25.02.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణముపై సాయిబానిస
ఆలోచనలు –4
సంకలనం :
ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్,
దుబాయ్
38. నీ ఆత్మను నీవరకే పరిమితము చేయకు. నీ ఆత్మను పరమాత్మ గురించి ఆలోచించేలాగ చేయి. అపుడు ఈ మానవాళి అంతా పరమాత్మ స్వరూపముగా నీకు కనిపించుతుంది.
39. ఉపవాసాలు చేస్తు శరీరాన్ని హింసించుతు భగవంతుని
ధ్యానించటము కన్న, శరీరాన్ని ఆరోగ్యకరముగా ఉంచుకొని భగవంతుని ధ్యానించటము మిన్న.