11.09..2022 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 23 వ, భాగమ్
అధ్యాయమ్
– 21
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
బాబా
మెడలో పూలదండ
ఇపుడు మీకు వాస్తవంగా జరిగిన సంఘటన గురించి వివరిస్తాను. ఇది జరిగి చాలా కాలమయింది. మేము ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి వస్తూ ఉంటాము. ఈ సారి నేను మా ఇద్దరి అక్కలతోను, మా అయిదుసంవత్సరాల కూతురుతోను షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని తిలకించడానికి వెళ్ళాము. షిరిడీ బాగా రద్దీగా ఉంది. బాబాకి అభిషేకం చేసి పూజ కూడా చేసాము. మూడవరోజున శ్రీరామనవమి. హాలు మధ్యలో ఒక ఊయలను కట్టారు. ఆ ఉత్సవం చూసిన తరువాత మేము తిరుగు ప్రయాణమవుదామనుకున్నాము.