19.05.2016
గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
అంకిత భక్తులు – జస్టిస్ ఎమ్.బి . రేగే – 2వ.భాగమ్
ఆయన
ఎప్పుడు షిరిడీ వచ్చినా రాధాకృష్ణమాయి ఇంటిలోనే బస చేస్తూ ఉండేవారు. రాధాకృష్ణమాయి ఎంతో ఔదార్యం గల ప్రేమమూర్తి. ఆయన ఆమెను తల్లిగా భావించేవారు. ఆవిడ కూడా ఆయనని కన్నతల్లిలా అభిమానిస్తూ ఉండేది. ప్రతిరోజూ బాబా ఆమెకు రొట్టెను పంపిస్తూ ఉండేవారు. ఆ రొట్టెతోనే ఆమె తన జీవితాన్ని గడిపేది. రేగే ఆమె ఇంటికి ఎప్పుడు వచ్చినా బాబా మరొక రొట్టెను
ఆయన కోసం అదనంగా పంపిస్తుండేవారు.
ఆమెకు బాబాయందు
ప్రగాఢమయిన భక్తి. ఆమె బాబా కోసమే జీవించేది.
ఆయన ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని కార్యాలను నిర్వహిస్తూ ఉండేది. సంస్థానానికి కావలసినవన్నీ సమకూరుస్తూ అందులో ఆనందాన్ని
పొందేది.
బాబా
వారిచ్చిన సూచనలు, రాధాకృష్ణమాయి మార్గదర్శకత్వం వీటి వల్లనే తాను ఆధ్యాత్మికంగా పురోగతి
సాధించగలిగానని రేగే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాధాకృష్ణమాయి ఎంతో శ్రావ్యంగా
పాడేది. ఆమె సితార్ కూడా వాయించగలదు. రేగే గారికి కూడా మంచి గాత్రం ఉంది. సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. వారిద్దరూ స్వరాలను సరి చూచుకొని తమ ఆధ్యాత్మిక
ప్రగతికి సంగీతమే ప్రధానమని తలచి తమ సాధన ప్రయత్నాలను రహస్యంగా ఉంచుదామనుకొన్నారు.
మనసులో
కలిగే భావాలను పెంపొందించుకోవడానికి భక్తి గీతాలు, పాటలు దోహదం చేస్తాయని భావించారు. అసలు మనసును లయం చేసి శ్రావ్యంగా భజన గీతాలను ఆలపించినా
అవి బయటివారిని ఎక్కువగా ఆకర్షిస్తాయని, అందువల్ల ఆ పధ్ధతి తమకు సరిపోలదని అనుకున్నారు. మనస్సును భగవంతునితో లయం చేయాలంటే నామ జపం ఒక్కటె
ఉత్తమమైందని నిశ్చయించుకొన్నారు. అయితే ఏ నామ జపం
చేయాలి? ఏది బాగుంటుంది అన్న ప్రశ్న తలెత్తింది.
ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలంటే దానికి ‘జపం’ ఒక్కటే ఉత్తమమైన
మార్గమని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు. అప్పుడామె ఎక్కువమంది రాముడు, విఠలుడు, వీరి నామాన్ని
జపిస్తారనీ, తనకు సాయే దైవం కాబట్టి సాయి నామ జపం తనకు చాలునని చెప్పింది.
రేగే కూడా ఆమె చెప్పినదానికి అంగీకరించారు. మొట్టమొదటి రోజున ఇద్దరూ సాయినామ జపం ప్రారంభించారు. ఆ రోజు బాబా రేగే గారికి కబురు పెట్టారు. రేగే మసీదుకు వెళ్ళగానే
బాబా
: “రాధాకృష్ణమాయి ఇంటిలో ఏమి జరుగుతోంది” అని
అడిగారు.
రేగే : నామ జపం చేసుకుంటున్నాము
బాబా: ఎవరి నామ జపం?
రేగే
: నా దేవుడు
బాబా : ఎవరు నీదేవుడు?
రేగే : నా దేవుడెవరో మీకు తెలుసు
బాబా
చిరునవ్వు నవ్వి ‘సరే’ అన్నారు.
ఆ
విధంగా మొదటినుండి సాయిబాబా కూడా నామ జపాన్ని అమోదించారు. జపమే సాధన.
ఆ విధంగా రాధాకృష్ణమాయి ఇచ్చిన స్ఫూర్తితో, బాబావారు ఆమోదించిన నామ జపం ద్వారా
రేగే ఆధ్యాత్మికంగా అబివృధ్ధి పధంలో పయనించసాగారు.
ఆయన
చాలా తీవ్రంగా బాబాను ధ్యానించారు. ఆ ధ్యానంలో ఆయనకు బాబా దర్శనమిచ్చారు. ఆయనకు అప్పటివరకు భగవద్గీత చదివే అలవాటు లేదు. అంతకు ముందు రోజుల్లో కూడా ఆధ్యాత్మిక గ్రంధాల మీద
కూడా అంతగా శ్రధ్ధ కనవరిచేవారు కాదు. బాబా
రేగే తో “నువ్వు బాగానే ఉన్నావు. పుస్తకాలు
చదవకు. కాని నన్ను నీ హృదయంలో నిలుపుకో---“
అన్నారు. అందువల్ల రేగే చాలా తీవ్రంగా ఆయన
మీదే భక్తి ప్రేమలతో దృష్టి కేంద్రీకరించారు.
1912
లో గురుపూర్ణిమనాడు మన్మాడ్ లో ప్రతి సాయి భక్తుడు బుట్టలనిండా బాబా కోసం పూల దండలను
తీసుకొని వెడుతున్నారు. అది చూడగానే తను షిరిడీకి
బాబా కోసం పూల దండను తీసుకొని రావడం మర్చిపోయానే అనుకుని బాధపడ్డారు.
షిరిడీలోకి
ప్రవేశించి మసీదులోకి వెళ్ళారు. అక్కడ భక్తులందరూ
బాబా మెడలో పూల దండలు వేశారు. అందరూ వేసిన
పూలదండలలో బాబా మునిగిపోయారు. దండలన్నీ ఆయన మెడలో బరువుగా ఉన్నాయి. అది చూసి రేగే తాను
కూడా ఒక పూల దండ తేలేకపోయినందుకు మనసులో చాలా బాధ పడ్డారు. అప్పుడు బాబా దండల మోపును తన చేతితో పైకెత్తి పట్టుకొని
“ఇవన్నీ నీవే” అని రేగేతో అన్నారు. బాబావారి
సర్వాంతర్యామిత్వానికి, ఆయన కరుణకి రేగే కి ఆశ్చర్యం కలిగింది.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment