07.06.2012
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 (14)
20.11.1997
నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) బలవంతులు, ధనవంతులు కలసి కుయుక్తులతో ప్రజలకు అన్యాయము చేయుచున్నారు. న్యాయదేవత బలహీనముగా యున్న మెల్లిగా ఓపిక తెచ్చుకొని అన్యాయము చేసినవారిని బహిర్గతము చేసి ప్రజలకు న్యాయమును ప్రసాదించుతుంది.
2) ఈప్రపంచములోని దుర్మార్గులను శిక్షించటానికి, మరియు నీమనసులోని చెడును తొలగించటానికి నీకంటే బలవంతుని సహాయము కోరాలి. నీకంటే బలవంతుడు ఆభగవంతుడు.
అటువంటి భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే నీవు నాదగ్గరకురా, నీకు వివరాలు చెబుతాను.
3) నాదగ్గరకు వచ్చేవారినుండి నేను ఆశించేది బధ్ధకములేకుండుట, అబధ్ధము ఆడకుండటము, చెడు వ్యసనాలకు దూరంగా యుండటము. ఈలక్షణాలు నీలో యుంటే నాదగ్గరకురా. నేను నిన్ను నాకంటికి రెప్పలాగ కాపాడుతాను.
4) ఈనాడు జనాభా ఎక్కువయి కక్షలతో ఒకరిని యింకొకరు చంపుకొంటు, భవిష్యత్ లో జతువులుగా పుట్టాడానికి సిధ్ధపడుతున్నారు.
24.11.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) మానవులందరిలోని రక్తము ఒక్కటే అని అందరికి తెలుసు. కాని బంధుత్వాలులో తల్లి, భార్య, కుమార్తె, చెల్లెలు అనే ఆలోచనలు వచ్చినపుడు వారితో వ్యవహారాలు బంధుత్వానికి సరిపడినవిధముగా చేస్తాము. అలాగే భగవంతుడు ఒక్కడే అని మనందరికి తెలుసు. కాని భగవానునికి రూపాలు, రంగులు అనేకములు.
వాటిని దృష్ఠిలో పెట్టుకొని భగవంతుడిని పూజించాలి.
2) నీకంటికి అజ్ఞానపు పొరలు ఉన్నంతకాలము నీవు అజ్ఞానములో గడపవలసినదే. నీవు నాదగ్గరకు వచ్చినరోజున నేను ఆపొరలను తొలగించుతాను.
అపుడు నీవు నీకంటితో జ్ఞానము చూడగలవు.
3) నీవు ఏదేశము వెళ్ళిన అక్కడి ప్రజలను వారి సాంప్రదాయాలను గౌరవించడము, ఆదేశములో కష్ఠపడి పని చేయటము అలవర్చుకొన్ననాడు ఆదేశము నీదే. అక్కడివారు నీవాళ్ళే అని గుర్తుంచుకో.
27.11.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) నీవుముందుగా వంటరిగా ఆధ్యాత్మిక భోజనము చేయి. ఆతర్వాతనే ఇతరులకు ఆభోజనమును వడ్డించు.
2) నీవు జీవితములో సుఖశాంతులతోయుండాలి అంటే దానధర్మాలు
చేయాలి.
తోటివారు కష్ఠాలలో యున్నపుడు వారిని ఆదుకోవాలి. అంతేగాని అపాత్రదానము చేసి వారిని సోమరిపోతులులాగ మార్చవద్దు.
చేయాలి.
తోటివారు కష్ఠాలలో యున్నపుడు వారిని ఆదుకోవాలి. అంతేగాని అపాత్రదానము చేసి వారిని సోమరిపోతులులాగ మార్చవద్దు.
3) ప్రాపంచిక రంగములో నీవు సంపాదించిన ధనమును దానధర్మాలకు వినియోగించదలచిన, నీవు బీదలకు, అనారోగ్యముతో బాధపడుతున్నవారికి గుప్తదానము చేయి. గుప్తదానము నీమనసుకు ప్రశాంతత యిస్తుంది. మరియు గుప్తదానము స్వీకరించినవానికి భగవంతునిపై విశ్వాసముకలుగుతుంది. భగవంతుడు సంతోషించి నీకుసుఖశాంతులు ప్రసాదించుతాడు.
(ఇంకాఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment