14.05.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ -1996
(10)
19.11.1996
శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో
దర్శనముయిచ్చి ఆధ్యాత్మిక జీవనముగొప్పతనాన్ని
వివరించుతు అన్నమాటలు.
1) ప్రాపంచిక జీవితములో మనిషి
సుఖ సంతోషాలతో
జీవితము గడుపుతున్నపుడు
అందరు, అతను
ఎంత అదృష్ఠవంతుడు
అని అంటారు. కాని, ఆవ్యక్తి కష్ఠాలు అనేవానలో
తడిసినపుడు మానసిక వ్యాధులతో మంచాన పడతాడు. అదే మనిషి ఆధ్యాత్మిక
చింతన కలిగిననాడుకష్ఠాల
వానకుభయపడడు. ధైర్యముగా
నిలబడతాడు.
2) గత జీవితములో చేసిన
తప్పుడు పనులు
పగపట్టిన పాములా మనలను వెంటాడుతుంది. తన తప్పులను తెలుసుకొని
పశ్చాత్తాపముతో ఆధ్యాత్మిక జీవితము ప్రారంభించినవానికి ఆపాము ఏమీచేయలేదు. జీవితములో
బరువు బాధ్యతలను
నిర్వర్తించడము కూడా ఆధ్యాత్మిక జీవితములో ఒకభాగము
అని మర్చిపోరాదు.
20.11.1996
నిన్నరాత్రి నిద్రకు ముందు
శ్రీసాయికి నమస్కరించి, పిల్లలపట్ల
తల్లితండ్రుల బాధ్యత గురించి వివరించమని వేడుకొన్నాను. శ్రీసాయి
నాపినతండ్రి శ్రీసోమయాజులుగారి రూపములో
దర్శనము ఇచ్చి
అన్నమాటలు.
1) పిల్లలను కని - వారిని
పెంచి పెద్ద
చేసి వారితోనే
ఈలోకము అని
భావించటము తప్పు. భగవంతుని అనుగ్రహము
సంపాదించటానికి ఆయన మనకు ప్రసాదించిన పిల్లలను
ఆయన తరపున
పెంచి పెద్దచేయటముఈప్రకృతిలో
మన భాధ్యత
అనిగ్రహించాలి.
2) తల్లితండ్రులు లేని పిల్లలు
ఏనాటికి అనాధ
పిల్లలు కారు. దిక్కులేనివారికి
దేవుడే దిక్కు. ఆభగవంతుడుఏదో
ఒకరూపములో వచ్చి ఆపిల్లలను ఆదుకొంటాడు.
తనప్రేమను వారికి పంచిపెడతాడు.
22.11.1996
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి
సుఖప్రదమైన గృహస్థ ఆశ్రమానికి సలహాలు, సూచనలు
ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి నావివాహముజరిపించిన
పురోహితుని రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.
1) గృహస్థ జీవితములో భార్యను
ప్రేమగా చూసుకోవాలి,
అంతే గాని
ఆమెతెచ్చిన స్త్రీధనాన్ని దుబారాచేయడము
మంచిది కాదు.
2) గృహస్థజీవితము సుఖప్రదముగా సాగటానికి
ధనసంపాదన చాలా అవసరము. అలాగని
ధనసంపాదనే ధ్యేయముగా పెట్టుకొని భార్య, పిల్లలకు
దూరంగాయుంటు, వారికి కావలసిన మానసిక, నైతిక
సహాయము అందచేయకపోవటము
మహానేరము.
3) నీబరువు బాధ్యతలను తప్పించుకోవటానికి
నీవు కన్నపిల్లలను
ఇతరులకు దత్తత
యివ్వటము మంచి పధ్ధతికాదు.
(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment