06.09.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రిమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులో మార్చ్ 5, 2011 లో ప్రచురింపబడిన గురుదాస్ పూర్ బాబా మందిరం గురించి తెలుసుకుందాము.
షిరిడీ సాయిబాబా మందిరం : గురుదాస్ పూర్ పంజాబ్
2009 డిసెంబరులో శ్రీ ప్రమోద్ మహాజన్ గారు తమ కుటుంబంతో మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళారు. షిరిడీలో ఉండగా ఆయనకి తన స్నేహితుడైన అశోక్ కపిల్ నుంచి ఫోన్ వచ్చింది (ఆయన కూడా సాయి పరివార్ సొసైటీలో సభ్యుడు). కపిల్ గారు, గురుదాస్ పూర్ లో బాబా విగ్రహాన్ని ప్రతిష్టిద్దామనే ఆలోచనలో ఉన్నట్లు అందుచేత విగ్రహ ప్రతిష్ఠాపనకి సంబంధించిన వివరాలన్ని షిరిడీ సంస్థాన్ వారినించి మొత్తం అడిగి తెలుసుకోమని ఫోన్ లో అడిగారు. ఇది వినగానే మహాజన్ గారు చాలా సంతోషించారు. విగ్రహం స్థాపన యెలా చేయాలో మొత్తం సమాచారమంతా రాసి పెట్టుకున్నారు. షిరిడీ సాయి సంస్థాన్ వారు ఇచ్చిన సూచనల ప్రకారం యేమేమి చెయ్యవచ్చు, యేమేమి చేయకూడదో వీటితో సరియైన సమాచారాన్ని తయారు చేశారు.
జనవరి 3, 2010 న ప్రదీప్ గారు కుటుంబంతో గురు దాస్ పూర్ లోని తమ యింటికి తిరిగి వచ్చారు. వెంటనె సాయి పరివార్ సొసైటీ గుర్దాస్ పూర్ లో బాబా మందిరాన్ని నిర్మించాలని యేకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
యిప్పటివరకు బాబా మందిరం నిర్మించడానికి వారికి స్థలం దొరకలేదు. కాని యెవరయినా తన మందిరం నిర్మించదలిస్తే సాయి ప్రతీదీ తనే చూసుకుంటాడన్నది మనకి తెలుసు. వాస్తవానికి ఆయన మందిర నిర్మాణ సమయంలో సాయి ప్రతీ అడుగునీ పర్యవేక్షిస్తూ ఉండగా చూసిన భక్తుల ఉదంతాలు కూడా ఉన్నాయి.
యిక్కడకూడా అదే జరిగింది. షివల చౌదరి మిస్త్రీ కమిటీ ద్వారా సాయి పరివార్ సంఘానికి, బాబా మందిర నిర్మాణానికి స్థలం ఇవ్వబడింది. షివల మందిరం ఉన్న వెనకాల స్థలంలో బాబా మందిరం నిర్మించుకోవడానికి అనుమతినిచ్చారు.
ఈ విథంగా ప్రధాన సమస్య తొందరలోనే తీరిపోయింది. కిందటి సంవత్సరం జనవరి 20, 2010న వసంత పంచమి పుణ్య దినాన హోమాలు, పూజలతో భూమి పూజ జరిగింది.అఖిల భారతీయ గో రక్ష దళానికి జాతీయ అద్యక్షుడయిన శ్రీ కృష్ణానంద్ గారు భూమి పూజ చేశారు.
మెల్లగా నిలకడగా బాబా అనుగ్రహంతో నిర్మాణం పని జరుగుతూ ఉంది. యెప్పుడు దేనికీ కొరత రాలేదు. నిజానికి నిర్మాణానికి ఏది కావలసి వచ్చినా సాయి భక్తులందరూ సంతోషంగా విరాళం ఇచ్చారు. ఈ విథంగా యెటువంటి ఆటంకాలూ లేకుండా ప్రతీదీ సాఫీగా జరిగిపోయింది.
సరిగ్గా 9 నెలల తరువాత ( 9 బాబా వారి సంఖ్య) సాయిమందిరం పూర్తిగా తయారయింది. విగ్రహ ప్రతిష్టాపనకి 11 అక్టోబరు, 2010 (విజయదశమి) రోజుకి ఖరారు చేశారు.
ఇప్పుడు బాబా పాలరాతి విగ్రహం తేవడానికి, ప్రమోద్ మహాజన్, అశోక్ కపిల్,నరేష్ గుప్తా,అమిత్ మహాజన్ గార్లు, రాజస్థాన్లోని జైపూర్ వెళ్ళారు. అక్కడ వారు 5అ.6 అం. చాలా సుందరమైన సాయి విగ్రహాన్ని ఎంపిక చేశారు.
ఆఖరికి బాబా విగ్రహాన్ని గురుదాస్ పూర్ మందిరానికి తీసుకుని వచ్చారు. అయిదురోజులు తగిన హోమాలు చేసిన తరువాత పవిత్రమైన విజయదశమి రోజున బాబా విగ్రహం ప్రతిష్టించబడింది.
ప్రజలంతా కూడా గురుదాస్ పూర్ లోని బాబా విగ్రహం అసలు షిరిడీ సాయి మందిరాన్ని గుర్తుకు తెస్తోందని చెపుతారు. గురుదాస్పూ ర్లో బాబా మందిరం కావాలనే భక్తులందరి అంతర్గత కోరికని ఈ విథంగా నెరవేర్చారు.
రోజువారీ ఆరతి సమయాలు
1. కాకడ ఆరతి మంగల స్నానం ఉదయం 5.30
2. మఢ్యాహ్న ఆరతి 12.00
3. ధూప్ ఆరతి (సాయంత్రం) 6.15
గురువారము నాడు ప్రత్యేక పూజ
గురువారము బాబా వారము కాబట్టి ప్రతి గురువారము ఉదయం 5.00 గంటలకు బాబాకి పంచామృతాలతో మంగల స్నానం చేయిస్తారు. తరువాత రాత్రి 8 నుంచి వేరు వేరు సత్సంగ్ బృందాలతో బాబా భజన్ సంధ్య జరుగుతుంది. భజన్ సంధ్య తరువాత మందిరంలో భక్తులందరికి ఉచిత భోజనాలు దీనినే పంజాబీలో లంగర్ అంటారు.
ఈ అద్భుతమైన సాయి మందిరంలో అన్ని పండుగలూ జరుపుతారు. భక్తులందరూ ఇక్కడ సమావేసమై బాబావారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఏ రోజునైనా మీరు ఈ మందిరాన్ని దర్శించాలనుకున్నా, మీ స్నేహితులకు ఈ మందిరం గురించి తెలియచేద్దామనుకున్నా, ఈ చిరునామాను వ్రాసుకోండి.
సాయి మందిర్ గురుదాస్పూర్ పంజాబ్ : చిరునామా
శ్రీ సాయి మందిర్
షివల మియన్ మిస్త్రి
అమంబర బజార్
గురుదాస్పూర్, పంజాబ్, భారత్
పిన్ నంబర్: 143521
ప్రదీప్ జీ గారు ఈ క్రింది విథంగా అద్భుతంగా చెప్పారు.
నాకు ప్రాప్తం కానిది బాబా యెదయితే ఇచ్చారో
ఇది సాయి అనుగ్రహం మాత్రమే, లేకపోతె నాలో యెటువంటి ప్రత్యేకతా లేదు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment