19.05.2012 శనివారము
నిత్య ప్రార్ధనలు
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత నాలుగు రోజులుగా స్వస్థలం నించి విజయవాడకు వచ్చిన కారణంగా ప్రచురణకు కొంత ఆటంకము కలిగింది. మరలా సోమవారమునుంచి సాయి.బా.ని.స. డైరీ 1997 మీకు అందిస్తాను. ఈ రోజు కొన్ని నిత్య ప్రార్ధనలను ఇస్తున్నాను.
ఒక ముఖ్య విషయం ::
యింతకుముందు శ్రీషిరిడీ సాయిబాబాతో తార్ఖడ్ కుటుంబము వారి ప్రత్యక్ష అనుభవాలు ప్రచురించడం జరిగింది. ఆ అనుభవాలన్నిటినీ పుస్తకరూపంలో తీసుకురావడం జరిగింది. ఇది అంతా కూడా బాబావారి అనుగ్రహముతోనే జరిగింది. మన సాయిబంధువులకు ఎన్ని పుస్తకాలు కావాలో నాకు మైల్ ద్వారా తెలియపరిస్తే కొరియర్ ద్వారా పంపుతాను. ఒక విషయం మాత్రం గుర్తు ఉంచుకోండి. ఈ పుస్తకం కేవలం ఒక నవలలాగా, కధలపుస్తకం లాగ చదివి పక్కనపడవేయవద్దు. దీనిని కూడా సాయి సత్చరిత్రతో సమానంగా ఆదరించి పారాయణ చేసి బాబావారి అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను.
కొరియర్ చార్జీలు మీకు కావలసిన పుస్తకాలను బట్టి యెంత అయేదీ మీ మైల్ ఐ. డీ. తెలియపరిస్తే మీకు మైల్ చేస్తాను.
సెల్ నంబర్ : 9440375411
మైల్.ఐడి :
tyagaraju.a@gmail.com
ఉదయము నిద్రలేచి కుడి అఱచేతిని చూచుచు ::
1. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం
నేలపై కాలు పెడుతూ
2. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
స్నానము చేయుచు
3. గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
విభూతి ధారణ చేయుచు
4. శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం
లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం
తులసిమొక్కకు నీరు పోయుచు
5 యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం
దీపారాధన చేయుచు
6. దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే
ఇంటినుండి బయటకు వెళ్ళునపుడు
7. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
భోజనము చేయుటకు ముందు
8. అహంవైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
నిద్రపోవుటకు ముందు
9. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment