18.06.2016 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు ధన సంపాదనపై సాయిబానిసగారి ఆలోచనలు చూద్దాము.
(ఈ రోజు ప్రచురిస్తున్న ఆలోచనలలో బాబా గారి లీల కూడా చదవండి)
ధన సంపాదన - సాయిబానిస ఆలోచనలు - 4
21.07.2000
31. ప్రశాంత జీవితానికి ధనము ప్రధానము కాదు. ప్రశాంతంగా
జీవించాలనే కోరిక ముఖ్యము.
14.02.2010
32. పెండ్లిలో అతిధులకోసం వండిన అన్నము, ఇడ్లీలను
ఆ వంట బ్రాహ్మలు గంజిపౌడరు
తయారుచేసే ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం బాధ కలిగించింది.
అన్నం లేక ఆకలితో బాధపడుతున్న
ఆ అన్నార్తులకు ఆ అన్నము, ఇడ్లీలను
యివ్వవచ్చును కదా!