11.09.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బా.ని.స.బాబాతో అనుభవాలు 2వ అనుభవాన్ని గురించి తెలుసుకుందాము.
సాయితో సాయి బా.ని.స. అనుభవాలు - 2
1991 లో నేను మా అమ్మాయికి వివాహానికి మంచి సంబంధ కోసం ప్రయత్నిస్తున్నాను కాని కుదరలేదు. ఎన్నోచోట్లకుతిరిగి , పెళ్ళికోడుకుల తల్లితండ్రులని అమ్మాయిని చూడమని మా యింటికి ఆహ్వానించాను.
యెన్నో విథాలుగాఅభ్యర్థించినప్పటికీ మా అమ్మాయిని చూడటానికి యెవరూ రాలేదు. 01.01.1992 న నూతనసంవత్సరమునాడు మాఅమ్మాయి వివాహం గురించి శ్రీ షిరిడీ సాయిబాబావారిని సందేశం ఇమ్మని అడిగాను. కళ్ళు మూసుకుని శ్రీ పత్తినారాయణరావుగారురాసిన సచ్చరిత్రలోని
ఒక పేజీ తెరిచాను. ఆశ్చర్యకరంగా అది 47 వ అధ్యాయం 387 పేజీ, అందులోఇలా ఉంది "దీని గురించి చింత పెట్టుకోవద్దని
నేనతనికి చెప్పాను, వరుడే ఆమెను వెతుక్కుంటు వస్తాడు". 1992 లోమా అమ్మాయి వివాహమవుతుందని సూచిస్తోందని తెలిసి నేను చాలా సంబర పడ్డాను.
1992 జనవరిలో నాస్నేహితుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి మా అమ్మాయి వివరాలు, జాతకం అడిగారు. వాటిని సామాజిక సేవకుడు వివాహసంబధాలనుకుదిర్చేతనస్నేహితుడుశ్రీసోమయాజులుగారికిఇస్తాననిచెప్పినారు.. నిజానికి సోమయాజులుగారితోనా కంతగా పరిచయం లేదు.
17.02.1992 న నేను ఉదయం 9 గంటలకి ఆఫీసుకు వెళ్ళేటప్పటికి నా బల్లమీద ఫోన్ మ్రోగసాగింది. నేను రిసీవరు తీసిఅవతలినుండి యెవరు మాట్లాడుతున్నారని అడిగాను. “తను పెళ్ళికొడుకుననీ మీఅమ్మాయిని చూడటానికివిశాఖపట్నం నుంచి వచ్చానని “ సమాథానం చెప్పినాడు. నేను సందిగ్ధంలో పడి బాబాని ప్రార్థించాను. శ్రీసాయిబాబాగారు ముందుకు వెళ్ళమని నాకు వెంటనే సలహా ఇచ్చారు. నేను వరుడుని అతని తల్లితండ్రులనిమాయింటికి మధ్యాహ్న్నం 2.30 కు ఆహ్వానించి మా అమ్మాయిని పరిచయం చేశాను.వారు మా అమ్మాయితోసుమారు గంట సేపు మాట్లాడిన తరువాత విశాఖపట్నం వెళ్ళిపోయారు.19.02.1992 న పెళ్ళికొడుకు తండ్రి నుంచి,తమకి అమ్మాయి నచ్చిందని నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునేందుకు నన్ను, నా భార్యని రమ్మని టెలిగ్రాం ఇచ్చారు. మాఅమ్మాయి అంగీకారం తీసుకుని 20.02.1992 న విశాఖపట్నం చేరుకున్నాము. సంబంధం ఖాయంచేసుకున్నాము. శ్రీ సాయి మా అమ్మాయికి మంచి వరుడిని ఇచ్చారని సంతోషించాను. వివాహం హైదరాబాదులో10.05.1992 న ఉదయం 6.58 కి నిర్ణయమైంది. ఈ పెళ్ళి పనులన్ని సజావుగా సాగేలా సహాయం చేయమని, వివాహంబాగా జరిపించమనీ బాబాని ప్రార్థించాను. 22.03.1992 న మధ్యాహ్న్నం నిద్ర పోతున్నప్పుడు శ్రీ సాయిబాబా మాతండ్రిగారి రూపంలో (కీ.శే .ఆర్.వీ.రావు) దర్శనమిచ్చి మా అమ్మాయి వివాహానికి సహాయం చేస్తాననీ వివాహానికికూడా వస్తానని మాటిచ్చారు. చనిపోయిన మనిషి (మాతండ్రిగారు) వివాహానికి వచ్చి ఏ విథంగా సహాయం చేయగలరా అని నేను ఆశ్చర్యపోయాను.
శ్రీసాయి సచ్చరిత్రలో 40 అధ్యాయం 342 పేజీలొ శ్రీ సాయిబాబా ఇలా చెపుతారు "నన్నే గుర్తుంచుకొనువారిని నేనుమరువను. నాకు బండిగాని, టాంగా గాని, రైలుగాని విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను." శ్రీ సాయిబాబా మా తండ్రిగారి రూపంలోమా అమ్మాయిపెళ్ళికి.రాలేరనింపించింది. శ్రీ సాయి సచ్చరిత్ర 28 అధ్యాయం 240 పేజీలో శ్రీ సాయిబాబా అన్న మాటలు "నాకు ఏ రూపమూ,ఆకారము అక్కరలేదు నేను అంతటా ఉంటాను" సాయి సచ్చరిత్రలో 40వ అధ్యాయం 342 పేజీలో శ్రీ సాయి ఇలాఅంటారు "నా మాటలు నిలబెట్టుకోవడానికి ప్రాణములనైన విడిచెదను. నా మాటలు నేనెప్పుడూ పొల్లు చేయను."
ఉదయంముహూర్తం అయినతరువాత వివాహానికి అమెరికానించి వచ్చిన నా శ్రేయోభిలాషి శ్రీ వీ. సూర్యారావు గారు నాకుపలహారం ఇచ్చి " ఈ రోజు పని వత్తిడివల్ల నీకు భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు ఈ పలహారం తీసుకో" అ ని చెప్పారు. పలహారం చెయ్యకపోతే ఆరోజు నాకు ఉపవాసం అయిఉండేది. శ్రీ సాయి ఉపవాసానికి వ్యతిరేకి ఆయన తనభక్తులనెప్పుడూ ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు.( అధ్యాయం 32 పేజీ 274.) రాత్రి నేను నిద్రకుపక్రమించేముందు వివాహం చక్కగా జరిపించినందుకు శ్రీ సాయిని ప్రార్థించి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. శ్రీ సాయిబాబా వివాహానికిరాకుండా మాట తప్పారనిభావించాను.
22.03.1992 శ్రీ సాయి వివాహానికి వస్తానని మాటిచ్చారు. ఒకవేళ శ్రీ సాయిబాబా వివాహానికి వచ్చి ఉంటే ఏ రూపంలోవచ్చారు? నాకది ఒక ప్రశ్నఅయింది. నా సందేహాన్ని తీర్చమని శ్రీ సాయిని అడిగాను. శ్రీ సాయిబాబా
నా కలలోబ్రాహ్మణుడి రూపంలో దర్శనమిచ్చి (నానుంచి 21/రూపాయలు దక్షిణగా తీసుకున్న బ్రాహ్మణుడిగా) నవ్వుతున్నారు. నేను మంచం మీదనించి లేచి సాయి పటం ముందు నిలబడి మాట తప్పకుండా మా అమ్మాయి వివాహానికి విచ్చేసినసాయిని గుర్తించ లేకపోయినందుకు నన్ను నేను నిందించుకున్నాను. మరునాడు నా అనుమానంసరిచూసుకోవడానికి, మగపెళ్ళివారి పురొహితుడిని నానుంచి 21/- దక్షిణ తీసుకున్న బ్రాహ్మణుడిని గురించిఅడిగాను. ఆయన, ఆ బ్రాహ్మణుడు పెండ్లికి వచ్చిన అపరిచితుడని చెప్పారు. మరి ఆ అపరిచితుడు సాయి తప్పమరెవరూ కాదనిపించింది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు