11.09..2022 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 23 వ, భాగమ్
అధ్యాయమ్
– 21
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
బాబా
మెడలో పూలదండ
ఇపుడు మీకు వాస్తవంగా జరిగిన సంఘటన గురించి వివరిస్తాను. ఇది జరిగి చాలా కాలమయింది. మేము ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి వస్తూ ఉంటాము. ఈ సారి నేను మా ఇద్దరి అక్కలతోను, మా అయిదుసంవత్సరాల కూతురుతోను షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని తిలకించడానికి వెళ్ళాము. షిరిడీ బాగా రద్దీగా ఉంది. బాబాకి అభిషేకం చేసి పూజ కూడా చేసాము. మూడవరోజున శ్రీరామనవమి. హాలు మధ్యలో ఒక ఊయలను కట్టారు. ఆ ఉత్సవం చూసిన తరువాత మేము తిరుగు ప్రయాణమవుదామనుకున్నాము.
బాబా మెడలో వేసిన దండ నాకు కావాలనిపించింది. ఆ విషయాన్ని నేను మా గురూజీకి ముందుగానే చెప్పాను. నేను బాబా సమాధి వద్దకు వెళ్ళిన తరువాత ఒక నిమిషంపాటు
బాబా పాదాలకు నా శిరసును తాకించి ప్రార్ధించుకున్నాను. ఆ తరువాత నేను మేధీ గురూజీ కోసం వెదికాను. ఆయన నాకు బాబా మెడలో వేసిన దండను ఇస్తానని చెప్పారు.
కాని, ఆయన నాకు ఎక్కడా కనపడలేదు. చాలా నిరాశ కలిగింది నాకు. కాని మరునిమిషంలోనే గురూజీ గారు సమాధివైపు రావడం
కనిపించింది. ఆయన బాబా విగ్రహం వద్దకు వెళ్ళి,
బాబా మెడలోని పూలదండనొకదానిని తీసి నా వైపు విసిరారు. అది సూటిగా వచ్చి నామెడలో పడింది. మేమందరం చాలా ఆశ్చర్యపోయాము. ఇంకా విచిత్రం, ఆశ్చర్యకరమయిన
విషయం ఏమిటంటే ఆమరుక్షణంలోనే సాయి విగ్రహం దగ్గర మేధి గురూజీ గారు లేరు.
ఏమి
జరిగిందో అర్ధమయింది. బాబాగారే నాకు దండనిచ్చి
నాకోరికను తీర్చారు. ఒక విషయం చెప్పదలచుకున్నాను. మనం సాయియందు నమ్మకముంచుకుని మన జీవితాన్ని సుఖమయం
చేసుకోవాలి.
శ్రీమతి
అల్కా రిస్వాడ్కర్
9860317922
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment