13.02.2018 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మహాశివరాత్రి శుభాకాంక్షలు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
(ముందుగా మహాశివరాత్రి సందర్భంగా మధురమైన భక్తి గీతం వినండి)
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 8 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
04.08.1971 : ఈ రోజు మరలా గ్రహణం గురించే స్వామీజీ వివరించారు. చూడండి, మీకు ఇంతకుముందే 6వ.తారీకు రాత్రి 11.30 నుంచి తెల్లవారుఝాము 3 గంటల వరకు సంభవించబోయే గ్రహణం గురించి చెప్పాను. ఆ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ చేయమని చెప్పాను. కొంతమంది గ్రహణ సమయంలో కొన్ని శక్తులు లభించడానికి ‘సిధ్ధిమంత్రాలను’ జపిస్తారు. మనకు అటువంటి మంత్రాలు అవసరంలేదు.