19.08.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిలీల ద్వైమాస పత్రిక
మే – జూన్ 2015 సంచికలో ప్రచురించిన మరొక అధ్భుతమైన బాబా ఊదీ మహత్య్మాన్ని తెలుసుకుందాము.
ఊదీ - బాబా తన భక్తులకు ప్రసాదించిన వరమ్
1988 వ.సంవత్సరంలో నాకు
ఫిస్టులా వచ్చింది. ఫిస్టులా వల్ల ఏర్పడిన
వ్రణం కారణంగా ప్రేవుల మీద కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. ఫిస్టులాకి నివారణ సర్జరీ చేయించడం ఒక్కటే మార్గం
కాని చాలా కొద్దిమందికి మాత్రం సర్జరీ అవసరం లేకుండానే దానంతటదే తగ్గిపోతుంది. ఈ ఫిస్టులా అనేది ఒక జబ్బు. సర్జన్ నేర్పరితనం మీదనే సర్జరీ విజయవంతంగా జరుగుతుంది.