ్గిన తర్వాత ఆనౌక యజమాని తనపుట్టినరోజు పండగ ఆనౌకలో జరుపుకొంటు తనవద్దనున్న "శ్రీ విష్ణు సహస్రనామము" పుస్తకమునుండి శ్రీమహావిష్ణువు 1008 నామాలను చక్కగా చదవసాగినాడు. ఆసమయములో ఆకాశము నుండి ఆనౌక యజమాని పితృదేవతలు ఆనౌకలోనికి వచ్చి ఆనౌకలోనివారినందరిని ఆశీర్వదించినారు.    

ఈవిధమైన కలద్వారా శ్రీసాయి నాకు తెలియచేసిన సందేశాన్ని అర్ధము చేసుకొన్నానుజీవితములో కష్ఠాలను తొలగించుకోవడానికి శ్రీవిష్ణుసహస్రనామము చదవాలి అని నిర్ణయించుకొన్నాను.   

12.12.1996

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి జీవితములో సుఖశాంతులు పొందాలి అంటే అనుసరించవససిన మార్గము చూపు తండ్రి అని వేడుకొన్నానుశ్రీసాయి చూపిన దృశ్యాల సారాశము.

1) ధనసంపాదనలో అత్యాశ పనికిరాదునీకు ఉన్న అర్హత ప్రకారము ధనము సంపాదించాలి.

2) జీవితములో నీవు పొందలేకపోయిన "ప్రేమ" ను గుర్తుచేసుకొంటు, ఎవరినుండి అయిన సానుభూతి పొందాలి అని ప్రయత్నించినపుడు నీకు మిగిలేది "అశాంతి" అని గుర్తుంచుకోనీవు పొందలేకపోయిన ప్రేమ సముద్రములో కలసిపోయిన త్రాగే నీరు అని గ్రహించు.

3) ఒకపని మొదలుపెట్టినపుడు ఆపని పూర్తి అగువరకు యింకొక పని మొదలుపెట్టరాదు.

4) దూరముగాయున్న బంధువుల గురించి ఎక్కువగా ఆలోచించేకంటే దగ్గరలో యున్న మంచి వ్యక్తులతో సత్ సంగాలలో పాల్గొనటముమంచిది.
  
  19.12.1996

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక రంగముపై సలహాలు, సూచనలు ప్రసాదించమని వేడుకొన్నానుశ్రీసాయి ఒక కాలేజీ విద్యార్ధి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాలో అనేక ఆలోచనలు రేకెత్తించినవి.

1) కొందరు ఆధ్యాత్మిక రంగములో సేవ చేస్తున్నాము అనే ఉద్దేశముతో సంఘములో తన మనుషులను తయారు చేసి కీర్తి ప్రతిష్ఠలను సంపాదించగలరునిజానికి ఆకీర్తి ప్రతిష్ఠలు వారికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించలేవు

2) యోగీశ్వరుల జీవిత చరిత్ర నాకు బాగాతెలుసు అనే అహంకారము విడనాడి, నేను ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచనలతో సత్ సంఘాలలో పాల్గొనాలి.  

అపుడే భగవంతుని అనుగ్రహము సంపాదించగలరు


23.12.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక పల్లెటూరివాని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు మర్చిపోలేనివి.

1)  ప్రస్తుతము శ్రీసాయిపై నీకు ఉన్ననమ్మకము నీటితొట్టిలోని చేపపిల్లవంటిదిఅది ఒకనాటికి సాగరములోని పెద్ద చేపలాగ మారాలి

2) శ్రీసాయి మనపాలిటి గోమాత గోమాత పొదుగునిండ పాలు ఉన్నాయిఆపాలును నీవు ప్రేమతో పిండుకొని నీవుత్రాగి, నీప్రక్కవారికి కూడ పంచిపెట్టు.

30.12.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి నాబంధువు శ్రీసోమయాజులుగారి రూపముతో దర్శనము ఇచ్చి అన్నమాటలు నాజీవితములో బరువు బాధ్యతలను సక్రమముగా నిర్వహించడానికి ఉపయోగపడినవిఆయన అన్నమాటలు.

1) నీ గ్రామ సరిహద్దులలో ప్రవహించుతున్న తెలుగుగంగ (గోదావరి) చాలా పవిత్రమైనది

కొన్నివేల ఎకరాల వరిపొలాలకు నీరు అందచేసి కోటానుకోట్లమంది ఆకలిని తీర్చుతున్నది.

2) గృహస్థ ఆశ్రమములో భార్య, పిల్లప్రేమను పొందాలి అంటే ధన సంపాదన చాలా ముఖ్యముధనసంపాదన ఆగినరోజున ఆయింట గొడవలు ప్రారంభము అగుతాయిఅందుచేత గృహస్థ ఆశ్రమములో ఉన్నంత కాలము ధన సంపాదనను కొనసాగించుతు ఉండాలి.

3) సంసార బాధ్యతలునుండి పారిపోయి సన్యాస  ఆశ్రమము తీసుకోవటము కంటే గృహస్థ ఆశ్రమములో బాధలు పడుతు భగవంతుని అనుగ్రహము పొందటము మేలు అని గుర్తించు.





(ఇంకాఉంది)


సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


Monday, May 14, 2012

సాయి.బా.ని.స. డైరీ -1996 (10)

0 comments Posted by tyagaraju on 8:16 AM




14.05.2012  సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 


సాయి.బా.ని.డైరీ -1996  (10)






19.11.1996

శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనముయిచ్చి ఆధ్యాత్మిక జీవనముగొప్పతనాన్ని వివరించుతు అన్నమాటలు.

1) ప్రాపంచిక జీవితములో మనిషి సుఖ సంతోషాలతో జీవితము గడుపుతున్నపుడు అందరు,  అతను ఎంత అదృష్ఠవంతుడు అని అంటారుకానిఆవ్యక్తి  కష్ఠాలు అనేవానలో తడిసినపుడు మానసిక వ్యాధులతో మంచాన పడతాడుఅదే మనిషి ఆధ్యాత్మిక చింతన కలిగిననాడుకష్ఠాల వానకుభయపడడుధైర్యముగా నిలబడతాడు.  

2) గత జీవితములో చేసిన తప్పుడు పనులు పగపట్టిన పాములా మనలను వెంటాడుతుందితన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపముతో ఆధ్యాత్మిక జీవితము ప్రారంభించినవానికి ఆపాము ఏమీచేయలేదుజీవితములో బరువు బాధ్యతలను నిర్వర్తించడము కూడా ఆధ్యాత్మిక జీవితములో ఒకభాగము అని మర్చిపోరాదు

20.11.1996

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి, పిల్లలపట్ల తల్లితండ్రుల బాధ్యత గురించి వివరించమని వేడుకొన్నానుశ్రీసాయి నాపినతండ్రి శ్రీసోమయాజులుగారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు

1) పిల్లలను కని - వారిని పెంచి పెద్ద చేసి వారితోనే ఈలోకము అని భావించటము తప్పుభగవంతుని అనుగ్రహము సంపాదించటానికి ఆయన మనకు ప్రసాదించిన పిల్లలను ఆయన తరపున పెంచి పెద్దచేయటముఈప్రకృతిలో మన భాధ్యత అనిగ్రహించాలి.

2) తల్లితండ్రులు లేని పిల్లలు ఏనాటికి అనాధ పిల్లలు కారుదిక్కులేనివారికి దేవుడే దిక్కుఆభగవంతుడుఏదో ఒకరూపములో వచ్చి ఆపిల్లలను ఆదుకొంటాడు.  
తనప్రేమను వారికి పంచిపెడతాడు.  


22.11.1996

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి సుఖప్రదమైన గృహస్థ ఆశ్రమానికి సలహాలు, సూచనలు ప్రసాదించమని వేడుకొన్నానుశ్రీసాయి నావివాహముజరిపించిన పురోహితుని రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.
 
1) గృహస్థ జీవితములో భార్యను ప్రేమగా చూసుకోవాలి, అంతే గాని ఆమెతెచ్చిన స్త్రీధనాన్ని దుబారాచేయడము మంచిది కాదు

2) గృహస్థజీవితము సుఖప్రదముగా సాగటానికి ధనసంపాదన చాలా అవసరముఅలాగని ధనసంపాదనే ధ్యేయముగా పెట్టుకొని భార్య, పిల్లలకు దూరంగాయుంటు, వారికి కావలసిన మానసిక, నైతిక సహాయము అందచేయకపోవటము మహానేరము.


3) నీబరువు బాధ్యతలను తప్పించుకోవటానికి నీవు కన్నపిల్లలను ఇతరులకు దత్తత యివ్వటము మంచి పధ్ధతికాదు



(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List