Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, September 8, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 22 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:28 AM



 08.09..2022  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 22 వ, భాగమ్

అధ్యాయమ్ – 20

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

నన్ను భక్తి మార్గంలోకి నడిపించిన సాయి

కొన్ని సంవత్సరాల క్రితం వార్తాపత్రికలో ఒక ప్రకటన వెలువడింది.  “మీ పట్టణంలో ఏదయినా దేవాలయంలో సామాజిక సేవలు చేస్తూ ఉన్నట్లయితే మాకు ఆ గుడికి సంబంధించిన అన్ని వివరాలు తెలియచేయండి.  దానిని మేము మా వార్తా పత్రికలో ప్రచురిస్తాము” ఇదీ ఆ ప్రకటన యొక్క సారాంశం.  ఇది చదివిన తరువాత, ఆ వార్తా పత్రికను ఉజ్జ్వల గారికి చూపించడానికి వెంటనే ఆమె ఇంటికి వెళ్లాను.  

Wednesday, September 7, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 21 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 6:22 AM

 



 07.09..2022  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 21 వ, భాగమ్

అధ్యాయమ్ –19

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

సాయికృప వల్ల విదేశీ ప్రయాణం

ఆగస్టు 1 వ.తేదీ 1999 వ.సంవత్సరం.  మా అబ్బాయి పోవయ్ ఇన్శ్ టిట్యుట్ లో ఐ.ఐ.టి. పూర్తి చేసాడు..  ఇక ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళ్ళేందుకు సిధ్ధమవుతున్నాడు.  వెళ్ళేముందు మా కులదేవతయిన శాంతా దుర్గాదేవిని దర్శించుకోవడానికి గోవా వెళ్లడానికి నిర్ణయించుకున్నాము.  అందువల్ల 4 వ.తారీకున బయలుదేరి 6 వ. తేదీకి తిరిగివచ్చిన తరువాత అమెరికా ప్రయాణానికి తయారవచ్చని భావించాము.  క్షేమంగా గోవాకి చేరుకున్నాము. 

Tuesday, September 6, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 20 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 8:55 AM

 



06.09..2022  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 20 వ, భాగమ్

అధ్యాయమ్ –18

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాదు

పుష్పాలు చేసుకున్న అదృష్టమ్

నా తల్లిదండ్రులు ఎంతో ధర్మపరాయణులు.  నేను మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగాను.  మా నాన్నగారు షేన్ గావ్ లోని గజానన్ మహరాజ్ గారి శిష్యులు.  మా నాన్నగారు శ్రీ గజానన్ విజయం గ్రంధాన్ని ఒక అధ్యాయం చదువుతూ ఉన్నపుడు నేను, నా సోదరుడు, నా సోదరి ముగ్గురం వింటూ ఉండేవాళ్లం.  మా నాన్నగారు నాకోసమని గజానన్ విజయం మరొక పారాయణ గ్రంధాన్ని కొన్నారు.  మేము ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవారం.  గ్రాంట్ రోడ్ నుండి సాయిభక్తుడు ఒకాయన మా ఊరికి వచ్చారు.  నేను ఆయనను కలుసుకున్నాను.  ఆయన షిరిడీ సాయిబాబా గారి గాధలు చాలా చెప్పారు.  ఆయన బాబా గురించిన కధలు చెబుతూ ఉంటే అవి నా మసుమీద ఎంతో ప్రభావాన్ని చూపాయి.  ఈ విధంగా బాబా మాఇంటికి వచ్చారు అనేకంటే బాబా నన్ను తనవైపుకు లాగుకున్నారు అంటే సమంజసంగా ఉంటుంది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List