14.08.2018 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అత్యద్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను. బాబా ఊదీ ప్రభావంతో దేవుడు లేడు అని వాదించేవాడు కూడా
దేవుడు ఉన్నాడు అని ప్రగాఢంగా విశ్వసించే సంఘటనలు జరుగుతాయి. అటువంటి సంఘటన ఏ విధంగా జరిగిందో ఈ రోజు మనమందరం
తెలుసుకుందాము. మన సాయి భక్తులందరికీ ఇది మరొక
మధురామృతమ్.
సాయిలీల
మాసపత్రిక డిసెంబరు 1983 వ.సంచికలో ప్రచురింపబడింది. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
ఆట్లాంటా (అమెరికా)
: ఫోన్ : 1571
594 7354
నాస్తికుడు కూడా ఆస్తికుడిగా మారగలడు...బాబా ఊదీ మహిమ
1972
వ.సంవత్సరం జనవరి నెలలో నేను, నాభార్య ఇద్దరం కాలినడకన యాత్రకు బయలుదేరాము. మా యాత్రలో మాకు ఒక అధ్భుతమయిన అనుభవం కలిగింది. జనవరి 16వ.తారీకున అమరావతి నుండి చందూర్ రైల్వే
స్టేషన్ వద్దకు చేరుకొన్నాము. అలసిపోయిన కారణంగా
అక్కడ కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాము.