16.10.2021 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
షిరిడీ ప్రయాణానికి బాబా చేసిన సహాయమ్ - 1
ఈ రోజు ప్రచురిస్తున్న ఈ అనుభవాలు శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక జూలై – ఆగస్టు, 2021 వ.సంచికలో ప్రచురింపబడింది.
పాఠకులకి
ఇందులో సాయి మహిమలు ఏమీ లేవు కదా అంతా షిరిడీ యాత్రా విశేషాలే కదా అనిపిస్తుంది.
నాకు
కూడా అలాగే అనిపించింది.
కాని
పూర్తిగా చివరివరకు చదివిన తరువాత మాత్రమే ఆయన తన భక్త బృందానికి ఏవిధంగా సహాయ పడ్డారో తెలుస్తుంది.
మరాఠీ నుండి ఆంగ్లానువాదమ్ :
శ్రీమతి
మీనాల్ తుషార్ దేశ్ పాండే దాల్వి
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
మేమందరం కలిసి ఎప్పుడో 1923వ.సంవత్సరంలో షిరిడి వెళ్ళాము. అప్పటినుండి చాలా రోజులు గడిచిపోయాయి గాని మళ్ళీ షిరిడీ వెళ్ళే అవకాశమే రాలేదు. మరలా షిరిడీ ఎప్పుడూ వెడదామా సాయిబాబా దర్శనం ఎప్పుడూ చేసుకుందామా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాము.