Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, February 23, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 9 వ.భాగమ్

Posted by tyagaraju on 7:31 AM
       Image result for images of shirdisaibaba
        Image result for images of rose hd
23.02.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయిజయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
  శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.   SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు.     ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు.  సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ – 9 .భాగమ్
తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు

20.08.1971  ఈ రోజు స్వామీజీ కొన్ని పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.  ‘గోకర్ణం లో రావణునిచే పూజింపబడిన శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు.  భగవంతుడు మానవులయొక్క గుణాలను బట్టి, స్వభావాలనుబట్టి వారిని అనుగ్రహిస్తాడు.  


విభీషణుని గుణాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, శ్రీరామచంద్రుడు రంగనాధుని విగ్రహాన్ని వరంగా ప్రసాదించాడు.  గణపతికి రంగనాధుని విగ్రహం శ్రీలంకలో ఉండటం యిష్టం లేదు.  దానికి కారణం ఆవిగ్రహం శ్రీలంకలో ఉన్నట్లయితే దానియొక్క ప్రభావం కోల్పోతుందని.  విభీషణుడు ఆవిగ్రహాన్ని శ్రీలంకకు తీసుకునివెడుతూ సాయంత్రమయేటప్పటికి, కావేరి నది ఒడ్డున ఆగాడు.  ఆసమయంలో విఘ్నేశ్వరుడు ఆవుల కాపరి రూపంలో ఎదురు పడ్డాడు.  విభీషణునికి సంధ్యావందనం చేసుకునే సమయం ఆసన్నమవడంతో, ఆవుల కాపరిగా ఎదురుపడ్డ గణపతికి, విగ్రహాన్ని ఇస్తూ, తాను సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చేవరకు దానిని పట్టుకుని ఉండమని చెప్పాడు.  విగ్రహాన్ని క్రింద పెట్టినట్లయితే అక్కడే స్థిరంగా ఉండిపోతుందని జాగ్రత్తగా తను వచ్చే వరకు ఆగమని, ఈ లోపులో క్రింద పెట్టవద్దని జాగ్రత్తలు చెప్పాడు. అపుడు గణపతి తాను విగ్రహం బరువు మోయలేకపోతే మూడుసార్లు పిలుస్తానని ఆలోపుగా రాలేకపోతే విగ్రహాన్ని క్రింద పెట్టేస్తానని చెప్పాడు.  
       Image result for images of ranganatha
ఆవిధంగా విభీషణుడు సంధ్యావందనం చేసుకుంటుండగా, ఆవులకాపరిగా ఉన్న విఘ్నేశ్వరుడు వెంటవెంటనే మూడుసార్లు పిలిచి విగ్రహాన్ని ఆకావేరీ నది ఒడ్డునే క్రిందపెట్టేశాడు.  విభీషణుడు కోపంతో ఆవులకాపరిని కొట్టబోగా అతను పరిగెత్తుకునివెళ్ళి దగ్గరలో ఉన్న చిన్న గుట్టమీదకెక్కి అక్కడ తన నిజరూపంతో కూర్చున్నాడు  విభీషణుడు అతన్ని తరుముకుంటూ వెళ్ళి విఘ్నేశ్వరుని తలమీద కొట్టగా వినాయకునికి బొప్పి కట్టింది.  ఇదేవిధంగా రావణాసురుడు కూడా గోకర్ణంలో శివలింగాన్ని  క్రిందపెట్టేలాగ చేసాడు గణపతి.  పరమేశ్వరుడు రావణాసురునికి ఎటువంటి చెడు చేయలేదనే విషయాన్ని మనం గుర్తించాలి.  ఈ ప్రకారంగా అటువంటి వ్యక్తులకు భగవంతుడు యిచ్చే ఆశీర్వాదం ఈ విధంగా ఉంటుంది.
(గోకర్ణం గురించిన వివరణ చూడండి)


        Image result for images of desires
ఆ తరువాత స్వామీజీ సాధారణంగా మానవునికి కలిగే రకరకాల కోరికలను గురించి ప్రస్తావించారు.  ఈ కోరికలవలననే మానవుడు భగవంతునికి దూరంగా ఉండి చేరువ కాలేకపోతున్నాడని అన్నారు.  మానవుడిని భగవంతునికి దూరంగా తీసుకునివెళ్ళడానికి కారణమయిన రెండు ముఖ్యమయిన సమస్యల గురించి చెబుతాను.  అవి ఏవంటే ఒకటి కామము (శృంగారసంబంధమయినది), రెండవది ఆకలి.  భగవదనుగ్రహం వల్ల ‘కామాన్ని అధిగమించవచ్చు.  ఒక స్త్రీయందు కొడుకుయొక్క భావాలు ఏవిధంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి.  తనకు ఎదురుపడ్డ స్త్రీని చూసి "ఈమే కనక నాతల్లి అయి ఉంటే ఈమెకు నేను కుమారునిగా ఉండేవాడిని అని అనుకుంటాడు.  మనకన్నా వయసులో చిన్నగా ఉన్న స్త్రీ కనపడితే ఆమెను మన కూతురుగా గాని సోదరిగా గాని భావిస్తాము.  కాని ఎంత ప్రయత్నం చేసినా గాని మనలో కలిగే శృంగార భావనలను (కామకోరిక) అణుచుకోలేకపోయినపుడు మనకున్న ఒకే ఒక్క మార్గం భగవంతుని ఈవిధంగా వేడుకోవాలి, “హే భగవాన్! నాలో అటువంటి భావాలు కలుగజేయకు.  నామనసులో కలిగే అటువంటి ఆలోచనలను తరిమివేయి.  నిరంతరం నాయోగక్షేమాలను గమనిస్తూ ఈ విధంగా వచ్చే ఆలోచనలను తొలగించు ఈవిధంగా ప్రార్ధిస్తే చాలు.  ఈవిధమయిన కోరికలే మానవుడిని భగవంతునినుంచి దూరం చేస్తాయనే విషయాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలి.  మాయ ప్రభావంవల్లనే మన మనస్సు సులభంగా భగవంతునినుంచి దూరంగా ఉంటుంది.  మన మనస్సుని భాగాలుగా విభజించినట్లయితే ఒక భాగం ధనానికి, ఒక భాగం భార్య, సంతానం, పేరు ప్రఖ్యాతులకి కేటాయించినపుడు మనసు చెల్లాచెదురయి భగవంతుని కోసం కేటాయించడానికి ఏమీ మిగలదు.  
             Image result for images of family love
అందుచేత ఈ విధంగా విభజించబడిన మనస్సును ఏకం చేసి పూర్తిగా భగవంతుని కోసమే కేటాయించాలి.   ఆఖరికి గొప్పగొప్ప వ్యక్తులు కూడా కామకోరికలకు బానిసలయి శలభంలా మాడిపోయారు.  అందుచేత మనం ఎల్లప్పుడు అతి జాగరూకులమై ఉండి భగవంతుడు మనకు పెట్టే పరీక్షలన్నిటినీ అధిగమించాలి.  చిన్న కోరిక కూడా భగవంతునినుంచి మనలని దూరంగా లాక్కుని వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 

ఆతరువాతి సమస్య ఆకలి.  మనం బ్రతకడం కోసం మాత్రమే తినాలి తప్ప, తినడం కోసం కాదు బ్రతికేది.  భగవంతునికి చేరువకావడానికి మన పూర్వీకులు మనకు ఎన్నో మంత్రాలను నిర్దేశించారు.  భోజనం చేసేముందు పఠించవలసిన కొన్ని మంత్రాలను కూడా సూచించారు. 
Image result for images of mantras praying before meals
 ప్రయాణమయి వెళ్ళడానికి ముందు  కూడా పఠించవలసిన మంత్రాలున్నాయి.  భోజనం చేసేసమయంలో కూడా మనం మన తృప్తి కోసం ఈపదార్ధాలు మనకు చాలా యిష్టమయినవి అందుకనే తింటున్నామని ఆలోచించరాదు.  సాధారణంగా మనం భోజనం చేసేముందు పదార్ధాల యొక్క రుచుల గురించి, వాటిని ఏవిధంగా తయారు చేసారు అనే విషయాల గురించే ఆలోచిస్తాము.  ఈ పధ్ధతిని మనం మానుకోవాలి.  మన శరీర పోషణకోసం, మనకేది అవసరమో దానిని తినాలి.  అందుకనే తినడం కూడా యజ్ఞంలాగా భావిస్తారు. “అహం వైష్వానరో --- వైష్వానర అనేది మన కడుపులోని అగ్ని,  అదే జఠరాగ్ని అని భగవానుడు చెప్పాడు.  మనం అన్నం తినేముందుగా “హే భగవాన్! వైష్వానర రూపంలో ఉన్న నీకోసం, నిన్ను తృపిపరచడం కోసమే నేను భోజనము చేస్తున్నాను అని మనసులో భావించుకోవాలి.  మనము అన్నం తినేముందు ‘అమృతోపస్తరణమసి అని ఉచ్చరించాలని మన శాస్త్రాలలో చెప్పబడింది.  ఎంత గొప్పదయిన భావన మనకిచ్చారో కదా మన పూర్వీకులు.  దీని భావమేమంటే మనము తినే ఆహారం అమృతతుల్యమగుగాక.  మనము భోజనం చేసే సమయంలో ఈ భావాన్ని కనక మనసులో ఉంచుకుంటే మనకు అజీర్తి మొదలయిన కడుపులో సమస్యలు ఎందుకు వస్తాయి?  మంత్రాలను మనము అత్యంత విలువయిన సంపదగా మనకందించారు మన ఋషులు.  కాని మనము వాటిని ఉపయోగించటంలేదు. 


(అన్నము జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది --- దీనికి వివరణ క్రింద ఇచ్చిన లింక్ లో చూడండి)
https://www.hariome.com/how-does-food-gives-us-knowledge/

మనము వాహనంలో ప్రయాణించేముందుగా ఆసమయంలో చదవవలసిన మంత్రాన్ని వాహనం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చదివిన తరువాతనే వాహనాన్నధిరోహించాలి.  ఆవిధంగా చేసినట్లయితే ప్రమాదాలు జరుగుతాయనే భయం ఉండదు.

21.08.1971  స్వామీజీ ఈ రోజు మరలా వివిధ మంత్రాలను గురించి మాట్లాడారు.  “మంత్రాలను అపసవ్యంగా ఉఛ్ఛరించరాదు.  ఆవిధంగా చేసినట్లయితే మంత్రోచ్చారణ చేసేవానికి హాని కలుగుతుంది.  అందుచేత పుస్తకాలు చూసి అందులో ఉన్న మంత్రాలను చదవరాదు.  దానికి కారణమేమంటే పుస్తకాలలో మంత్రాలను ఏవిధంగా చదవాలో ఏపధ్ధతిలో స్వరయుక్తంగా చదవాలో చెప్పబడి ఉండదు.  ఆమంత్రాలను బాగుగా అధ్యయనం చేసినవారి ద్వారా మాత్రమే మనం నేర్చుకోవాలి.  ఉదాహరణకి మృత్యుంజయ మంత్రం “ఓమ్ త్రయంబకం యజామహే ----“ అన్న ప్రయోగ మంత్రం.  దానిని బాగా తెలిసినవారిద్వారా మాత్రమే నేర్చుకొని పఠించాలి.  ‘సుదర్శన మంత్రం లాంటి మరికొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి.

కొన్ని మంత్రాలున్నాయి.  వాటిని ఎవరిమీదనయితే పునరావృతం చేయబడతాయో వారికి హాని కలిగిస్తాయి.  ఆమంత్రాలకు అటువంటి శక్తులున్నాయి.  కోపాన్ని జయించనివారు అటువంటి మంత్రాలను మరలా మరలా ఉఛ్ఛరించరాదు.  వాటియొక్క శక్తి వారి శత్రువులను నాశనం చేస్తుంది.  ఇంకా చాలా మంత్రాలున్నాయి.  వాటి ప్రభావం ఇతరులకు హాని కలిగిస్తాయి. మనము అటువంటి మంత్రాలను నేర్చుకోరాదు.  అటువంటి మంత్రాలను నేర్చుకునేకన్నా అందరికీ మంచిని కలిగించి అనుగ్రహించే శక్తిగల మంత్రాలనే నేర్చుకోవాలి.  మన విరోధులు మనమీద మంత్రప్రయోగం చేయదలచి ప్రయోగించే మంత్రాల ప్రభావం మనమీద పడకుండా రక్షణకవచంలా మనలను కాపాడగలిగే దైవిక మంత్రాలు కూడా ఉన్నాయి.  ఆవిధంగా రక్షణనిచ్చే మంత్రాలలో విష్ణుసహస్ర నామం, సుదర్శన మంత్రాలు మొదలయినవి.  ఈ మంత్రాలు మనకు కావలసిన రక్షణను యిచ్చి మన చుట్టూ కోటను నిర్మిస్తాయి.  ఒక్కటి మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకొనండి.  మంత్రాలను సరియైన ఉఛ్ఛారణతోను, స్వరంతోను ఉఛ్ఛరించాలి.  అప్పుడే మంత్రోఛ్ఛారణ చేసేవానికి కోరుకున్న సత్ఫలితాలను యివ్వగలుగుతాయి.  ఉదాహరణకి ‘త్ర్యయంబకం యజామహే---‘ మంత్రాన్ని తీసుకోండి.  ఆమంత్రంలో ‘మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని ఉఛ్ఛరించేటపుడు ‘మృత్యో అన్న పదాన్ని ఉఛ్ఛ స్వరంతో పలకరాదు.  సాధ్యమయినంత వరకు అతి తక్కువ స్థాయిలో పలకాలి.  అనగా దాని అర్ధం ఏమిటంటే ‘మృత్యువు అన్న పదానికి ప్రాముఖ్యతనివ్వరాదు.  కాని ‘మామృతాత్ అనే పదాన్ని సాధ్యమయినంత వరకు దీర్ఘంగా ఉఛ్ఛస్వరంతో బిగ్గరగా ఉఛ్ఛరించాలి.  అది ‘అమృతత్వాన్ని సూచిస్తుంది.  అనగా ఆమంత్రాన్ని ఉఛ్ఛరించే వ్యక్తికి అమరత్వాన్ని సిధ్ధింపచేస్తుంది.

(ఒక ప్రముఖ గాయనీమణి పవిత్రమయిన గాయత్రీ మంత్రాన్ని సినిమా పాటలాగా పాడుతూ ఉన్న కాసెట్లు విడుదలయి సీ డీ లు కూడా వచ్చాయి.   ఆ మంత్ర పాటను సెల్ ఫోనులలో రింగు టోనులుగా పెట్టుకున్నవారు కూడా ఉన్నారు.  గాయత్రీ మంత్రాన్ని ఏవిధంగా పఠించాలో ఆవిధంగానే పఠించాలి తప్ప రాగ యుక్తంగా చదవవలసిన మంత్రం కాదది.  కనీసం ఇప్పుడయినా ఆ మంత్రాన్ని రింగు టోన్ గా పెట్టుకున్నవారు దయచేసి తొలగించండి.  దేవాలయాలలో కూడా ఆమె పాడిన మంత్రాన్నే వినిపిస్తున్నాను.  మరి పూజారులకి ఆమాత్రం జ్ఞానం లేదా?  ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, అధిపతులు ఉన్నారు.  వారు కూడా ఇప్పటికీ కూడా ఈ విషయం మీద తమ దృష్టిని ఎందుకని సారించలేదు?  మనకెందుకులే అని ఊరుకుంటున్నారా?  బాబా కులం ఏమిటన్నదాని మీద మాత్రం చర్చలకు తయారు.)

భగవంతునియొక్క పూజగురించి ప్రస్తావిస్తూ స్వామీజీ ఈవిధంగా చెప్పారు.  “మనలో వివిధ రూపాలలో భగవంతుడు నివసిస్తున్నాడు.  మనము ఆభావనను కలిగి మనలో భగవంతుడు నివసిస్తున్నాడనే యోచన కలిగి ఉండాలి.  భగవంతుడిని గురించి తెలుసుకోవాలంటే దానికి మూడు ప్రధానమయిన మార్గాలున్నాయి. 
1.        గురువునే దైవంగా భావించి పూజించడం.  ఈ విధానాన్ని మనకు బాబా ప్రబోధించారు.
2.       మనకు మనమే విశ్లేషణ చేసుకోవడం లేక ‘నేను ఎవరు రమణమహర్షి ఈ విధానాన్ని చెప్పారు.
                      Image result for images of nenu evadanu book by ramana maharshi

3.       శ్రీరామకృష్ణ పరమహంస అత్యంత తీవ్రమయిన భక్తిని ప్రబోధించారు.  కాళికాదేవి దర్శనాన్ని కోరి ఆయన చాలా తీవ్రంగా ఆమెను ‘అమా, అమ్మా!’ అని రోదిస్తూ ఉండేవారు. 

పైన చెప్పిన మూడు విధానాలలో మనము దేనినయినా పాటించవచ్చు.  నదులన్నీ సముద్రంలోకి వచ్చి చేరతాయని శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన విధంగానే ఆధ్యాత్మిక మార్గాలన్నీ కూడా భగవంతుని వద్దకే చేరతాయి.  ఆత్మజ్ఞానం పొందినవారిని భగవంతునిగా పూజించడానికి గల కారణం తమకు భగవంతునికి భేదము లేదని నిరూపించుకోవడమే. అటువంటి గురువులు త్రిగుణాలను దాటిపోయి ప్రశంసలకి, నిందలకి, కష్టసుఖాలని కూడా అధిగమించినవారు.

స్వామీజీ యింకా ఈ విధంగా చెప్పారు.  మనం జీవితంలో దేనియందు అనుబందాన్ని పెంచుకోరాదు.  ఏమయినప్పటికీ నీ భార్యా పిల్లలతో కలిసి జీవించాలి.  కాని ఆచరణలో నిర్లిప్తత ఉండాలి.  ఈ ప్రపంచంలో మనము ఏవిధంగా ఉండాలంటే జరిగేవాటిని గమనిస్తూ మనం సాక్షీభూతులుగా మాత్రమే ఉండాలి.  ఈ ‘నేను’ అన్నది సాక్షిగా మాత్రమే ఉండాలి.  అపుడు అహంకారం మన దరికి చేరదు.
అలా కాకుండా ఈ ఐహిక ప్రపంచంలోని విషయాలపై అనురక్తిని పెంచుకుంటే దానివలన ‘అహంకారం దానితోపాటే కోపం మొదలయినవన్నీ మనలోకి ప్రవేశిస్తాయి.  నువ్వు శరీరానివి కాదు, అంతకన్నా అత్యుత్తమమైన ఆత్మవి అని నువ్వు భావిస్తే నిన్నెవరు ఎగతాళి చేసినా అవమానించినా అవి నిన్ను బాధించవు, కోపాన్ని కలిగించవు.

ఆతరువాత చర్చాకార్యక్రమం శ్రీసాయిబాబావారి ముఖ్యోద్దేశ్యమయిన ‘శాంతి మీదకు మళ్ళింది.  స్వామీజీ బాబాగారి గురించి చెబుతూ ఉన్నారు.  బాబా ఎప్పుడూ ద్వేషబావాన్ని సహించేవారు కాదు.  ప్రజలంతా ఐకమత్యంతో కలిసిమెలసి మెలిగి జీవనం సాగించేలా చేయడం కోసమే ఆయన అవతరించారు.  ఒకసారి బాబా వ్యాహ్యాళికి వెళ్ళారు.  అక్కడ ఒక తటాకం దగ్గర పెద్ద సర్పమొకటి ఒక కప్పను తన నోటితో పట్టుకుని ఉంది.  అపుడు బాబా ఆరెండిటినీ ఉద్దేశించి “ఓయీ వీరభద్రప్పా (పాము) బసప్పా (కప్ప) మీశతృత్వాన్ని విడిచిపెట్టి శాంతంగా జీవించండి అన్నారు.  బాబా ఆమాటలను అన్న మరుక్షణం పాము తన నోటితో పట్టుకున్న కప్పను వదలివేసింది.  రెండూ శాంతంగా  వేటిదారిన అవి వెళ్ళిపోయాయి.  బాబా స్వయంగా వాటి గతజన్మ వివరాలను తెలిపారు.  గతంలో అవి మానవులని, భూమి తగాదాలో యిద్దరిమధ్యా శతృత్వం వల్ల ఈజన్మలో పాము, కప్పలుగా జన్మించి తమ శతృత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పారు.  బాబా వాటి శతృత్వాన్ని తొలగించి ప్రశాంతంగా జీవనం సాగించేలా అనుగ్రహించారు.  భగవంతుడు తప్ప అటువంటి అధ్భుతాలను మరెవరు చేయగలరు?  తుంగా నదీ తీరాన శ్రీశంకరాచార్యులవారు స్థాపించిన శృగేరిమఠం చరిత్రను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొనండి.  
              Image result for images of sringeri mutt
అప్పుడే గ్రుడ్లను పెట్టబోతున్న  కప్పకు ఒక త్రాచుపాము దానిని ఎండవేడిమినుండి కాపాడటానికి తన పడగ విప్పి రక్షణనిచ్చింది.  శంకరాచార్యులవారు ఆప్రదేశాన్ని పవిత్రమయినదిగా తలచి, ఆప్రదేశంలోని మఠం స్థాపించడానికి నిర్ణయించారు.

స్వామీజీ ---  "బాబాగారి వద్దకు ఒక సర్కస్ కంపెనీ వారు జబ్బుపడిన ఒక వ్యాఘ్రాన్ని తీసుకునివచ్చిన సంఘటన గురించి చెప్పారు.  తన దగ్గరకు తీసుకునివచ్చిన పులిని చూడగానే దానికి అంత్యకాలం సమీపించిందనే విషయాన్ని గ్రహించారు.   ఆపులి మసీదు మెట్లెక్కి బాబావైపు దీనంగా చూసింది.  బాబాకూడా ఆ పులివైపు దీక్షగా చూశారు.  కొద్ది నిమిషాలలోనే ఆ పులి తన తోకను పైకెత్తి మూడుసార్లు భూమిపై కొట్టి ప్రాణాలు విడిచింది.  బాబా ఆవ్యాఘ్రానికి ముక్తిని ప్రసాదించారు." 

కొంతకాలం క్రితం బరోడాలొ నాకు కూడా ఇటువంటి అనుభవమే కలిగింది.  అపుడు నేను సాయిభక్తుల సమ్మేళనానికి బరోడావెళ్లాను  అక్కడ నేను ఒక దంపతుల ఇంటిలో బసచేశాను.  ఒకరోజు ఆ దంపతులు నన్ను ఆ ఊరిలో ఉన్న జంతుప్రదర్శనశాలకు తీసుకుని వెళ్ళారు.  వారు అడిగినమీదట వారితో కలిసి వెళ్ళవలసివచ్చింది.  జంతుప్రదర్శనశాలలో అన్ని ప్రదేశాలు చూసుకుంటూ ఒక సింహం బోను దగ్గరకు వచ్చాము.  ఆ సింహం నన్ను చూడగానే క్రిందకి పైకి ఊగడం మొదలుపెట్టింది.  ఆరోజున నాకు ఆ సింహం మీద వాత్సల్యం కలిగింది.  ఎందుకనో నాకే తెలీదు నేను కూడా కొంతసేపు దానివైపే తదేకంగా చూస్తూ నిలబడ్డాను.  ఆ సింహం బోను చివరకు వెళ్ళి మరలా ముందుకి నేను నుంచున్న చోటకి వస్తూ నావైపు చూడసాగింది.  
              Image result for images of baroda zoo
నేనా సింహాన్ని ఉద్దేశించి నాలో నేనే ఇలా అన్నాను --- “మిత్రమా, నీకు నాకు మధ్య ఒక్కటే తేడా ఉంది.  నేను ఈ శరీరమనే బోనులో ఉంటే నువ్వు రెండు బోనులలో ఉన్నావు.  ఒకటి నీభౌతికశరీరమయితే రెండవది ఇపుడు నువ్వు ఉన్న ఈ బోను.”  కొంతసేపటి తరువాత అది ముందుకి, వెనక్కి వెళ్ళడం మానేసి నావైపే తేరిపార చూడసాగింది.  అకస్మాత్తుగా అపుడు బాబాగారు వ్యాఘ్రానికి మోక్షాన్ని ప్రసాదించిన సంఘటన నాలో మెదిలింది.  అపుడు నేను మవునంగానే బాబాను ప్రార్ధించాను.  “బాబా ఈ సింహానికి నాకు మధ్య గతజన్మల అనుబంధం ఏమిటో నాకు తెలీదు.  దయచేసి దానిని జననమరణ చక్రాలనుండి తప్పించి మోక్షాన్ని ప్రసాదించు.”  నేను ఆ సింహం బోను వద్ద పదినిమిషాలపాటు ఎందుకని ఉన్నానో అర్ధం కాక నన్ను తీసుకునివచ్చిన దంపతులిద్దరూ కాస్త విసుగు చెందారు.  ఇక ముందుకు వెడదాము రమ్మని బలవంత పెట్టారు.  ఆ తరువాత రోజునే నేను బొంబాయి వెళ్ళాల్సి ఉంది.  "నేను బొంబాయి వెళ్ళాక  మీరు కాస్త ప్రతిరోజు వచ్చి ఈ సింహం స్థితి ఎలాఉందో నేను మరలా తిరిగి వచ్చేంత వరకు చూస్తూ ఉండండి" అని ప్రాధేయపూర్వకంగా ఆ దంపతులని అభ్యర్ధించాను.  ఆవిధంగా వారు రోజూ ఆసింహం పరిస్థితి ఎలా ఉందో చూస్తూ వచ్చారు.  నేను బొంబాయినుండి తిరిగివచ్చిన తరువాత సింహం గురించి అడిగాను.  అపుడు వారు “స్వామీజీ, మీరు ఆ సింహాన్ని చూసిన రోజునుంచే అది ఆహారం తీసుకోవడం మానేసింది.  దాని సంరక్షకుడు దానికి తిండిపెట్టడానికి అన్ని విధాలుగాను ప్రయత్నించాడు.  కాని దానిచేత ఆహారాన్ని తినిపించలేకపోయాడు.  ఈ రోజునే ఆసింహం మరణించింది.” అని చెప్పారు.  ఆసింహం మరణించిందని తెలిసి చాలా విచారించాను.  కాని బాబా దానికి మోక్షాన్ని ప్రసాదించారనే నమ్మకం కలిగింది నాకు.  తరువాత స్వామీజీ తన గురువయిన నరసింహస్వామీజీగారి గురించి చెప్పారు.  నా గురువు సంపూర్ణంగా శ్రీరామ భక్తులు.  ఒకరోజు సాయంత్రం బెంగళూరులో భజన జరుగుతున్న సమయంలో మాగురువుగారయిన నరసింహస్వామిగారు శ్రీరామచంద్రులవారి ఫోటోలోకి ప్రవేశించడం కనిపించింది.  నాగురువు తమ శరీరాన్ని వీడి సమాధి చెందారని  వెంటనే నాకనిపించింది. జగద్గురు చంద్రశేఖర భారతి స్వామీజీ గారు సమాధి చెందినపుడు కూడా నాకలాంటి అనుభవమే కలిగింది.  ఒకరోజు సాయంత్రం మా కాలనీలో భజన జరుగుతూ ఉంది.  ఆసమయంలో భక్తులందరి ఎదుట జగద్గురు చంద్రశేఖర భారతి గారి పటాన్ని పెట్టాలనిపించింది.  వెంటనే నేను ఆయన పటాన్ని పెట్టి భజన కొనసాగించాము.  ఆరోజునే శృంగేరిలో స్వామీజీ తమ భౌతికదేహాన్ని వీడి సమాధి చెందారనే విషయం మరుసటిరోజు తెలిసింది.  రమణమహర్షిగారు తమ దేహాన్ని చాలించినపుడు కూడా నాకు ఇదే విధమయిన అనుభవం కలిగింది.  ఆతరువాత స్వామీజీ తను వ్రాసిన వ్రాతప్రతిలోని విషయాల సారాంశాన్ని అందరికీ వివరించారు.

అతడు/ఆమె యొక్క ఆధ్యాత్మికత పురోగతి సాధించాలంటే ఈ క్రింద తెలుపబడిన బోధనలను పాటించాలి.
అ) అహంకారాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయాలి
ఆ) నిస్వార్ధ సేవ
ఇ) సర్వ జీవులయందు ప్రేమ కలిగి ఉండటం
ఈ) ఇష్టము, అయిష్టము అనేవి లేకుండుట.  అనగా మనకు దేనియందు విముఖత గాని, ఆకర్షణగాని ఉండరాదు.  కాని దీనిని అర్ధం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం.

(స్వామీజీగారి అనుగ్రహ భాషణలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List