02.03.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 10 వ.భాగమ్
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
(సాయిభక్తులకు అవగాహన కోసం రాధాకృష్ణస్వామీజీ గారి పుట్టుపూర్వోత్తరాల గురించి
ఈ సంచికలో తెలియచేస్తున్నాను. స్వామీజీ గారు.
పొయ్యమని గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం తిరుచిరాపల్లి
జిల్లా లోని కులితలై తాలూకాలో ఉంది. స్వామీజీ
1906 వ.సంవత్సరం ఏప్రిల్, 15 వ.తారీకున జన్మించారు. ఆయన తలిదండ్రులు శ్రీ డి.వెంకటరామ అయ్యర్, శ్రీమతి
లక్ష్మీ అమ్మాళ్. ఆయన వారికి అయిదవ సంతానం.)
04.09.1971 ఈ రోజు స్వామీజీ గారు తనకు ఈ మధ్యనే వచ్చిన ఒక స్వప్నం గురించి వివరించారు.
“ఆగష్టు 26 వ.తారీకున
నేను బాబాకు దగ్గరగా కూర్చున్నట్లుగా కల వచ్చింది. ఆ కలలో బాబాకు వెనుక నరసింహస్వామీజీ గారు కూర్చున్నారు. ఆయనకు దగ్గరగా చేతులో విల్లంబులను ధరించిన శ్రీరామచంద్రులవారు
ఆశీనులయి ఉన్నారు. ఆ వెంటనే బాబా తన వ్రేలితో
నాహృదయంమీద స్పృశించి, “ఇకనుంచి నీగమ్యం మారింది” అన్నారు. ఈ మాటలను బాబా మరలా అన్నారు. దానియొక్క అర్ధం ఏమిటో నాకు బోధపడలేదు.