Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, July 8, 2017

నాస్తికుడిని ఆస్తికునిగా మార్చిన సంఘటన

0 comments Posted by tyagaraju on 8:37 AM
Image result for images of shirdi sai baba guru purnima
Image result for images of rose garland

08.07.2017  శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు
    Image result for images of shirdi sai baba guru purnima
ఈ రోజు మరొక అధ్బుతమైన సాయి మహిమను తెలుసుకుందాము.  బాబా సమాధి చెందిన తరువాత బాబా భక్తులకు కలిగిన అనుభవాలు “Ambrosia of ShiriDi” అనే పుస్తకాన్ని శ్రీ రామలింగస్వామిగారు శ్రీ శివనేశన్ స్వామీజీ గారి ప్రేరణతో రచించారు.  ఇది సాయిలీలా ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2004 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
 తన కుటుంబ సమస్యకు పరిష్కారం రాత పూర్వకంగా కోరిన భక్తుని విన్నపాన్ని బాబా ఏవిధంగా నెరవేర్చారో చదవండి.

నాస్తికుడిని ఆస్తికునిగా మార్చిన సంఘటన

మహారాష్ట్రలో కళ్యాణ్ దగ్గరలో వైతర్ణ అనే చిన్న పట్టణం.  ఆ పట్టణంలో శ్రీ వీరేంద్ర పి.పాండ్య నివాసం.  
          Image result for images of vaitarna station
అతను పట్టభద్రుడు.  అతనికి దేవుడంటే నమ్మకం లేదు.  అతని కుటుంబంలోనివారందరూ చదువుకున్నవారే.  అతని తల్లిదండ్రులు తప్ప కుటుబంలోనివారెవరూ దేవుడిని నమ్మరు.

Friday, July 7, 2017

బడేబాబా - 2

0 comments Posted by tyagaraju on 6:04 AM
     Image result for images of shirdi sai baba and goats
          Image result for images of rose hd

07.07.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సురేష గారు పంపించిన బడేబాబా గురించి ఆఖరి భాగం తెలుసుకుందాము. 

బడేబాబా - 2

అతిధి దేవోభవ
సాయిబాబా బడేబాబాను అతి గారాబంగా చూసుకునేవారు. బాబా అతనిని  చాలా ప్రేమగా 'బడేమియ' అని పిలిచేవారు. అతన్ని అతిథిగా గౌరవించేవారు. మసీదులో బాబాకు  కుడి వైపున కూర్చునేవాడు బడేబాబా. బాబా యొక్క దర్బార్ లో, అతనికి అతిధిగా ఎంతో గౌరవం యివ్వబడేది. ఉదయం అల్పాహారం నుండి మధ్యాహ్నం భోజనం వరకు బడేబాబా మసీదులో ఉండేవాడు. సాయిబాబా అతనిని తన దగ్గర కూర్చోబెట్టుకొని తన చేతులతో ఆహారాన్ని వడ్డించేవారు. సాయిబాబా అతనిని బుజ్జగిస్తూ తినిపించేవారు.

Tuesday, July 4, 2017

బడే బాబా - 1

0 comments Posted by tyagaraju on 8:42 AM
Image result for images of shirdi sai
Image result for images of rose hd

04.07.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబక్తులలో ఒకరయిన బడేబాబా గురించి తెలుసుకుందాము.  ఈ సమాచారాన్ని శ్రీ సాయి సురేష్ గారు పంపించారు.  వారికి నా ధన్యవాదాలు.

కలరా రోగము
ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుతూ వుంది. గ్రామవాసులందరూ మిక్కిలి భయంతో వున్నారు. వారితరులతో రాకపోకలు కూడా మానేసారు. గ్రామంలో పంచాయతీ వారు సభచేసి రెండత్యవసరమైన నియమాలు చేసి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించారు.

Monday, July 3, 2017

నామ జప మహిమ

0 comments Posted by tyagaraju on 7:59 AM
Image result for images of toli ekadasi
Image result for images of jasmine flower garland

03.07.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
ఈ రోజు మరొక అధ్భుతమయిన సాయి మహిమను తెలుసుకుందాము.  తెలుసుకునే ముందు రేపు తొలిఏకాదశి సందర్భంగా దాని గురించి కూడా కొంత తెలుసుకుందాము.  దీనికి సంబంధించిన సమాచారమ్ వికీపీడియా నుండి గ్రహింపబడినది.
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List