28.02.2014 శుక్రవారము (విజయవాడనుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మీకు శ్రీవిష్ణుసహస్రనామం, శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియచేస్తున్నాను. ఎప్పటికప్పుడు మన బ్లాగులో ప్రచురణకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాని యాత్రలు చేయడంవల్ల మరి యితరకారణాల వల్ల ఆలశ్యమవుతూ ఉంది. అన్యధా భావించవద్దు. కెనడానుండి శ్రీనగిశెట్టి రమేష్ కుమార్ గారు ఈ విషయాలన్నిటినీ తెలియచేస్తున్నారు. ఇక చదవండి.
డీ వీ డీ వల్ల ప్రయోజనాలు
షిరిడీ సాయిబాబావారి అనుగ్రహాన్ని పొందడమేలా?
ప్రతీ రోజు మీరు మీ యింటిలో షిరిడీసాయిబాబా వారి హారతులు, కాకడ హారతి, మధ్యాహ్న్న హారతి, ధూప్ హారతి, శేజ్ హారతి అన్నీ డీ.వీ.డీ లో వినవచ్చును.
సాయి భక్తులందరి కోసం బాబా హారతులన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు, డీ.వీ.డీ లను ఉచితంగా పంచడానికి అనుమతినిచ్చిన శ్రీ కె.వీ.పీ.రమణి, షిరిడీ సాయి ట్రస్ట్ చెన్నై గారికి ధన్యవాదాలు. డీ.వీ.డీ లో శ్రీ సాయి సత్ చరిత్రను కూడా వినవచ్చు. మొత్తం అన్ని అధ్యాయాలు వినడానికి 6 గంటల సమయం పడుతుంది. తెలుగులో శ్రీసాయి సత్ చరిత్ర, చాలీసాలను కూడా భక్తుల సౌకర్యం కోసం డీ.వీ.డీ లలో చేర్చడానికి అనుమతినిచ్చినందుకు శ్రీ కె.రాజేంద్రప్రసాద్, హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు.