13.02.2018 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మహాశివరాత్రి శుభాకాంక్షలు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
(ముందుగా మహాశివరాత్రి సందర్భంగా మధురమైన భక్తి గీతం వినండి)
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 8 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
04.08.1971 : ఈ రోజు మరలా గ్రహణం గురించే స్వామీజీ వివరించారు. చూడండి, మీకు ఇంతకుముందే 6వ.తారీకు రాత్రి 11.30 నుంచి తెల్లవారుఝాము 3 గంటల వరకు సంభవించబోయే గ్రహణం గురించి చెప్పాను. ఆ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ చేయమని చెప్పాను. కొంతమంది గ్రహణ సమయంలో కొన్ని శక్తులు లభించడానికి ‘సిధ్ధిమంత్రాలను’ జపిస్తారు. మనకు అటువంటి మంత్రాలు అవసరంలేదు.
మనకు అన్నిటికన్నా అత్యుత్తమమయిన మంత్రం ఉంది. అదే విష్ణుసహస్రనామం. ఆయనను కీర్తించడానికి వేయినామాలు ఉన్నాయి. ఆ వేయి నామాల ద్వారా ఆయనను స్ఠుతిస్తూ ఉన్నాము. “హే భగవాన్! నువ్వు యింకా యితర మంత్రాలను కూడా సృష్టించావు. కాని మాకు అవి అవసరం లేదు. మాకు నువ్వే కావాలి” అని ఆయనకు చెప్పుకుంటాము. మనం విష్ణుసహస్రనామ పారాయణ చేస్తున్నామంటే వాస్తవానికి ఆయనను పిలుస్తున్నట్లే లెక్క.
“నేను నీవాడిని, నువ్వు నావాడివి” అని ఆ దేవునికి మనం చెప్పుకుంటే చాలు. ఒకానొక సందర్భంలో బాబా ఈవిధంగా చెప్పారు. “ఒకసారి నాకు చాలా బాధ కలిగింది. గుండె దడదడలాడింది. ప్రాణం
విలవిలా కొట్టుకొంది. తగ్గే ఉపాయం కనిపించలేదు. అట్టి కష్టసమయంలో ఈ పుస్తకమెంత ఉపయోగపడిందో నీకెలా చెప్పను. దీని ద్వారా నాప్రాణాలు దక్కాయి. ఒక్క క్షణం దీనిని గుండెలకు హత్తుకున్నాను. తక్షణం
ప్రాణం చల్లబడింది.” బాబాకు
అటువంటి బాధ కలగలేదు. ఎవరో ఒక భక్తునికి ఆ విధమయిన బాధ కలిగి ఉండవచ్చు. ఆ భక్తుని క్షేమం కోసం బాబా విష్ణువుని ప్రార్ధించి ఉండవచ్చు. బాబా యింకా యిలా అన్నారు. “హరి నాహృదయంలోకి ప్రవేశించాడు. ఆయన నా హృదయం." బాబాయే
స్వయంగా విష్ణుసహస్రనామ పారాయణ గురించి అంత గొప్పగా చెప్పినపుడు మనము కూడా పారాయణ చేసి దానియొక్క ఫలితాన్ని పొందలేమా? శ్రీమహావిష్ణువే పరమాత్మ. ఆయన సర్వశక్తిమంతుడయిన పరమాత్మ, సర్వాధికారి. మనము విష్ణుసహస్రనామ పారాయణను దుష్టశక్తులను పారద్రోలడానికే కాక మన ఆరోగ్యం గురించి కూడా చేయవచ్చు. మన ఆధ్యాత్మిక సాధనలో కలిగే అడ్డంకులను కూడా తొలగించడానికి దోహదపడుతుంది.
మీకొక ఉదాహరణ చెబుతాను. ఒకపెద్ద మనిషి నావద్దకు వచ్చి తాను ధ్యానం చేయడం ప్ర్రారంభించెనపుడెల్లా ధ్యానానికి తనకు మధ్యలో ఒకవిధమయిన నీడ వచ్చి తన ధ్యానానికి భంగం కలిగిస్తోదని చెప్పాడు. అవుడు నేను, “నువ్వేమీ చింత పెట్టుకోకు. విష్ణుసహస్రనామం ప్రారాయణ చేస్తూ ఉండు. నీకేదో అవరోధం కలిగి నిన్ను కలత పెడుతూ ఉంది. ఆ అడ్డంకి ఖచ్చితంగా తొలగిపోతుంది. విష్ణుసహస్రనామ పారాయణను మాత్రం ఆపవద్దు” అని ఆయనకి సలహా యిచ్చాను.

09.08.1971
: నేటి ఆధునిక యుగంలో మానవునికి కలుగుతున్న అశాంతిని గురించి చెప్పారు. “నేడు మానవునికి ఎన్నో కోరికలు వెంటాడుతూ ఉన్నాయి. ఏదీ అతనిని సంతృప్తి పరచలేకపోతూ ఉంది. కోరుకున్న కోరికలన్నీ తీరతాయా? అది సాధ్యమేనా? ప్రస్తుత
తరానికి సంతృప్తి అనేది లేదు. మనకి మనం కాస్త ఆత్మవిమర్శ చేసుకుంటే, భగవంతుడు మనకి బుధ్ధినిచ్చాడని బోధపడుతుంది. దానిని
మనం ఏవిధంగానయినా ఉపయోగించుకోవచ్చు. అందుచేత మనం అన్ని ‘కామాలని’ (కోరికలని) పారద్రోలి ‘కామ’ స్థానంలో ‘రామ’ ని వెతకాలి. ప్రతివారు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ అందులోనే నిమగ్నమయి ఉంటారు తప్పితే భగవంతుని గురించి మాత్ర్తం ఆలోచించరు. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలయినా భగవంతుని కోసం మనం కేటాయించలేమా? ఈ ప్రపంచంలో మానవుడు తాను సాధించిన విజయాలగురించి తనకు తాను గొప్పగా భావించుకుంటూ ఉండవచ్చు. కాని అతనికి మనశ్శాంతి ఉంటుందా? నేటి మానవునికి స్వఛ్ఛమయిన మనస్సు ఉందా? అది ఉన్నపుడె అతనికి నిజమయిన శాంతి ఉంటుంది. ముఖ్యంగా
ముందుగా మనకి కావలసినదేమిటంటే ఈ ప్రాపంచిక బంధాలనుండి మనం తప్పించుకోవాలి. దానికోసం
మనం భగవంతుని ఈ విధంగా ప్రార్ధించాలి. “హే!భగవాన్, భార్యా, పిల్లలు, గృహం యింకా నాకున్న సంపద ఇవేమీ నావి కావు. అంతా నీదే” అంతే కాకుండా “హే! భగవాన్, నేను కూడా నీవాడినే. ఆఖరికి ఈ శరీరం కూడా నాది కాదు. నేను కూడా నీవాడినే. నాలో ఉన్నది నీవు మాత్రమే.”
ఈవిధమయిన భావాన్ని పెంపొందించుకుంటే అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. అటువంటి వ్యక్తి తరతమ భేదాలు చూడడు. అటువంటి వ్యక్తి దృష్టిలో తనవారయినా, కాకపోయినా అందరూ సమానమే. ఆవిధంగా అందరూ సమానమే అనే భావంతో ఉన్న వ్యక్తిలో ఎటువంటి ద్వేషభావం ఉండదు. మనం భగవంతునికి ఎంత దగ్గరగా ఉన్నామనే దానికి నిజమయిన పరీక్ష ఏమిటంటే ఎంతవరకు ద్వేషాన్ని మనం జయించగలగాము అన్నదే.శ్రీకృష్ణ పరమాత్మ “మయ్యార్పిత మనోబుధ్ధి…….” అని చెప్పాడు. (భగవద్గీత అ. 8 శ్లో.7).

నీకున్న సంపదనంతా ఆ భగవంతునికి త్యాగం చేయవచ్చు. సంపదనంతా
భగవంతునికి సమర్పించినంత మాత్రాన పూర్తయినట్లుకాదు. నీ బుద్ధిని, మనస్సును కూడా భగవంతునికి అర్పణ చేయాలి.
(ఈసందర్భంగా SAYIBABA'S TEACHINGS & PHILOSOPHY by.Lt.Col.M.B.Nimbaalkar గారు వ్రాసిన పుస్తకంలోని విషయాన్ని ప్రస్తావిస్తాను. ఈ పుస్తకాన్ని శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసి మన బ్లాగులో కూడ ప్రచురించాను. మీకోసం మరలా శరణాగతి గురించిన భాగాన్ని అందిస్తున్నాను.
భక్తిమార్గంలో తొమ్మిదవది ‘ఆత్మనివేదన (శరణుజొచ్చుట)
అనగా పూర్తిగా తనకు తాను భగవంతునికి అర్పించుకొనుట. అంతేకాకుండా భక్తుడు తన భార్యాపిల్లలనే కాక మొత్తం తన స్థిరచరాస్థులను కూడా భగవంతునికి అప్పగించి సర్వశ్య శరణాగతిని వేడుట. అహంకారాన్ని కూడా వదలివేసి తాను చేసిన పనులన్నిటినీ తాను పూజించే భగవంతునికి గాని, గురువుకు గాని అర్పించుట. నవవిధభక్తులలో ఆత్మనివేదన భక్తి చాలా ముఖ్యమయినది. సంత్.రామదాసు ఆత్మ నివేదన గురించి ఈ విధంగా చెప్పారు. ఆత్మ నివేదన లేక తనకుతాను అర్పించుకోకుండా మానవుడు జననమరణ చక్రాలనుండి తప్పించుకోలేడు. భక్తిలో
మొట్టమొదటిది స్మరణం అయితే ఆత్మనివేదన భక్తిలో చివరిది. అదే ఉత్తమస్థాయి. భక్తిలో పరాకాష్ట.
శ్రీసాయి సత్ చరిత్రలో ఆత్మనివేదన గురించి ఉదాహరణగా కాకాసాహెబ్ దీక్షిత్ గురించి చెప్పుకోవచ్చు. ఆయన బొంబాయిలో తను చేస్తున్న న్యాయవాదవృత్తిని,
అధికారహోదాని, ఆఖరికి తన భార్యాపిల్లలను కూడా వదలి తరచూ షిరిడీ వచ్చి చాలా రోజులు అక్కడే ఉండేవాడు. ఒకసారి ఆయన లండన్ లో ఉన్నప్పుడు రైలు ఎక్కుతుండగా జారిపడిపోయారు. కాలికి
దెబ్బతగిలి జీవితాంతం కుంటిగానే నడవవలసివచ్చింది. కాని ఆయన ఎప్పుడూ బాబాని తన కాలికుంటితనాన్ని బాగుచేయమని అడగలేదు. కాని ఆయన తన కాలికుంటితనం కంటే తన మనసుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమయిన ఆనందాన్ని కలుగచేయమని వేడుకొన్నారు. (అధ్యాయం –
50). మానసికంగాను, శారీరకంగాను. కాకాసాహెబ్, బాబాకు సర్వశ్య శరణాగతి చేశారు. ఒకసారి
కాకాసాహెబ్ ఒక మహారాజావారి కేసు వాదించినందుకు పెద్దమొత్తంలో ఫీజు ముట్టింది. ఆయన వెండినాణాలన్నిటిని ఒక పెద్ద ట్రంకుపెట్టిలో పెట్టి షిరిడీ వచ్చి బాబా ముందు పెట్టి, “బాబా యిదంతా నీదే” అన్నారు. అప్పుడు
బాబా “అవునా!” అని పెట్టి తెరచి రెండు చేతులతో నాణాలన్నిటినీ అక్కడున్న భక్తులందరికీ సంతోషంగా పంచిపెట్టేశారు. కొద్ది
నిషాలలోనే పెట్టంతా ఖాళి అయిపోయింది. ఆసమయంలో
నాగపూర్ సబ్ జడ్జి శ్రీ గార్డే, కాకాసాహెబ్ గారి మరొక స్నేహితుడు అక్కడే ఉన్నారు. వారిద్దరూ కాకాసాహెబ్ ముఖంవైపు తదేకంగా చూశారు. తను సంపాదించిన సొమ్మంతా క్షణాలలో లెక్కలేకుండా అందరికీ బాబా పంచిపెట్టేసినా కూడా కాకాసాహెబ్ ముఖంలో కించిత్తు విచారం కూడా కనపడకపోవడంతో వారిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. ఆయన పరిత్యాగం, తన సద్గురువుకు చేసిన సర్వశ్య శరణాగతి అపూర్వం, అద్వితీయం. )
అపుడే దేవుడు నీవద్దకు వస్తాడు. శ్రీకృష్ణపరమాత్మ ఇంకా యిలా చెప్పాడు. “అనన్యాశ్చింతయంతోమాం ……..” అనగా మన మనసెప్పుడూ ఆయననే చింతిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన పూర్తిగా మన యోగక్షేమాలను చూస్తూ మనలని కనిపెట్టుకుని ఉంటాడు. శ్రీరామచంద్రులవారు చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొనండి. “అభయం సర్వ భూతేషు…..” అనగా దీని అర్ధం ఏమిటి? “ఎవరయితే
నాపాదాల వద్ద నన్ను శరణు వేడుకుంటారో వారి యోగక్షేమాలను నేను వహింతును.” కాని ఆయన పాదాలవద్ద మనము ఏవిధంగా శరణు వేడుకోగలం? మనం భగవంతుని దర్శించుకోవడానికి
గర్భాలయంలోకి ప్రవేశించడానికి ఫాంటు, చొక్కాలను తీసి సామాన్యమయిన దుస్తులతో ప్రవేశిస్తాము. అదే విధంగా మన శరీరాన్ని కూడా బయటనే వదలి భగవంతుని సన్నిధానంలోకి ప్రవేశించాలి. అనగా మనస్సును భగవంతుని మీదనే కేంద్రీకరించాలని భావము. అంతేకాదు,
మన ఆలోచనలన్నీ కూడా భగవంతుని గురించే తప్ప మరే యితర ఆలోచనలు ఉండరాదు. మనం ప్రతిరోజు పూజలు ఏవిధంగా చేస్తున్నామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొనండి. పూజను ప్రారంభించేముందు
“పరమేశ్వర ప్రీత్యర్ధం….” అని చదివి పూర్తి చేసేముందు “కాయేనవాచా …….నారాయణేతి సమర్పయామి….” అని పూజ ముగిస్తాము.
మరి ఆవిధంగా పూజ చేయడమంటే ఎంత అధ్భుతమో కదా. పూజ అనేది ఆపరమేశ్వరునికి ప్రీతి కల్గించడానికి. ఆతరువాత పదార్ధాలన్నిటిని ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తాము. “ఈవిధంగా నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాను. అయినా గాని నాకు ఆకోరిక తీరలేదు ఈ కోరిక తీరలేదు” అని పూజ చేసిన తరువాత ఎవరయినా అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది? ఆయనను
సంతృప్తి పరచడానికి సంపూర్ణంగా పూజచేసి ఆయనకు నైవేద్యాన్ని సమర్పించిన తరువాత మన యోగక్షేమాలను ఆయనే చూస్తాడు. మనకేది
కావాలో దానినే మనకు ప్రసాదిస్తాడు. మనకేది
యివ్వాలో ఏది యివ్వకూడదో ఆయనకు బాగా తెలుసు. కాని మనం భగవంతునికి చేసే ప్రార్ధనలో న్యాయం ఉండాలి. విధేయత ఉండాలి. నువ్వు
భగవంతుని కీర్తిస్తూ భజనలు, పూజ, ప్రార్ధనలు చేస్తున్నావంటే అన్ని విషయాలను వదలిపెట్టి కేవలం భగవంతుని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండాలి.
ఈ విధంగా పూజలు సలిపినట్లయితే భగవంతుడు నీవు చేసే ప్రార్ధనలకు స్పందించి ఖచ్చితంగా ప్రతి విషయంలోను నీవద్దకు వస్తాడని నేను ఘంటాపధంగా చెబుతున్నాను. నేనీ విషయాన్ని అహంభావంతో చెప్పడంలేదు. నా స్వీయ అనుభవంతో మీకు చెబుతున్నాను. సాధారణంగా మానవుడు భయపడేది దేనికంటే ఆధ్యాత్మిక జీవనంలోకి ప్రవేశించినంతనే మనకున్న సంపదనంతటినే కాక ఆస్తులను కూడా కోల్పోవలసినదేనని. కాని ఒక్క విషయం గుర్తుంచుకొనండి. ఇటువంటి భయాలన్నీ కూడా రాక్షస శక్తుల ప్రాబల్యం వలన సంభవించేవే కాని మరేమీ కాదు. అదంతా మన ఆధ్యాత్మిక అభివృధ్ధికి ఆటంకం కలిగించడానికే. మనం అటువంటివాటిని గమనించిన వెంటనే క్రమక్రమంగా ఆవిధమయిన అడ్డంకులన్నిటినీ దాటుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి. ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం సరియైన దారిలో నడవడానికి అనగా భగవంతుని గురించి మనకు అవగాహన కలగడానికి అకస్మాత్తుగా మనకు ప్రియమైనవాటిని, అభిమానించేవాటిని ఆయన లాగేసుకుంటాడు.” స్వామీజీ
ఈవిధంగా వివరిస్తుండగా ఒక భక్తుడు “స్వామీజీ గురువు అనుగ్రహం వల్లనే భగవంతుని గురించి చేసే అన్వేషణలో కలిగే అడ్డంకులన్నీ తొలగుతాయని చెప్పబడింది కదా! అది నిజమేనా?” అని ప్రశ్నించాడు.
స్వామీజీ – “ గురువు పరిపూర్ణమయిన జ్ఞానం కలిగి ఉండి, శిష్యుడు కూడా అటువంటి గురువుకు తగినవాడయినట్లయితే అది నిజమే. ఉదాహరణకి శ్రీరామకృష్ణపరమ హంస పరిపూర్ణమయిన జ్ఞాని. స్వామి వివేకానంద పరిణతి పొందిన శిష్యుడు. ఆవిధంగా గురువు అనుగ్రహంతో భగవంతుని గురించి తెలుసుకోవాలంటే శిష్యుడు అటువంటి పరిపూర్ణుడయి ఉండాలి. ఈ రోజులలో ధ్యానం నేర్చూకోవాలంటే ఉపదేశం పొందాలనే ఒక విధమయిన మోజు ప్రజలలో కనపడుతూ ఉంది. ఈవిధమయిన
మార్గం సన్యాసికే తగినది. కాని, ఎక్కువమంది ప్రజలకి మాత్రం సులభమయిన మార్గం భక్తి ఉంటే చాలు. ఎవరూ కూడా ఒక్కసారిగా ధ్యానమార్గంలోకి దుమికేయకూడదు. అందుచేత మనకి క్షేమకరమయినది, శ్రేష్ఠమయినది భగవన్నామస్మరణ మాత్రమే. దానినే
మనం ఆశ్రయించాలి. ఆభక్తుడే
మరలా ఈ విధంగా ప్రశ్నించాడు. “ఊరికే
కూర్చుని భగవన్నామస్మరణ చేయడమంటే అది పనేమీ చేయకుండా సోమరిగా కూర్చోవడం కాదా?”
స్వామీజీ : “అది ఏపనీ చేయకుండా ఊరికే కూర్చుని ఉండటం ఏవిధంగా అవుతుంది? నువ్వు
ఒక క్లబ్ కి గాని, హోటల్ కి గాని, సినిమాకు వెళ్ళినా అది కూడా ఏపనీ చేయకుండా ఉండటం కాదా? మరొక విధంగా చూస్తే భగవంతుని గురించి తెలుసుకోవడానికి చేసే ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయి ఉండటం అనేది అత్యుత్తమమైన క్రియ కదా. నేను నిన్ను అడిగిందేమిటి? కనీసం పదినిమిషాలు భగవంతునికోసం కేటాయించమన్నాను.
గంటలకొద్దీ సమయాన్ని వృధాగా గడిపే కార్యకలపాలతో పోల్చుకుంటే అది ఊరికే సోమరిగా కూర్చోవడం ఎలా అవుతుంది? భగవంతుడిని ప్రార్ధించే సమయంలో మానవునియొక్క వైఖరి గురించి ప్రస్తావిస్తూ భగవంతునికి ‘శరణాగతి” చేస్తున్నామనే భావన కలిగి ఉండాలని చెప్పారు. శరణాగతికి ప్రతీక మారుతి అని జ్ఞప్తి చేసుకోండి. మారుతి శ్రీరామచంద్రుని పాదాల వద్ద ఏవిధంగానయితే శరణాగతి చేస్తూ ఉన్నాడో అదే విధమయిన స్ఫూర్తి మనకు కూడా ప్రసాదించమని భగవంతుడిని వేడుకోవాలి.
అదే ఉత్తమమయిన పధ్ధతి. మారుతి అవలంబించిన విధానాన్నే మనం కూడా అనుసరిస్తే శ్రీరామచంద్రమూర్తి మనలని తప్పక రక్షిస్తాడు. రాముడు ఎక్కడ ఉన్నాడు? ఆయన అయోధ్యలో మాత్రమే లేడు. ఆయన సర్వాంతర్యామిగా ప్రతిచోటా ఉన్నాడు. మారుతి ఎక్కడ ఉన్నాడు? మన బుధ్ధే మారుతి. అనగా మన బుధ్ధి మారుతి ప్రవర్తనలాగ ఉండాలి. శ్రీకృష్ణపరమాత్మయందు గోపికల దృష్టిని కూడా మనం అనుసరించవచ్చు.
ఏసందర్భంలోనయినా సరే మనం ప్రార్ధన చేయవలసిందే. “ఓ! భగవాన్, నేనెక్కడినుంచి వచ్చానో నాకు తెలియదు. ఎక్కడికి వెడతానో తెలియదు. నేనెక్కడినుంచి వచ్చానో అక్కడికే నన్ను తీసుకునివెళ్ళు” భగవంతునికి శరణాగతి చేసే మార్గాన్ని అనుసరించేటప్పుడు ఈ ఐహిక ప్రపంచముతో అనుబంధం ఉండకూడదు. ఆవిధానాన్ని కూడా మనం అలవరచుకోవాలి. ఈప్రపంచంలో మనము ప్రజలతోను, స్నేహితులతోను, బంధువులతోను కలిసి తిరుగుతున్న సందర్భంలో మనమంతా భగవంతునికి చెందినవారమనే భావంతో ఉండాలి. ప్రతివాడు ఆ భగవంతునికి చెందినవాడేననే భావంతో ప్రతివారికి మనం సేవచేయాలి.” స్వామీజీ ఈవిధంగా ప్రసంగిస్తున్న సమయంలో ఒక భక్తుడు జాతకం ప్రకారం తన కుమారుడు కుజదోషం వల్ల బాధపడుతూ ఉన్నడని స్వామీజీకి చెప్పుకున్నాడు. స్వామీజీ వెంటనే సమాధానమిస్తు “అత్యధిక శక్తి కలిగిన గురువుయొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేస్తు ఉన్నపుడు, నవగ్రహాల ప్రభావం గురించి నువ్వేమీ చింతించకు.

హే! భగవాన్, నేను నీవాడిని. నాకేమీ
తెలియదు. నువ్వే నాయోగక్షేమాలను చూడాలి” అని ప్రార్ధించాలి. ఇదే శరణాగతి. నవగ్రహాల
ప్రభావం మనమీద పడకుండా ఈశరణాగతి అత్యధికమయిన శక్తినిచ్చి కాపాడుతుంది.
(అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment