Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, March 2, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 10 వ.భాగమ్

Posted by tyagaraju on 12:32 AM
      Image result for images of shirdi sai

   Image result for images of small jasmine flower
02.03.2018  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
 శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 10 .భాగమ్
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.  రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
(సాయిభక్తులకు అవగాహన కోసం  రాధాకృష్ణస్వామీజీ గారి పుట్టుపూర్వోత్తరాల గురించి ఈ సంచికలో తెలియచేస్తున్నాను.  స్వామీజీ గారు. పొయ్యమని గ్రామంలో జన్మించారు.  ఈ గ్రామం తిరుచిరాపల్లి జిల్లా లోని కులితలై తాలూకాలో ఉంది.  స్వామీజీ 1906 వ.సంవత్సరం ఏప్రిల్, 15 వ.తారీకున జన్మించారు.  ఆయన తలిదండ్రులు శ్రీ డి.వెంకటరామ అయ్యర్, శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్.  ఆయన వారికి అయిదవ సంతానం.)
            Image result for images of radhakrishna swamiji

04.09.1971  ఈ రోజు స్వామీజీ గారు తనకు ఈ మధ్యనే వచ్చిన ఒక స్వప్నం గురించి వివరించారు.
“ఆగష్టు 26 వ.తారీకున నేను బాబాకు దగ్గరగా కూర్చున్నట్లుగా కల వచ్చింది.  ఆ కలలో బాబాకు వెనుక నరసింహస్వామీజీ గారు కూర్చున్నారు.  ఆయనకు దగ్గరగా చేతులో విల్లంబులను ధరించిన శ్రీరామచంద్రులవారు ఆశీనులయి ఉన్నారు.  ఆ వెంటనే బాబా తన వ్రేలితో నాహృదయంమీద స్పృశించి, “ఇకనుంచి నీగమ్యం మారింది” అన్నారు.  ఈ మాటలను బాబా మరలా అన్నారు.  దానియొక్క అర్ధం ఏమిటో నాకు బోధపడలేదు.  


నేను ప్రస్తుతం జీవిస్తున్న ఈ జీవనం ఎప్పుడోనే మారిపోయింది.  మరి యిప్పుడు బాబా ఈవిధంగా అనడం దేనికి సూచన?  బాబా వెనుక కూర్చున్న నరసింహస్వామీజీ గారు నవ్వుతున్నారు.  శ్రీరాములవారు కూడా నవ్వుతూ చూస్తున్నారు.  బాబా అన్న మాటలలో కొంత ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చని నాకనిపించింది.  నరసింహస్వామిగారికి రాముడంటే చాలా యిష్టమని నాకు తెలుసు.  ఆ మరుసటిరోజునే నేను మద్రాసు వెళ్ళాను.  అక్కడ నరసింహస్వామీజీ గారి ఫోటో ప్రక్కనే రామ, లక్ష్మణ, సీత, మారుతిల విగ్రహాలుండటం చూసి చాలా ఆశ్చర్యపోయాను.  
            Image result for images of ramalakshmana sita idols
అక్కడకు ఆ విగ్రహాలు ఎలా వచ్చాయో ఎవ్వరూ చెప్పలేకపోయారు.  నాకు వచ్చిన కల ప్రకారం చాలా కాలం క్రితం నన్ను బాబా మార్గంలోకి తీసుకునివచ్చిన నా గురువునుంచి వచ్చే మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.  ఈ రోజు వేకువఘామునే నాకు మరొక కల వచ్చింది.  ఆ కలలో ఒక మధ్య వయస్కురాలయిన స్త్రీ తన చేతులలో బిడ్దను పట్టుకుని వచ్చి, “స్వామీజీ నాభర్త నన్ను విడిచిపెట్టేశాడు.  మీరే నాకు రక్షణనివ్వాలి” అంది.  నేనామెను “అమ్మా నువ్వెవరు?” అని అడిగాను.  అపుడామె నాపేరు జ్ఞానం, ఈ బిడ్డపేరు ‘భక్తి’ అని సమాధానమిచ్చింది.  నేనామెను ధ్యానమందిరంలోకి రమ్మని చెప్పాను.  ఆమె అక్కడికి వచ్చి కూర్చుంది.  దీనిని బట్టి జ్ఞానము, భక్తి రెండూ కూడా యిక్కడ శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నాయని మనకు ఖచ్చితంగా అర్ధమవుతుంది.  వాస్తవానికి జ్ఞానానికి భర్త, బాబా గాని, కృష్ణుడు గాని, విష్ణువు కాని లేక మీకిష్టమయిన ఏభగవంతుడయినా కావచ్చు.  అందుచేత యిక్కడికి వచ్చినవారందరికీ కూడా ఆభగవంతునియొక్క అనుగ్రహం ఉంది.  ఇక్కడ ఎన్నిసార్లు విష్ణుసహస్రనామ పారాయణ జరిగిందో మీకు తెలుసు కదా? మరి అన్నిసార్లు పారాయణ జరిగినప్పుడు ఆ భగవంతుడు ఇక్కడకు ప్రవేశించాడా లేదా?  అందుచేత మనకు అచంచలమయిన తీవ్రమయిన భక్తి ఉండాలి.  ధ్యానం కోసం భగవంతునియొక్క ఏరూపాన్నయినా ధ్యానించవచ్చు.  అది మనకు ఏకాగ్రతనిస్త్తుంది.
      Image result for images of meditation  with god
      Image result for images of meditation  with god
        Image result for images of meditation  with god

07.02.1971  ఊటీలో నరసింహస్వామీజీతో తనకు కలిగిన మొదటి పరిచయం గురించి స్వామీజీ వివరించారు.  ఆయన నన్ను నీపేరేమిటి అని అడిగారు.  నాపేరు రాధాకృష్ణ అని చెప్పాను.  ఆ వెంటనే నేను ఆయనను ‘స్వామీజీ! నా తల్లిదండ్రులు నాకావిధంగా పేరు పెట్టారు, కాని నాకు రాధాకృష్ణ అంటే సరియైన అర్ధం తెలుసుకోవాలనుంది. చెప్పండి” అని అడిగాను.  ఆయనని నేను ఆవిధంగా ఎందుకని ప్రశ్నించానో నాకే తెలీదు.  “రాధాకృష్ణా!  నీకు దాని అర్ధం తెలుసుకోవాలని ఉంటే నాతో కూడా మద్రాసుకు రా” అని నరసింహస్వామీజీ అన్నారు.  నేను దానికంగీకరించి ఆయనతో  మద్రాసుకు వెళ్ళాను.  అక్కడ నన్ను ఒకరింటిలో బస ఏర్పాటు చేసారు.  రాధాకృష్ణ అనే పేరుకు సరియైన అర్ధం తెలుసుకోవాలని నాకెంతో కోరికగా ఉంది.  కాని ఇంతవరకు నాకు దాని అర్ధం తెలియజేయలేదు.  రాధాకృష్ణకు అర్ధమేమిటో ఆభగవంతుడు చెప్పేదాకా ఉపవాసం ఉంటానని శపధం చేశాను.  ఇక నేను ఉపవాసాలు ప్రారంభించాను.  విపరీతమయిన జ్వరం మొదలయింది.  నేను బసచేసిన యింటివారు డాక్టర్ ని తీసుకుని వచ్చి నాకు మందులిప్పించారు.  కాని నేను మందులు తీసుకోనని చెప్పి నా ఉపవాసాన్ని కొనసాగించాను.  ఉపవాసమున్న మూడవరోజుకి నాకు ‘రాధాకృష్ణ’ దర్శనం లభించింది.  ఆరోజు నేను వాలుకుర్చీలో కూర్చుని నాకు రాధాకృష్ణ ఎందుకని దర్శనం ఇవ్వటల్లేదని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను.  నేను పూర్తి మెలకువలోనే ఉన్నాను.  వెంటనే పైనుంచి రాధ పదహారేళ్ల పడుచు పిల్లలా క్రిందకు దిగుతూ కనిపించింది. 

ఆ తర్వాత కొంతసేపటికి కృష్ణుడు కూడా అదేవిధంగా వచ్చి రాధ ప్రక్కన నుంచున్నాడు.  ఇద్దరూ కూడా ఈఫోటోలో ఉన్నవిధంగానే ఉన్నారు. (స్వామీజీ తన ముందున్న ఫొటో వైపు చూపించారు).

చాలా ఫొటోలలో మనం చూస్తున్నట్లుగానే రాధ కృష్ణుని చేయి పట్టుకుని ఉంది.  మరొక చేతితో నన్ను పట్టుకుని కృష్ణుని దగ్గరగా తీసుకుని వెళ్ళి “ఈయనే కృష్ణుడు” అని చెప్పింది. తరువాత  ఆ దృశ్యం అదృశ్యమయిపోయింది.  ఆ తరువాతనుంచి నాజ్వరం తగ్గుముఖంపట్టింది.  ఎంత అధ్భుతమయిన దృశ్యం!  నిజానికి నేను కృష్ణుడిని చూపించమని రాధని ప్రార్ధించాను.  నాప్రార్ధన సార్ధకమయి తిరుగులేని సాక్ష్యం లభించింది.  ఈ సంఘటనని నేను నాగురువుకి వివరంగా చెప్పాను.  అపుడాయన బాబా ఎవరో తెలుసుకోమని చెప్పారు.  ఒకరోజున ఆల్ ఇండియా సాయి సమాజ్ (A I S S) మొదటి అంతస్థులో కూర్చుని ఉన్నాను.  ఆకాశంవైపు చూస్తూ బాబాయొక్క నిజ స్వరూపం ఏమిటి ఆయన ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాను.  
                Image result for images of shirdi sai
అకస్మాత్తుగా ఆకాశమంతా రాముడు, కృష్ణుడు, యింకా అనేకమంది వివిధ దేవీ దేవతల రూపాలతో నిండిపోయింది.  అపుడు నేను యిలా ప్రార్ధించాను.  “బాబా నాకివేమీ వద్దు. నాకు నీ నిజస్వరూపం తెలుసుకోవాలని ఉంది. నువ్వెవరో అనేది మాత్రమే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.  దయచేసి నాకు చూపించు”. ఈ విధంగా ప్రార్ధించగానే హటాత్తుగా అన్నిరూపాలు మాయమయిపోయి మారుతితో ఉన్న శ్రీరామచంద్రులవారి రూపం మాత్రమే మిగిలింది.  అపుడు నాకర్ధమయింది.  బాబా, రాముడు ఒకరే అని.  స్వామీజీకి యిదంతా వివరంగా చెప్పాను.  ఈ అనుభూతులను విని ఆయన చాలా సంతోషించారు.  అందుచేత సాయి, రాముడు యిద్దరూ ఒకరేనని స్పష్టమయింది.  సాయి, మారుతి యిద్దరూ కూడా ఒకరే.  ఆ తరువాత అక్కడ ఉన్న ప్రతివారిని ‘సాయిరామ్’ అని నామస్మరణ చేయమని చెప్పారు.  భక్తులందరూ చిన్నచిన్న కాగితం ముక్కలమీద ‘సాయిరామ్’ అని వ్రాసి అన్నిటినీ కలిపి దండలాగ చేసి బాబా ఫొటోకి అలంకరించారు.  ఈతిబాధలు పడుతున్న మానవాళిని ఉధ్ధరించడానికి వచ్చిన గొప్ప దైవికశక్తి బాబా అని నరసింహస్వామీజీ తరచూ చెబుతూ ఉండేవారు.  కొంతకాలం క్రితం తనకు రాజరాజేశ్వరి దర్శనం లభించిందని స్వామీజీ చెప్పారు.  ఆమె సింహాసనం మీద ఆశీనురాలయి ఉందని, ఆమె చూట్టూతా పరిచారికలు ఉన్నారని తనకు కనిపించిన దృశ్యం గురించి వివరించారు.  

ఆయన యింకా మరొక విషయం చెప్పారు.  “ఒకసారి ఒక సన్యాసి యిక్కడ మన మందిరానికి వచ్చాడు.  ఆయన బాబా గొప్పతనమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాననీ, మానవుడయిన బాబాని భగవంతునిగా ఎందుకని పూజించాలో తనకు ఋజువు కావాలని” అన్నాడు.  నేను చెప్పిన వ్యాఖ్యానాలు ఏమీ అతన్ని సంతృప్తి పరచలేకపోయాయి.  అపుడు నేను ‘బాబా, నువ్వు మాత్రమే ఈసన్యాసికి సమాధానం చెప్పి ఒప్పించగలవు” అని బాబాని ప్రార్ధించాను.  ఈవిధంగా ప్రార్ధించిన కొద్ది నిమిషాల తరువాత ఒకామె  శ్రీరామ, సీత, లక్ష్మణ, మారుతి విగ్రహాలను తీసుకునివచ్చింది. ఈ విగ్రహాలన్నిటిని ఆ సన్యాసి సమక్షంలో నాకందజేసింది. ఈ సంఘటనను చూసిన ఆ సన్యాసికి నోటమాట రాక స్థాణువయ్యాడు.  బాబా తననే రామునిగా నిరూపించుకున్నారని ఆ సన్యాసికి అవగతమయి కళ్ళంబట నీళ్ళు కారాయి.  బాబా గొప్పదనం గురించి వాదించినందుకు క్షమాపణ చెప్పుకున్నాడు.  ఆ విగ్రహాలను ఎక్కడినుంచి తీసుకుని వచ్చావని ఆమెను ప్రశ్నించాను.  వాటిని తాను  A I S S  మద్రాసునుంచి తెచ్చినట్లుగా చెప్పింది  ఈ సంఘటన బాబా, శ్రీరామచంద్రుడు తప్ప మరెవరూ కాదనే విషయానికి బలవత్తరమయిన సాక్ష్యం.  ఆ విగ్రహాలనే యిక్కడ మనము పూజిస్తూ ఉన్నాము.

ఆతరువాత స్వామీజీ భగవంతునియొక్క వివిధ ఆకారాలు, అవతారాల గురించి చెప్పారు.  “మీమనసుకు నచ్చిన ఏరూపాన్నయినా సరే మీమనసులో నిక్షిప్తం చేసుకోండి.  శ్రీరామునికి శరణాగతి చేయుచున్న మారుతిలాగ, 
Image result for images of maruti at lord rama's feet
Image result for images of gopis love for krishna
కృష్ణునియందు అమితమయిన ప్రేమను వ్యక్త పరుస్తున్న గోపికలలాగ మన హృదయంలో అటువంటి భావన కలిగి ఉండాలి.  మనకు యిష్టమయిన భగవంతుని ఏరూపాన్నయినా మనం పూజించుకోవచ్చు.  వాస్తవంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక అభివృధ్ధికి అవరోధాలు కలిగించేవి మనకున్న ఆస్థిపాస్తులు, వాటి రక్షణబాధ్యతలు, మానసిక భయాందోళనలు. ఇవన్నీ మనలని అంటిపెట్టుకుని ఉంటాయి.  ఈ ఐహిక ప్రపంచంలో ఉన్న వ్యక్తి అయినా గాని లేక ప్రాపంచిక విషయాలను పరిత్యాగం చేసిన వ్యక్తి అయినా గాని వారికి రెండు రూపాలలో ఉన్న ఉత్తమమయిన ఆస్థి ఏదంటే ఒకటి గాయత్రి రెండవది విష్ణుసహస్రనామం.

(స్వామీజీ భాషణలు యింకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List