12.09.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన మరొక లీల ఈ రోజు ప్రచురిస్తున్నాను.
హిందీనుండి
తెలుగులోనికి
అనువాదం చేసి భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించారు.
మందిరం మొదటి మెట్టు
1984వ.సంవత్సరంలో నేను లోడీరోడ్ లో ఉన్న దయాల్ సింగ్ కాలేజీలో B.Sc చదువుతున్న రోజులు. పరీక్షలు అయిన తరువాత పరీక్షాఫలితాల కోసం కాలేజీకి వెళ్ళాను. అప్పటికి ఇంకా ఫలితాలు ప్రకటించలేదని చెప్పారు. నిరాశతో నేను నా స్నేహితుని ఇంటికి వెళ్లాను. వెళ్ళేదారిలో మూడు మందిరాలు ఉన్నాయి. ముందుగా నేను రెండు మందిరాలలోకి వెళ్ళి భగవంతునికి నమస్కరించుకున్నాను. మూడవమందిరం దగ్గరకు వచ్చాక లోపలికి వెళ్ళడానికి మొదటి మెట్టు ఎక్కాను. కాని, ఇంతలోనే నాకు మనసులో అనిపించింది. పరీక్షలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయితేనే ఈ మందిరంలోకి వెళ్లాలి అనే ఆలోచనతో లోపలికి వెళ్లకుండానే తిరిగి వెళ్ళిపోయాను. మరుసటిరోజు ఫలితాలు వచ్చాయి. నేను 75శాతం మార్కులతో ఉత్తీర్ణుడయినట్లుగా నా స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు.