03.08.2016 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
(6)
కర్మ సిధ్ధాంతం – (2వ.భాగం)
సాయిబాబా కూడా ఇదే విషయం గురించి చెప్పారు. “దాహంతో ఉన్నవారికి మంచినీరు, ఆకలితో ఉన్నవారికి ఆహారము, బట్టలు లేనివారికి బట్టలు, అవసరమయిన వారికి విశ్రాంతికోసం నీ ఇంటి వసారా ఇచ్చినచో భగవంతుడు తప్పక సంతుష్టి చెందుతాడు. అధ్యాయం – 14
కాని, మంచి పనులు చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోమని బాబా హెచ్చరించారు. ఇతరులు చేస్తున్నారు కదా అని ప్రత్యేకంగా అదే మంచి పనిని చేయవద్దు. ఇతరులు ఒక మంచి పని చేస్తున్నారంటే వారి శారీరక శక్తి, ఆర్ధిక, ఆధ్యాత్మిక సామర్ధ్యాలని పరిగణలోకి తీసుకోవాలి. 45వ.అధ్యాయంలో దీని గురించే వివరింపబడింది. బాబా శయనించడానికి పైకప్పుకు కొయ్యబల్ల ఉన్నట్లే, మహల్సాపతికి కూడా అటువంటి కొయ్యబల్లను ఏర్పాటు చేయిస్తానని కాకా సాహెబ్ దీక్షిత్ అన్నపుడు బాబా దానికి నిరాకరించారు.
అదేవిధంగా
అనేకమంది యోగుల వద్దనుంచి సలహాలు తీసుకోవడానికి అన్ని ప్రదేశాలకి తిరుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటివారికోసం బాబా ఏమి చెప్పారో చూడండి – “ఈప్రపంచములో
అనేక మంది యోగులు గలరు. కాని మన గురువు అసలైన
తండ్రి. (అసలయిన గురువు) ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని మన గురువుయొక్క పలుకులను మరువరాదు. మనకేది మంచిదో ఆయనకే తెలుసు”.
అధ్యాయం – 45
యోగులతో
సాంగత్యానికి ప్రయత్నించు:
నాస్తికులకు, అధార్మికులకు, దుష్టులకు దూరంగా ఉండమని, వారితో సహవాసం చేయవద్దని బాబా తన భక్తులకు బోధించారు. యోగులతో సాంగత్యానికి ప్రయత్నించమన్నారు. “యోగులతో సాంగత్యమంటే అది చాలా గొప్పది. మనస్ఫూర్తిగా వారి శరణు జొచ్చితే (యోగులు) వారు నిన్ను భవసాగరాన్ని సురక్షితంగా దాటిస్తారు. ఈ కారణం కోసమే ఈప్రపంచంలో యోగులు తమంతతాముగా ప్రకటితమయ్యారు. ప్రపంచంలోని అందరి పాపాలను ప్రక్షాళనం చేసే పవిత్రమయిన గంగా గోదావరిలాంటి నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానమాచరించి తమనెప్పుడు పావనం చేస్తారా అని ఎదురు చూస్తాయి”.
అధ్యాయం -10
యోగులయొక్క
కధలు, చరిత్రలు విన్నా, వారు రాసిన పుస్తకాలు చదివినా ఒక విధంగా వారితో సాంగత్యము చేసినట్లుగానే
భావించవచ్చు.
చెడు
పనులకు దూరంగా ఉండాలి :
ఋణము,
శతృత్వము, హత్య చేసిన పాపము, ఇవన్నీ కూడా, అవి చేసిన వ్యక్తిని ప్రపంచమంతమయేవరకూ వెంటాడుతూనే
ఉంటాయని సాయిబాబా పలుమార్లు చెపుతూ ఉండేవారు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించవలసినదే.
దానినుండి ఎవరూ తప్పించుకోలేరు.
ఋణమంటే,
డబ్బు, ఆహారము, మరే సేవైనా సరే ఏమయినా కావచ్చు. ఈజన్మలో కాకపోతే మరు జన్మలోనయినా
సరే ఋణం తీర్చవలసిందే. దర్వీషులు జబ్బు పడిన
పులిని సాయిబాబా దగ్గరకు తీసుకొనివచ్చినపుడు అది సాయి పాదాలచెంత మరణించింది. ఆ సందర్భంగా బాబా వారితో "ఈ పులి క్రిందటి జన్మలో మీకు ఋణపడిఉంది. ఈ జన్మలో మరలా మీతో ఉండి సేవచేసి ఋణం తీర్చుకుంది" అన్నారు.
అధ్యాయం – 31
(ఇంకా
ఉంది) (తరువాతి ప్రచురణ 5వ.తారీకు)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment