09.05.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు
కలిగిన సందేహాలు –
బాబా సమాధానాలు – 8 (3)
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
ఈ బ్లాగులోని సమాచారాన్ని ఎవరయినా తమ బ్లాగులోనికి గాని, ఫేస్ బుక్ పేజీలోనికి గాని కాపీ చేసి పేస్ట్ చేసుకోదలచినట్లయితే ముందుగా నాకు తెలియచేయవలసినదిగా మనవి.
సందేహాలు – బాబా సమాధానాలు –
8 (2) సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై –
ఒక యోగి ఎలా జీవించాలో అన్నిటిని బాబా వారు తను ఆచరించి చూపారు. భక్తుల మీద ఆయనకు ఎనలేని ప్రేమ. అలాంటి యోగిరాజు వద్ద మనమ్ వున్నందుకు ఎంతో సంతోషించాలి. వారు చెప్పిన బాటలో నడిచేందుకు ప్రయత్నమ్ చెయ్యాలి.
శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్
– నాకు ఇందులో ఒక సందేహం, యోగి ఒక ఇంట్లో భిక్ష చేసేటప్పుడు అందరూ తిన్నాకనే భిక్ష
తీసుకోవాలి అని రాసారు కానీ అలా చేస్తే ఆ ఇంట్లో వారి ఎంగిలి తిన్నట్టు కదా అది ఆ గృహస్తుకు
దోషం ఏమో..ఇవాళ సాయి లీలామృతంలో బాయిజా అమ్మ బాబాకి పెట్టకుండా ఏమీ తినేవారు కాదు అని
రాసారు. దానికి దీనికి సాపత్యం ఎలా అండి…
ఇందులో గొప్పవిషయం ఒకటి..నాలాంటివాళ్ళు జీవితంలో చదవలేని నారదీయ సూత్రాలు గురించి చక్కగా అరటిపండు వలిచినట్టు చెబుతున్నారు. ధన్యవాదాలండి.