16.10.2021 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
షిరిడీ ప్రయాణానికి బాబా చేసిన సహాయమ్ - 1
ఈ రోజు ప్రచురిస్తున్న ఈ అనుభవాలు శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక జూలై – ఆగస్టు, 2021 వ.సంచికలో ప్రచురింపబడింది.
పాఠకులకి
ఇందులో సాయి మహిమలు ఏమీ లేవు కదా అంతా షిరిడీ యాత్రా విశేషాలే కదా అనిపిస్తుంది.
నాకు
కూడా అలాగే అనిపించింది.
కాని
పూర్తిగా చివరివరకు చదివిన తరువాత మాత్రమే ఆయన తన భక్త బృందానికి ఏవిధంగా సహాయ పడ్డారో తెలుస్తుంది.
మరాఠీ నుండి ఆంగ్లానువాదమ్ :
శ్రీమతి
మీనాల్ తుషార్ దేశ్ పాండే దాల్వి
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
మేమందరం కలిసి ఎప్పుడో 1923వ.సంవత్సరంలో షిరిడి వెళ్ళాము. అప్పటినుండి చాలా రోజులు గడిచిపోయాయి గాని మళ్ళీ షిరిడీ వెళ్ళే అవకాశమే రాలేదు. మరలా షిరిడీ ఎప్పుడూ వెడదామా సాయిబాబా దర్శనం ఎప్పుడూ చేసుకుందామా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాము.
రాత్రివేళ
రైలులో ప్రయాణం చేయడం అసాధ్యం.
మధ్యలో
ఏదయినా వాహనంలో ప్రయాణించి షిరిడీ చేరుకోవాలి.
చలికాలం
రోజులు, అంతే కాక పిల్లల ఆరోగ్యపరిస్థితిని బట్టి కొంతదూరం రైలులోను, మరికొంత దూరం వాహనంలో ప్రయాణమంటే కష్టమే.
అందుచేత
ఉదయం 8 గంటలకే బస్సులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకల్లా షిరిడీ చేరుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఆవిధంగా వెళ్లడానికి నిర్ణయించుకున్నాము.
18
మంది పట్టె బస్సుని మాట్లాడుకుంటే
మాకందరికీ సరిపోతుందని దానిని అద్దెకు తీసుకున్నాము.
ఆరోజు
డిసెంబరు 27వ.తారీకు, ఆదివారం.
మేము
బస్సు ఎక్కేటప్పటికి బాగా ఆలశ్యం అయింది.
మధ్యాహ్నం
12 గంటలకి బస్సు ఎక్కాము.
ప్రయాణ
సమయం 8 గంటలు పడుతుంది కాబట్టి షిరిడీ చేరుకునేటప్పటికి
రాత్రి 8 గంటలు అవుతుందనుకున్నాము.
ఒకరోజు
షిరిడిలొ ఉండి అక్కడినుండి పండరీపూర్, సజ్జన్ గడ్, జెజూరీ, భీమశంకర్ అన్నీ చూసి ఆఖరికి జనవరి 3వ.తారీకున ఇంటికి తిరిగి వద్దామని ముందుగానే ప్రణాళిక వేసుకున్నాము.
సాయిబాబావారి
లీలలు మనం ఊహించలేని విధంగా అసామాన్యంగా ఉంటాయి.
శాంతాక్రజ్ నుండి మా ప్రయాణం ప్రారంభమయింది. ఇక కుర్లా చేరుకుంటామనగా బస్సు చక్రం పంక్చర్ అయింది. రిపేరు చేయడానికి దాదాపు ఒక గంట సమయం పట్టింది. నాసిక్ రోడ్డులో ఒకచోట రెండుగంటల సమయం వృధాగా గడిచిపోయింది. బస్సు డ్రైవరు మంచి నైపుణ్యం కలవాడు జాగ్రత్తగా నడిపేవాడవడం వల్ల మేము రాత్రి తల్ ఘాట్ దాటి, గం.11.30 కి పంచవటి చేరుకున్నాము. పంచవటిలో బస్సు ఆపాడు. అక్కడ అందరినీ దారి అడిగి మన్మాడ్ రోడ్డు మీదుగా ప్రయాణం కొనసాగించాము.
ఉదయం 5 గంటలకి
యావలా దాటాము.
రాత్రంతా
గడిచిపోయింది. ఇక
తెల్లవారింది.. కాని
బస్సుకు మరొకసారి పంక్చర్ అయింది.
పంక్చర్
రిపేర్ చేయడానికి సమయం పట్టింది.
