15.05.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
అందరకు సర్వ శుభములూ కలగాలని హనుమంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
ఈ రోజు హనుమజ్జయంతి
హనుమత్ గాయత్రీ మంత్ర
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
సాయి.బా.ని.స. డైరీ - 1996 (11)
28.11.1996
నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి
నమస్కరించి, నాజీవితములో నాకు జరుగుతున్న అన్యాయాలు,
నేను పడుతున్న
కష్ఠాలు ఏకరువు
పెట్టి నన్నుకాపాడమని
వేడుకొన్నాను.
శ్రీసాయి
తుఫాన్ లో
సముద్రముమధ్య ప్రయాణము చేస్తున్న ఓనావను చూపించినారు.
ఆయన ఆనౌక నడిపే
వ్యక్తిని పిలచి ఆనౌక మీద విష్ణు
సహస్రనామం అనే జండాను ఎగరవేయమన్నారు. అపుడు
ఆతుఫాన్ తగ్గి
నౌక చక్కగా
తన ప్రయాణము
సాగించసాగినది.
తుఫాన్
తగ్గిన తర్వాత
ఆనౌక యజమాని
తనపుట్టినరోజు పండగ ఆనౌకలో జరుపుకొంటు తనవద్దనున్న
"శ్రీ విష్ణు సహస్రనామము"
పుస్తకమునుండి శ్రీమహావిష్ణువు 1008 నామాలను
చక్కగా చదవసాగినాడు.
ఆసమయములో ఆకాశము నుండి ఆనౌక యజమాని
పితృదేవతలు ఆనౌకలోనికి వచ్చి ఆనౌకలోనివారినందరిని ఆశీర్వదించినారు.
ఈవిధమైన కలద్వారా శ్రీసాయి
నాకు తెలియచేసిన
సందేశాన్ని అర్ధము చేసుకొన్నాను. జీవితములో
కష్ఠాలను తొలగించుకోవడానికి శ్రీవిష్ణుసహస్రనామము
చదవాలి అని
నిర్ణయించుకొన్నాను.
12.12.1996
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి
జీవితములో సుఖశాంతులు పొందాలి అంటే అనుసరించవససిన
మార్గము చూపు
తండ్రి అని
వేడుకొన్నాను. శ్రీసాయి
చూపిన దృశ్యాల
సారాశము.
1) ధనసంపాదనలో అత్యాశ పనికిరాదు. నీకు
ఉన్న అర్హత
ప్రకారము ధనము సంపాదించాలి.
2) జీవితములో నీవు పొందలేకపోయిన
"ప్రేమ" ను గుర్తుచేసుకొంటు,
ఎవరినుండి అయిన సానుభూతి పొందాలి అని
ప్రయత్నించినపుడు నీకు మిగిలేది
"అశాంతి" అని గుర్తుంచుకో. నీవు
పొందలేకపోయిన ప్రేమ సముద్రములో కలసిపోయిన త్రాగే
నీరు అని
గ్రహించు.
3) ఒకపని మొదలుపెట్టినపుడు ఆపని పూర్తి అగువరకు యింకొక
పని మొదలుపెట్టరాదు.
4) దూరముగాయున్న బంధువుల గురించి
ఎక్కువగా ఆలోచించేకంటే దగ్గరలో యున్న మంచి
వ్యక్తులతో సత్ సంగాలలో పాల్గొనటముమంచిది.
19.12.1996
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి
ఆధ్యాత్మిక రంగముపై సలహాలు, సూచనలు ప్రసాదించమని
వేడుకొన్నాను. శ్రీసాయి
ఒక కాలేజీ
విద్యార్ధి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు
నాలో అనేక
ఆలోచనలు రేకెత్తించినవి.
1) కొందరు ఆధ్యాత్మిక రంగములో
సేవ చేస్తున్నాము
అనే ఉద్దేశముతో
సంఘములో తన
మనుషులను తయారు చేసి కీర్తి ప్రతిష్ఠలను
సంపాదించగలరు. నిజానికి
ఆకీర్తి ప్రతిష్ఠలు
వారికి ఆధ్యాత్మిక
శక్తిని ప్రసాదించలేవు.
2) యోగీశ్వరుల జీవిత చరిత్ర
నాకు బాగాతెలుసు
అనే అహంకారము
విడనాడి, నేను ఇంకా తెలుసుకోవాలి అనే
ఆలోచనలతో సత్ సంఘాలలో పాల్గొనాలి.
అపుడే భగవంతుని అనుగ్రహము సంపాదించగలరు.
23.12.1996
నిన్నరాత్రి కలలో శ్రీసాయి
ఒక పల్లెటూరివాని
రూపములో దర్శనము
ఇచ్చి అన్నమాటలు
మర్చిపోలేనివి.
1) ప్రస్తుతము శ్రీసాయిపై
నీకు ఉన్ననమ్మకము
నీటితొట్టిలోని చేపపిల్లవంటిది. అది ఒకనాటికి
సాగరములోని పెద్ద చేపలాగ మారాలి.
2) శ్రీసాయి మనపాలిటి గోమాత. ఆ గోమాత పొదుగునిండ
పాలు ఉన్నాయి. ఆపాలును
నీవు ప్రేమతో
పిండుకొని నీవుత్రాగి, నీప్రక్కవారికి
కూడ పంచిపెట్టు.
30.12.1996
నిన్నరాత్రి కలలో శ్రీసాయి
నాబంధువు శ్రీసోమయాజులుగారి రూపముతో
దర్శనము ఇచ్చి
అన్నమాటలు నాజీవితములో బరువు బాధ్యతలను సక్రమముగా
నిర్వహించడానికి ఉపయోగపడినవి.
ఆయన అన్నమాటలు.
1) నీ గ్రామ సరిహద్దులలో
ప్రవహించుతున్న తెలుగుగంగ (గోదావరి) చాలా పవిత్రమైనది.
కొన్నివేల ఎకరాల వరిపొలాలకు నీరు అందచేసి
కోటానుకోట్లమంది ఆకలిని తీర్చుతున్నది.
2) గృహస్థ ఆశ్రమములో భార్య,
పిల్లప్రేమను పొందాలి అంటే ధన సంపాదన
చాలా ముఖ్యము. ధనసంపాదన
ఆగినరోజున ఆయింట గొడవలు ప్రారంభము అగుతాయి. అందుచేత
గృహస్థ ఆశ్రమములో
ఉన్నంత కాలము
ధన సంపాదనను
కొనసాగించుతు ఉండాలి.
(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment