06.08.2016 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
(6)
కర్మ సిధ్ధాంతం – 3వ.భాగమ్
ఒకసారి
బాబా నిచ్చెన తెచ్చినవానికి రెండు రూపాయలు ఇచ్చినపుడు అది చూసిన ఒకడు కేవలం నిచ్చెన
తెచ్చినందుకే రెండు రూపాయలు ఇవ్వవలెనా అని బాబాని ప్రశ్నించాడు.
బాబా అప్పుడు
ఏమని సమాధానం చెప్పారో చూడండి. “ఒకరి కష్టాన్ని
ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడువానికి కూలి సరిగాను. దాతృత్వముతోను, ధారాళముగను ఇవ్వవలెను”
– ఈ విధంగా బాబా చెప్పిన సలహాను పాటించినట్లయితే కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు, పని చేసేవారు ఇద్దరూ కూడా సుఖపడతారు.
అధ్యాయం – 19
సంగ్రహంగా
చెప్పాలంటే ధనం గాని, ఆహారంగాని, లేక మరే ఇతర చిన్న చిన్న సేవలయినా సరే ఇతరులనుండి
మనం పొందినపుడు వాటికి ఖచ్చితంగా తిరిగి చెల్లించవలసిందే. మనం వారినుంచి పొందిన సేవలను ధనరూపేణా గాని, లేక
సేవల రూపంలో గాని తిరిగి చెల్లించాలి. ఎవరినుండి ఉచితంగ
పొందరాదు. బాబా కూడా తనే స్వయంగా మసీదు గోడలను
బాగుచేసుకొని, నేలమీద పేడతో అలికి శుభ్రం చేసుకొనేవారు. ఎవరి సహాయాన్ని తీసుకొనేవారు కాదు. అదే విధంగా బాబా అన్నదానం చేసేటప్పుడు అన్ని ఏర్పాట్లు
మొదటినుండి చివరి వరకూ తానే స్వయంగా నిర్వహించేవారు. బజారునుండి కావలసిన సరకులన్నిటిని, బియ్యము, పప్పులు,
మసాలా దినుసులు అన్నీ తానే స్వయంగా వెళ్ళి కొని తెచ్చేవారు. పిండి విసరడం దగ్గరనుంచి వంట కూడా తానే స్వయంగా
వండి అందరికీ వడ్ఢించేవారు.
ఈ
సందర్భంగా బాబా తన భక్తులకు ప్రత్యేకమయిన హితోపదేశం చేశారు. ధనం మీద అత్యాస పనికిరాదని చెప్పారు. దానివల్ల శతృత్వము పెరిగి ఒక్కొక్కసారి హత్యలకు
కూడా దారి తీయవచ్చని హెచ్చరించారు. ఇదే సందర్భంలో
46వ.అధ్యాయంలో రెండు మేకల కధ, 47వ.అధ్యాయంలోపాము, కప్పల కధల గురించి సోదాహరణంగా వివరించారు.
అధ్యాయం - 47
పైన
ఉదహరించినవాటిలో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే “ధనం మీద ఉండే పేరాస మానవుడిని అధోగతికి
తీసుకొని వెళ్ళి తననే కాక ఇతరులను కూడా నాశనం చేస్తుంది.”
అధ్యాయం – 45
సాయిబాబా
దక్షిణ అడగటంలోని ఆంతర్యం, తన భక్తులను ధనముపై గల అభిమానమును పోగొట్టి వారి మనసులను
పవిత్రము చేయుటకే. ఆవిధంగా దక్షిణగా వచ్చిన
దనమును సాయిబాబా తనకోసం ఉంచుకోకుండా అందరికీ ఆరోజే పంచిపెట్టేసేవారు. మరలా సాయంత్రానికి మామూలు పేదఫికీరయేవారు. బాబా దక్షిణ పుచ్చుకొనుట తన భక్తులకు దానమును, త్యాగమును
నేర్పుట కొరకే. బాబాగారి సర్వసంగపరిత్యాగానికి
ఇదే ఉదాహరణ.
అధ్యాయం
– 14
మంచి
పనులు చేయుటలో ఏర్పడే అడ్డంకులు :
శాస్త్రాలలో
చెప్పిన ప్రకారం మానవుడు కూడా చాలాసార్లు మంచి పనులు చేద్దామని ప్రయత్నించినపుడు, తను అనుకున్న విధంగా చేయలేడు. అంతేకాక చెడు మార్గంలోకి దారితీసే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటె గతజన్మలో అతను చేసిన కర్మఫలితంగా (చేసిన
పనులవల్ల) అతని స్వభావానికి అనుగుణంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది.
ఎవరయినా
ఒక మంచిపని మొదలుపెడదామనుకున్నపుడు మరొక అడ్డంకి కూడా ఎదురవుతుంది. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తి నువ్వు చేసే మంచి పనికి అడ్డం తగిలి చేసే పనిని
చేయకుండా ఆటంకం కలిగిస్తాడు. స్వార్ధ బుధ్దితో మనకు ఆ పనివల్ల ఎక్కడ మంచిపేరు వస్తుందోననే
ఆలోచన కూడా ఉండవచ్చు. ఒక్కొక్కసారి మనకు మనం పనిచేసే కార్యాలయాల్లో కూడా మన సహచరులే
ఇటువంటివారు కొంతమంది ఉండవచ్చు. అందుచేత అతను చెడు బుధ్ధితో ఇచ్చిన సలహాను పెడచెవిని
పెట్టి ముందుకు సాగితే నువ్వు చేసే మంచిపనిలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే మనం సావకాశంగా నిదానంగా
మనం సరైన మార్గంలోనే వెడుతున్నామా లేదా, అవతలివారు చెప్పిన సలహా మంచిదేనా లేక స్వార్ధబుద్ధితో
చేసినదా అని ఆలోచించాలి.
ధబోల్కర్
ఒక బుధవారము రాత్రి పడుకునేటప్పుడు, మరునాడు గురువారము శుభదినము. ఆరోజంతా రామనామస్మరణతోనే కాలం గడపాలని నిర్ణయించుకొని
పడుకున్నాడు. మరునాడు ధబోల్కర్ దీక్షిత్ వాడా
విడిచి బూటీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినపడింది. ఔరంగాబాద్ నుంచి వచ్చినవాడొకడు మసీదులో రామచంద్రునిపై
ఒక పాట పాడుతున్నాడు. ఇది సందర్భానుసారంగా
బాబా చేసిన ఏర్పాటు కాదా!
హేమాడ్ పంత్ ఆరోజంతా
రామనామస్మరణతోనే కాలము గడుపుదామనుకొన్నాడు.
అతని మనోనిశ్చయాన్ని ధృఢపరచడానికి బాబా ఆ పాటను పాడించారు. అనగా బాబా సద్విచారములను ప్రోత్సహించి తన భక్తులకు మోక్షానికి దారి చూపిస్తారు.
అధ్యాయం – 19
ఆయన
భక్తులలో చాలా తక్కువమందే ఆయన వద్దకు ఆధ్యాత్మిక జ్ఞానం కోరి వచ్చేవారు. అందరూ కూడా ధనం కోసం, ఆరోగ్యం కోసం, హోదా కోసం,
అధికారం కోసం సమాజంలో మంచి స్థానం కోసం, రోగాలు నయం చేసుకోవడానికి ఇంకా తాత్కాలికమయిన
సుఖాలకోసం వచ్చేవారే కాని ఆధ్యాత్మిక జ్ఞానం కోరి వచ్చేవారు బహు కొద్దిమందే అని బాధపడేవారు. “నా సర్కారు ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగానున్నది. అది అంచువరకు నిండిపోవుచున్నది. త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకొనిపొండు. సుపుత్రుడైనవాడు ఈద్రవ్యమునంతయు దాచుకొనవలెను” అని
నేను చెబుతున్నాను. ఈ అవకాశం మరలా రాదు” అని
తన భక్తులనుద్దేశించి బాబా పలికిన పలుకులను మనం మర్చిపోకూడదు.
అధ్యాయం – 32
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment