Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 11, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 11 వ.భాగమ్

Posted by tyagaraju on 4:30 AM
      Image result for images of shirdi sai baba hd
          Image result for images of rose without copyright restrictions

11.03.2018 ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

 శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 11 .భాగమ్

శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు రోజు    పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లుసాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు

12.09.1971 : ఈ రోజు శ్రీకృష్ణుని జన్మదినమయిన గోకులాష్టమి.  స్వామీజీ కొద్దిమంది భక్తులతో కలిసి గోకులాష్టమి పూజకై ఒక భక్తుని యింటికి వెళ్ళారు.  “ప్రతివారికి సత్సంగము, భజన చాలా అవసరం” అని స్వామీజీ అన్నారు.  ఎంతోమంది యోగులు, భాగవతోత్తములయిన భోదేంద్ర, నారద, అజామిళ, ప్రహ్లాద, మారుతి లాంటివారు భజనలకి ఎంతో గౌరవాన్నిచ్చారు.  



అంతేకాదు, భగవంతుని మార్గంలోకి ప్రవేశించి నడవడానికి గాయత్రి జపం కూడా ఆవశ్యకం.  సాధారణంగా మాయనుంచి బయటపడటం చాలా కష్టసాధ్యమయిన విషయం.  ఆ మాయ ప్రభావంనుంచి మనం బయటపడాలంటే ఈ పధ్ధతుల ద్వారా సాధ్యపడుతుంది.  అందువల్లనే గీతలో భగవానుడు
 “దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
  మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే  (అ.7 శ్లో.14)
(నామాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది.  ఇది అధిగమించుటకు సాధ్యము కానిది.  కాని, నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రమునుండి బయటపడగలరు.)
ఈ మాయను సృష్టించినవాడు మాత్రమే మాయనుండి బయటపడటానికి సహాయపడగలడు.  ఈ రోజు కృష్ణజయంతి.  ఆయన అనుగ్రహం కోసం మనమందరం ప్రార్ధించాలి.  మనం ధర్మమార్గాన్ని విడిచిపట్టకుండా ఆయన మనలని హెచ్చరిస్తూ ఉంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
          Image result for images of krishna jayanti
చిన్న బాలిక రూపంలో ఉన్న దుర్గాదేవిని కంసుడు పైకి విసిరివేసి చంపబోగా ఆమె కంసుడిని హెచ్చరించింది.  ఆ క్షణంలో ఆమె ఏమని చెప్పెందో గుర్తుకు తెచ్చుకోండి.  కంసుని చేతిలోనుంచి పైకి విసిరివేయబడిన మరుక్షణమే ఆ బాలిక “నందగోకులంలో పెరుగుతున్న శిశువు నిన్ను సంహరిస్తాడు” అని హెచ్చరించింది.  
               Image result for images of krishna jayanti
కాని, కంసుడు ఆమె చేసిన హెచ్చరికని లక్ష్యపెట్టలేదు.  చివరికి కృష్ణుని చేతిలో కంసుడు హతమయ్యాడు.  భగవంతునియందు మనకి నిష్కళంకమయిన భక్తి ఉండాలి.  భగవంతునికి సర్వశ్యశరణాగతి చేసి సంపూర్ణమయిన భక్తితో సేవించిన సాధారణ మానవుడు, సంవత్సరాల తరబడి తపస్సు చేసినవానికంటె ముందుగా భగవంతుని చేరుకోగలడు.  ప్రతివారిలోను, ప్రతిచోట, అన్నిటియందు కూడా మనము భగవంతుని చూడగలిగే స్థాయిలో ఉండాలి.   శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఈ విధంగా ఉపదేశించాడు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి ప చ మే న ప్రణశ్యతి
(అ.6 శ్లో. 30)
(సకల ప్రాణులయందు ఆత్మరూపముననున్న నన్ను (వాసుదేవుని) చూడుడు. పురుషునకు అట్లే ప్రాణులన్నిటియందు అంతర్గతములుగా నున్నట్లు నన్ను చూచువానికి నేను అదృశ్యుడను కాను.  అతడును నాకు అదృశ్యుడు కాడు.)
ఆయనయందే భక్తిని నిలుపుకొన్నట్లయితే మనము కూడా క్రమక్రమంగా ఆస్థాయికి ఎదగలిగి,  మనము కూడా అటువంటి జ్ఞానాన్ని పొందగలము.  “నా భక్తునికి నేను జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాన’ ని భగవద్గీతలో భగవానుడు చెప్పలేదా?  ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగే జ్ఞానాన్ని మనకిస్తాడు.  నేను మీకు గాయత్రి గురించి కూడా చెప్పాను.  ఎవరికయెతే గాయత్రి మంత్రాన్ని జపించే అర్హత ఉందో వారు మాత్రమే జపించాలి.  మిగిలినవారు జపానికర్హులు కారు. 
         Image result for images of gayatri
ఎటువంటి నిర్భంధము లేకుండా విష్ణుసహస్రనామ పారాయణ అందరూ చేయవచ్చును. ‘నిష్కామకర్మ”తో కనుక చేయదలిస్తె  గాయత్రి మంత్రాన్ని ఏసమయంలోనయినా జపించవచ్చును.  కాని కోరుకున్న ఫలితం సిధ్ధించడానికై చేసినట్లయితే మంత్ర జపానికి విధిపంపబడిన అన్ని నియమాలను పాటిస్తూ సరైన సమయం, ప్రదేశం ఎంచుకుని చేయాలి.  వినయము, విధేయత, సామాన్యమయిన నమ్మకము ఉంటే చాలు.  ఎవరయినా సరే ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యాలను సాధించుకోగలరు.  నేను మద్రాసులో ఉన్నపుడు ఒక ఆంగ్లో-యిండియన్ భక్తుడు తరచూ నన్ను కలుసుకోవడానికి వస్తూ ఉండేవాడు.  అతడు కృష్ణ భక్తుడు.  కృష్ణుడిని దర్శించడానికి సాధ్యపడుతుందా అని నన్నడుగుతూ ఉండేవాడు.  అది సాధ్యమేనని నేను చెప్పగానే, దానికి చేయవలసిన పధ్ధతి ఏమిటో చెప్పమన్నాడు.  నేనతనికి ఈ విధంగా వివరించాను. 

“నువ్వు 48 రోజులపాటు కృష్ణుని నామాన్ని జపిస్తూ సాధన చేయి.  అది చాలా సులభమయిన సాధన.  నీవు చేసే జపం త్రికరణశుధ్ధిగాను. ప్రేమతో కూడినదిగాను ఉండాలి.  ఏపని చేస్తున్నా కూడా కృష్ణుని నామస్మరణ చేస్తూనే ఉండు.  నిద్రపోతున్నపుడు కూడా ఈ విధంగా ప్రార్ధించు.  “హే కృష్ణా!  నేనిపుడు నిద్రకుపక్రమిస్తున్నాను.  నన్ను నీ ఒడిలోకి తీసుకో”  అలాగే నువ్వు ఏదయినా తినేముందుగా ఆయనకు సమర్పించి ఆ తరువాతనే నీవు తిను.  ఈ విధంగా చేస్తే చాలు అని చెప్పాను. కొద్దిరోజుల తరువాత అతను వచ్చి తనకింకా కృష్ణుని దర్శనం కాలేదని చెప్పాడు.  అపుడు నేనతనికి యింతకుముందు చెప్పినట్లుగానే కృష్ణనామ జపాన్ని కొనసాగిస్తూ త్రాగుడు మానేసి కఠోరమయిన బ్రహ్మచర్యాన్ని పాటించమని చెప్పాను.  నేను చెప్పినట్లుగానే 48 రోజులు గడవగానే అతను నావద్దకు వచ్చి తనకు కృష్ణ దర్శనమయిందని చెప్పాడు. 
             Image result for images of krishna jayanti
తనకెంతో చెప్పలేని ఆనందం కలిగిందని, అది మాటలలో వర్ణించలేనని చెప్పాడు.  ఇక్కడ ఒక ముఖ్యమయిన ప్రశ్న ఉదయిస్తుంది.  ఎవరయినా తమ కోరికలను పూర్తిగా విడిచి పెట్ట్టేయగలరా?  మనం కోరికలని ఉన్నట్టుండి అకస్మాత్తుగా వదలివేయనక్కరలేదు.   వాటిని మెల్లిమెల్లిగా వదలిపెట్టాలి.  మన కోరికలని ఆ భగవంతునికి అర్పణచేసినట్లయితే అది సాధ్యమే.  ఉదాహరణకి మంచి మధురమయిన పదార్ధాలను తిందామనే కోరిక ఉందనుకోండి.  హటాత్తుగా ఆ కోరికని చంపుకోవడం సాధ్యం కాదు.  అపుడు ఆ మధురపదార్ధాలను భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని తినవచ్చు.  ఈవిధంగా తినడం ఆనందం కోసం కాదు.  అందువల్ల దాని ఫలితంగా మధురపదార్ధాలను భుజిద్దామనే కోరిక అంతరించిపోతుంది.  ఏకోరికయినా సరే ఈ విధంగా మనం చేయవచ్చు.

29.10.1971:   ఈ రోజు స్వామీజీ ‘ఏకాదశి’ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.  ఏకాదశియొక్క ప్రాముఖ్యత ఏమిటి? ‘ఏకాదశి’ 'ఏకాదస్’ అన్న పదాన్నుంచి వచ్చింది.  అనగా పదకొండు.  మానవునిలో పదకొండు యింద్రియాలున్నాయి.  ఏకాదశి రోజున ఈ పదకొండు యింద్రియాలను అదుపులో ఉంచుకొని విశేషంగా భగవధ్యానం చేస్తారు. ఆ విధంగా చేసిన ధ్యానానికి ఎంతో మహత్యం ఉంటుంది.  ఏకాదశి రోజున భగవంతుని జపించడమంటే మనలో ఉన్న పదకొండు యింద్రియాలన్నిటినీ భగవంతునికి అర్పించడమే.  ఈ యింద్రియాలన్నిటి వెనుక దైవికశక్తి పనిచేస్తూ ఉంటుంది.  ఈ శక్తివల్లనే మనము మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము.  అంతే కాదు, దైవికశక్తిని కూడా చూడగలుగుతున్నాము.

(11 ఇంద్రియములు…పంచేంద్రియములు – 5  అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము… కర్మేంద్రియములు 5 అవి. పాదములు, చేతులు, పాయువు, జననేంద్రియములు, నోరు…పదకొండవది.మనస్సు (బుధ్ధి).)
 మనము “ఓమ్ నమశ్శివాయ’ లేక “ఓమ్ నమోనారాయణాయ’ అని గాని లేక మన హృదయంలో ఏభగవంతుడు ఉంటే ఆయన నామాన్ని జపిస్తూనే ఉండాలి.  దాని ఫలితం వల్ల మన ఆత్మ చూట్టూరా ఉన్నటువంటి పంచకోశములు ఛేదింపబడతాయి.
అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకోశము, జ్ఞానమయకోశము, ఆనందమయకోశము, ఇవి పంచకోశములు.


(కోశము అనగా ఒర అని అర్ధము.  ఒరలో కత్తి ఏవిధముగా ఉంటుందో ‘ఆత్మ’ కోశములనే గుహలలో ఉంటుంది.  ఈ కోశములన్నీ ఒకదానిలో మరొకటి ఉండటం వలన, గుహ అనబడుతోంది.  వీటన్నిటికి లోపల ‘ఆత్మ’ ఉంటుంది.  అనగా ఇవి ఆత్మను ఆవరించి ఉటాయి.  స్థూలదేహమే అన్నమయ కోశం.  దీనిలోపల ప్రాణమయకోశమ్, దీనికంటే లోపల మనోమయకోశము. దాని లోపల విజ్ఞానమయ కోశము ఉంటాయి.  ఈ విజ్ఞానమయకోశమే ‘కర్త’.  విజ్ఞానమయ కోశమునకు లోపల ఆనందమయ కోశము ఉంటుంది.  ఇదే భోక్త.)
భగవంతుని నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నపుడు మనం స్థిరంగా నిరంతరం ఈ భావనతో ఉండాలి.  “హే! భగవాన్, నువ్వు సర్వత్ర నిండి ఉన్నావు.  ప్రతిదానిలోను, సకల జీవరాశులలోను ఉన్నావు.  ఆవిధంగా నాలో కూడా నువ్వు ఉన్నావు.  నాలో ఉన్న శక్తివి నీవే.  అటువంటపుడు నీకు, నాకు భేదము లేదు” ఈ విధమయిన భావన మనకు ఎంతగానో ఆనందాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది.  క్రమక్రమంగా భగవంతుని గురించి తెలుసుకునే స్థాయికి చేరుకోగలుగుతాడు మానవుడు.  మానవుడు తన మనస్సాక్షి చెప్పినట్లు నడచుకుంటాడు.  మన అంతరాత్మ ప్రభోధించినదానిని మనము పెడచెవిని పెట్టకుండా నడచుకోవాలి.  ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సన్యాసాశ్రమం గురించిన ప్రస్తావన వచ్చింది.  దాని గురించి వివరిస్తూ స్వామీజీ ఈ విధంగా చెప్పారు.  ‘సన్యాస’ అనగా సమదృష్టి.  సన్యాసమనేది మనసులోనే ఉంటుంది తప్ప బాహ్యరూపంలో ఉండదు.  నియమం ప్రకారం సన్యాసి ఏప్రదేశంలోనయినా మూడు రోజులకంటే ఎక్కువ ఉండరాదు.  ఆధ్యాత్మిక తృష్ణతో ఉన్నవారిని అనుగ్రహించడానికి సన్యాసి ఒక చోటనుండి ఇంకొక చోటకు సంచరిస్తూ ఉండాలి.  సన్యాసి ఒకేచోట నివసిస్తూ ఆస్థులను కూడబెట్టుకోరాదు.  దాని వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమయి అతని ఆధ్యాత్మికాభివృధ్ధికి ఆటంకం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మనమందరం భగవంతుని నుండి వచ్చినవారమే.  అందుచేత వాస్తవంగా చెప్పాలంటే మన లక్ష్యం కూడా భగవంతుని చేరుకోవడమే.  ఈ కారణం చేత పరిత్యాగం అవసరం.  అనగా మన కోరికలన్నిటినీ విడిచిపెట్టేయాలి.  ఆహారము, నివసించడానికి యిల్లు మొదలయిన సామాన్యమయిన కోరికలను మనము విడువనక్కరలేదు.  కాని మనము కోరుకోబోయే కోరికను ఎవరితోనయితే పంచుకోగలమో అటువంటి ఉత్తమయిన కోరికలను లభింపచేయమని ఆ భగవంతుడిని ప్రార్ధించాలి.  మనం భగవంతుడిని ఏమని కోరుకోవాలి? మనం జీవించడానికి సరిపడా ఆహారము, ఉండటానికి యిల్లు, ఇవి అవసరం.  మనకు అవసరమయినవాటికన్నా ఎక్కువగా మనము కోరుకోరాదు.  ప్రార్ధించే పద్ధతి ఏవిధంగ ఉండాలో స్వామీజీ వివరించారు.
“మనహృదయ కవాటాలను భగవంతుని కోసం తెఱచి ఉంచాలి అప్పుడే ఆయన మనలని అనుగ్రహిస్తాడు.  ఆవిధంగా చేయకుండా ఊరికే మంత్రాలను చదివినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.  బహుశ మీరు ‘శివం దద్లియామ జ్ఞానం’ అన్న గొప్ప వాక్యాన్ని వినే ఉంటారు.  అనగా ఆపరమ శివుడు మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని అర్ధం.  గీతలో భగవానుడు, ‘దద్దమి బుధ్ధియోగమ్’ అని చెప్పాడు  చివరికి ఆయనని చేరుకోవడానికి ఆయన మనకు బుధ్ధి యోగమును ప్రసాదిస్తాడు. 
“తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్
దదామి బుధ్ధియోగం తం యేన మాముపయాంతి తే
(అ.10 శ్లో.10)
(అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తిశ్రధ్ధ్లతో నన్నే భజించువారికి నేను బుధ్ధి, యోగమును అనగా తత్త్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను.  దాని ద్వారా వారు నన్నే పొందుదురు.)
శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ఎందుకని చెప్పబడింది.  దానికి కారణమేమిటంటే శివుడు ‘ముక్కంటి’.  ఆయనకు మూడు నేత్రాలున్నాయి.  ఆయన మాత్రమే జ్ఞాన నేత్రమయిన మూడవకన్ను తెరుచుకోగలిగేలా చేయగలడు.  

           Image result for images of lord siva
ఆ పరమశివుడు అర్జునునికి ఈ మూడవనేత్రమయిన దివ్యచక్షువుని ఆనందంగా ప్రసాదించాడు.  ఈవిధంగా జ్ఞాన చక్షువు  తెరచుకున్న తరువాత సత్సంగం ద్వారా మనము భగవంతుని చేరుకోగలము.  ఆయన అనుగ్రహం మనం పొందాలంటే మనమేమి చేయాలి?  గీతలో భగవానుడు ‘
(మయ్యార్పిత మనోబుధ్ధిః   …..)
తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ
మయ్యార్పిత మనోబుధ్ధిః మామేవైష్యస్యసంశయమ్
(అ.8 శ్లో.7)
(కావున ఓ అర్జునా!  నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము.  యుధ్ధమును (కర్తవ్యకర్మను) కూడా చేయుము.  ఈ విధముగా నీ మనోబుధ్ధులను నాయందే నిల్పియున్నచో నిజముగా (నిస్సందేహముగా) నన్నే పొందెదవు.)
అలాగే బాబా మనకు అభయాన్నిస్తూ చెప్పిన మాటలు.
“నాయేదవరిదృష్టో వారియందే నాదృష్టి” మీకు గుర్తున్నాయా?  అనగా దీనియొక్క అర్ధమేమిటి?  నీమనస్సును బుధ్ధిని ఆయనకు అర్పించినట్లయితే భగవంతుడు నిన్ను కనిపెట్టుకుని ఉంటాడు.  లౌకిక కోరికల కోసం తనవద్దకు  వచ్చేవారి గురించి బాబా చెప్పిన మాటలు. “ఎంతోమంది తమ తమ కోరికలు అది కావాలి ఇది కావాలి అని అడగడానికి నావద్దకు వస్తూ ఉంటారు.  కాని వారు భగవంతుని గురించి మాత్రం రారు.”  ఆయన ఈ మాటలను నానాసాహెబ్ చందోర్కర్, దీక్షిత్ యింకా మరికొందరితో అన్నారు.  ఒకసారి కొంతమంది భక్తులు బాబాని “బాబా మీరు పాత్రలని మసీదులో బోర్లించి పెడతారెందుకని?” అని ప్రశ్నించారు.  దానికి సమాధానంగా బాబా “ఈ పాత్రలలో ఏమీ  నింపడానికి ఆస్కారం లేకుండా బోర్లించి ఉన్నట్లుగానే, భగవంతుని అనుగ్రహం తమలోకి ప్రవేశించనీయకుండా ప్రజలు తమ హృదయాలను కూడా బంధించుకుని ఉన్నారు. అటువంటపుడు వారిలొ దైవసంబంధమయిన పరమానందాన్ని నింపడం ఏవిధంగా సాధ్యమవుతుంది?”
మనం సత్సంగంలో ఉన్నపుడు ఆసమయమంతా మన గురువు పాదాలపైన లేక భగవంతుని యందె ఏకాగ్రతతో ఉండాలి.  అలా కాకుండా మనసు యితర విషయాల మీదకి మళ్ళిస్తే సత్సంగం యొక్క ఉపయోగం ఏమీ ఉండదు.  మనసు భగవంతుని మీదనే కేంద్రీకరించి గాని, లేక అనాలోచితంగా (అనగా శరీరం సత్సంగం జరుగుతున్న చోటనే ఉంటుంది.  కాని నోరు మాత్రం అసంకల్పితంగా నామాన్ని జపిస్తూ ఉంటుంది) మనము భగవంతుని కీర్తిస్తూ గాని ‘గోపాలా, గోవిందా’ అంటు నామస్మరణ చేస్తూ ఉంటాము.   మన మనస్సును ఆయనకు అర్పణ చేసినప్పుడు ఆయన మన జ్ఞాననేత్రాన్ని వికసింపచేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.  భగవంతుడు మన హృదయకవాటాలను తెఱచి మనలోనే నిక్షిప్తమై ఉన్న వెలకట్టలేని సంపదయినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.
మరుసటిరోజు స్వామీజీ తమ ప్రసంగంలో చెప్పిన విషయాలు. “మనలోని ఆత్మ చెట్టుమీదనున్న పక్షిగూడు వంటిది.  రాత్రిసమయాలలో పక్షులు తమ గూటిలోకి చేరుకున్నట్లుగానే, మనము కూడా మన గూటిలోకి అనగా మనలోనున్న ఆత్మలోనికి చేరుకోవాలి.  అనగా ఒక వ్యక్తి ఆత్మలోనికి ప్రవేశించడమంటే అది సుషుప్తి అవస్థ.  మన ఆత్మని మనము ప్రతివారిలోను ప్రతిదానియందు చూడాలి.  ఆవిధంగా ఎవరయినా ఆకలితో అలమటిస్తున్నారంటే వారి ఆకలి బాధను మనము అర్ధం చేసుకోవాలి.  ఇతరులయొక్క సుఖదుఃఖాలను మనవిగా భావించాలి.  ఆవిధమైన ఆనందాన్ని అనుభవించే వ్యక్తి ప్రపంచంలో జీవించగలడు.  అతని నిశ్చలత్వానికి రవ్వంత కూడా భంగపాటు కలగదు. అటువంటి వ్యక్తి ప్రపంచ శ్రేయస్సు కొఱకై కర్మయోగాన్ని స్వీకరించగల జ్ఞాని.  అటువంటి వ్యక్తికి ఏవిధమయిన అనురాగాలు, బంధాలు ఉండవు. 
(కర్మసిధ్ధాంతం గురించిన వీడియోలు చూడండి)


ఇది అద్వైత మార్గమయితే, ద్వైత మార్గం కూడా ఉంది.  ఈ ద్వైత మార్గంలో భక్తుడు తాను జీవాత్మ అని, సర్వశ్రేష్టుడయిన భగవంతుడు పరమాత్మ అనే భావనలో ఉంటాడు.  జీవాత్మ రాధ యితే పరమాత్మ కృష్ణుడు. 
        Image result for images of krishna jayanti
చివరికి జీవాత్మ పరమాత్మలో ఐక్యమయిపోతుంది. ఆత్మలో మనలని మనము స్థిరపఱచుకోవడం ద్వారా మనము నిరంతరమయిన ఆనందాన్ని పొందగలము.
(స్వామీజీ సంభాషణలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List