27.02.2016 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబాగారు తాము జీవించి ఉన్నప్పుడు తన భక్తులెందరికో తన లీలలను చూపించారు, అలాగే తాను షిరిడీలోనే ఉండి ఎక్కడో దూరంగా ఉన్న తన భక్తులకు దర్శనం కూడా ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన సమాధి అనంతరం కూడా తన భక్తులకు దర్శనాలను ఇచ్చిన అద్భుతమైన సంఘటనలు కూడా మనకందరకూ తెలుసు. ఇంతకు ముందు కూడా నేను ప్రత్యక్షంగా అనుభవించిన అనుభూతులను కూడా మీరు చదివే ఉంటారు. ఈ రోజు, మొట్టమొదట భగవంతునిపై నమ్మకం లేని వ్యక్తి బాబా మార్గంలోకి ఏవిధంగా వచ్చాడో అతనికి బాబా తన దర్శన భాగ్యాన్ని ఏవిధంగా కలిగించారో చదవండి. ఈ అద్భుతమైన లీల సాయిలీల పత్రిక నవంబరు - డిసెంబరు 2003 వ.సంవత్సరం సంచికనుండి గ్రహింపబడింది.
శ్రీ
సాయి దర్శనం – రక్షించువాడను నేనే
నేను
సాయి భక్తుడిగా ఏవిధంగా మారానో నాఅనుభవాలే తెలుపుతాయన్నదే నా అభిప్రాయం.
నా ఈ అనుభవాలను చదివిన
పాఠకులు కూడా బాబా పై
భక్తిని మరింతగా పెంచుకుంటారనే నమ్మకం నాకుంది.