17.07.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆత్రేయపురపు త్యాగరాజు - నిజాంపేట్ - హైదరాబాద్
సాయిలీలాస్.ఆర్గ్ నుండి సేకరింపబడిన ఈ వ్యాసాన్ని చదివిన తరువాత మనకు సాయిమీద ఎంత నమ్మకం, శ్రధ్ధ, భక్తి ఉన్నాయో పరిశీలించుకోవాలి. నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడం ఎలా అన్నది అర్ధమవుతుంది. దానికి అనుగుణంగా మనం ఆచరిస్తే తప్పక సత్ఫలితాలను, సాయి యొక్క నిరంతర అనుగ్రహాన్ని పొందగలం.
సాయిపై నమ్మకాన్ని ధృవపరచుకోవడం ఎలా?
సాయిభక్తులెందరో "ఓ! బాబా, నీపై నాకు నమ్మకం కలిగేలా చేయి" అని ఎంతో ఉత్సహంతో అంటూ ఉంటామని నాతో చెబుతూ ఉంటారు. ఇటువంటివారెనెందరినో చూశాను. నాకుమాత్రం యిటువంటి వ్యక్తులతో ఓర్పుగా వ్యవహరించడం కష్టసాధ్యమయిన పని. ఊరికే కూర్చుని నాకు సాయి మీద విశ్వాసం, భక్తి కుదరాలి అని అనుకున్న మాత్రం చేత ఏర్పడేవి కావు. మనం కారు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, ఈత నేర్చుకోవాలన్నా, ఊరికినే కుర్చీలో కూర్చొని నాకివన్నీ రావాలి అనుకుంటే వచ్చేవు కావు. కారు డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకోవాలి. అలాగే ఈతనేర్పేవారి వద్దకెళ్ళి ఈత నేర్చుకోవాలి. నేర్చుకున్న తరువాత అభ్యాసం చేయాలి. అప్పుడే మనం వాటిలోని మెళకువలు నేర్చుకొని ప్రావీణ్యం సంపాదిస్తాము.
అలాగే మన జీవితంలో మనకు సాయిబాబా బలీయమైన స్థానం పొంది స్థిరంగా నిలచిపోవాలనుకున్నా యిదే సూత్రం వర్తిస్తుంది.