13.03.2019 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయిబాబా తో స్నేహబంధమ్ –13 వ.భాగమ్
YOU BRING US JOY MERE KHWAJA
FRIENDSHIP WITH GOD
LORRAINE WALSHE RYAN & FRIENDS
బాబాతో సాన్నిహిత్యమ్ - డైరీ లో ప్రచురించిన
సాయి భక్తుల అనుభవాలు - 2
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్ ఫోన్ : 9440375411
8143626744
ఇందులో నాకు నచ్చినవి మాత్రమే
ప్రచురిస్తున్నాను. నిజం చెప్పాలంటే ఏదీ
వదలడానికి లేకుండా ఉన్నాయి. కాని పరిమితుల వల్ల కొన్నిటిని మాత్రమే ప్రచురిస్తున్నాను.
దీనికి సంబంధించిన అన్ని హక్కులు సాయిదర్బార్, హైదరాబాద్ వారివి. దీనిలోని ఏ భాగము కూడా
మరే ఇతర బ్లాగులలోను ప్రచురించరాదని సవినయంగా మనవి చేస్తున్నాను. సాయిబానిస శ్రీరావాడ
గోపాలరావుగారు ప్రత్యేకంగా నాకు అనుమతినిచ్చినందువల్ల నేను మరెవరికీ అనుమతిని
ప్రసాదించలేను.
ఓమ్ సాయిరామ్
ఈ రోజునుండి లోరైన్ వాల్ష్ గారి డైరీలో
ప్రచురింపబడ్డ భక్తుల అనుభవాలను కొన్నింటిని ప్రచురిస్తాను. మధ్యమధ్యలో డైరీలోని
విషయాలను కూడా కొన్నింటిని ప్రచురిస్తాను.
ఈ
రోజు ప్రచురింపబోయే సంఘటనను అనువాదం చేస్తున్నప్పుడు నా శరీరం కూడా రోమాంచితమయింది. ఇక చదవండి.
బెంగళూరు బి.టి.ఎమ్ లే ఔట్ లో ఉన్న శ్రీ సాయినాధ్ మందిరం పూజారి గారు వివరించిన
అధ్బుత సంఘటన.
ఈ సంఘటన అయిదు సంవత్సరాల క్రితం జరిగింది. ఒకరోజున నాదగ్గరకు
ఒకామె వచ్చి ,
“నేను
ఈ రోజు బాబాకి భోజనం పెడదామనుకుంటున్నాను” అంది. నేనామెతో “పదార్ధాలన్నిటినీ విడి విడిగా ఒక పళ్ళెంలో చక్కగా సద్ది, ఒక గ్లాసుతో
మంచినీళ్ళు కూడా తీసుకుని రా” అని చెప్పాను. మధ్యాహ్న ఆరతి సరిగ్గ 12 గంటలకు ప్రారంభమవుతుంది, కాబట్టి 11-45 కల్లా అన్నీ తీసుకుని వస్తే ఆరతి ప్రారంభమవాడినికి ముందే బాబాకు
నైవేద్యం పెడతాను” అని చెప్పాను.