అపుడు
ఉదయం గం. 8.30 అయింది.
అప్పటికి
పవిత్ర గోదావరీ తీరానికి చేరుకున్నాము. మేమందరం గోదావరిలో స్నానాలు చేసాము.
కోవర్
గావ్ నుండి ఒక మైలు దూరంలో
జామతోట ఉంది.
దారిలో
మేము జామకాయలు కొన్నాము.
సోమవారం
ఉదయం గం. 10.15 కి షిరిడీ చేరుకున్నాము.
షిరిడీ
చేరుకోవడానికి 8 గంటలు పట్టే బస్సు ప్రయాణానికి 20 గంటలు పట్టింది.
షిరిడీ చేరుకున్న తరువాత తాత్యాకోతే పాటిల్ ఇంకా ఇతర భక్తులు, అతిధులందరినీ గురువారం దాకా ఉండిపొమ్మని, చావడి పల్లకి ఉత్సవాన్ని చూసి వెళ్లమని అన్నారు.
శుక్రవారానికి ముందు రోజు షిరిడీనుండి వెళ్లవద్దని అన్నారు.
కాని
బాబా కూడా మా మనసుని మార్చేశారు. మాకు
కూడా పల్లకీ ఉత్సవం చూసిన తరువాతనే
వెళ్లాలనిపించింది. క్రిస్
మస్ శలవులన్నీ షిరిడీలోనే గడిపి ఇక ఆఖరి శెలవు
రోజునాడు బయలుదేరడానికి నిర్ణయించుకున్నాము.
అందువల్ల
పండరీపూర్, జేజూరి ఇంకా కొన్ని ప్రదేశాలకు వెళ్లడం మానుకున్నాము.
ఉత్తరాల
ద్వారా మా బంధువులందరికీ ఈ మార్పుని తెలియచేసాము.
గురువారం
ఉదయం మేము శుక్లేశ్వర్, అక్కడినుండి కాచేశ్వర్ వెళ్లి కోపర్ గావ్ కి తిరిగి వచ్చాము. షిరిడిలో మధ్యాహ్నం భోజనం చేసి,
సాయంత్రం బస్సులో రహతా బజారు చూసి షిరిడీకి తిరిగి వచ్చాము. రాత్రి పల్లకీ ఉత్సవం మాకందరికీ
ఎంతో ఆనందాన్ని కలిగించింది. అది ఒక గొప్ప అనుభూతి. మామనస్సులకి ఎంతో ప్రశాంతత కలిగింది. శుక్రవారం ఉదయం అనగా 1932
వ.సం. జవరి 1వ.తేదీనాడు సంగమనేరుకు క్షేమంగా చేరుకున్నాము.
తిరుగు ప్రయాణంలో మేము తాలేగావ్ మీదుగా
ప్రయాణించి భీమశంకరం వెడదామనుకున్నాము. అక్కడినుండి
బొంబాయికి తిరిగి వెడదామనుకున్నాము కాని బాబా నిర్ణయం మరొకవిధంగా ఉంది. సాయిబాబా, బొంబాయినుంచి మా ప్రయాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేలా చూసారు. కాని తిరుగు
ప్రయాణంలో తాత్యాపాటిల్ గారు రాత్రి 7 గంటల తరువాత ప్రయాణం చేయవద్దన్నారు.
ఎక్కడయినా గృహాలు, జనసంచారం ఉన్న ప్రదేశంలో ఆగమని చెప్పారు.
మేము కూడా అదేవిధంగా రాత్రికి ఎక్కడయినా బస చేసి వెడదామనుకున్నాము. మధ్యాహ్నానికి నారాయణగావ్
చేరుకుని సాయంత్రం 6 గంటలకి భీమశంకరం చేరుకోవచ్చని
అనుకున్నాము. కాని మేము
నారాయణ గావ్ చేరుకునేటప్పటికి రాత్రి 7 గంటలయింది. తాత్యాపాటిల్ గారు భీమాపాటిల్ గారి
చిరునామా ఇచ్చి వారి ఇంటిలో బస చేయమని చెప్పారు. ఆయన ఇచ్చిన చిరునామా ప్రకారం ఆయన
ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పూనా వెళ్ళారని తెలిసింది.
ఇపుడు రాత్రికి ఎక్కడ బస చేయాలనే ప్రశ్న
ఉదయించింది. మాలో ఈ ప్రశ్న పొడచూపటానికి
ముందే బాబా లీల ప్రారంభమయింది.
(చివరి భాగమ్ రేపటి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment