08.10.2022 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 34 వ, భాగమ్
అధ్యాయమ్
– 32
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
నా
అహంకారం తొలగిపోయింది
(నీకు
వి. ఐ. పి. పాసు అవసరమా?)
బాబా నన్ను పరీక్షిద్దామనుకున్నారు. ఆ అనుభవాన్ని ఇపుడు మీతో పంచుకుంటాను. గత 40 సంవత్సరాలుగా నేను షిరిడీకి వెళ్ళివస్తూ ఉన్నాను. అప్పట్లో బాబాను దర్శించుకోవడానికి క్యూలు ఉండేవి కాదు. చాలా సులభంగా దర్శించునేవాళ్ళం. ఏ సమయంలోనయినా భక్తులు సమాధిమందిరానికి వెళ్ళి సాయి దర్శనం చేసుకునేవాళ్ళు. కాని ప్రస్తుతం బాబాని దర్శించుకోవాలంటే పెద్ద క్యూలో నుంచుని వెళ్ళాల్సివస్తోంది. దర్శనం చాలా కష్టతరంగా మారింది.
ఒక సంవత్సరం నేను షిరిడీ వెళ్ళినపుడు
లక్షలాదిమంది జనం ఉన్నారు. బాబా దర్శనం కూడా
చాలా కష్టమే. కాని కొంతమందికి వి.ఐ.పి. దర్శనం
టికెట్లు ఉన్నాయి. ఆ సమయంలో మిరేన్ అనే ఆయన
సాయిమందిర్ ట్రస్ట్ లో మంచి హోదాలో ఉన్నారు.
నేను ఆయన దగ్గరకు వెళ్ళి వి.ఐ.పి. పాస్ కావాలని అడిగాను. నా అదృష్టం కొద్దీ ఆయన నాకు పాసు ఇచ్చారు. ఇక నా బసకు తిరిగి వచ్చి ఉదయం నాలుగు గంటలకే లేచి
త్వరగా తెమిలి దర్శనానికి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నాను. నాకిచ్చిన సమయం ఉదయం 5 గంటలకి. మరుసటి రోజుకి దర్శనం టికెట్ ఉందనే ధైర్యంతో ఆరాత్రి
నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయాన్నే లేచి
గబగబా తయారయి సమాధిమందిరానికి చేరుకున్నాను.
కాని అక్కడికి లోపలికి వెళ్లబోతుండగా సెక్యూరిటి అతను “వి.ఐ.పి. దర్శన సమయం”
అయిపోయిందని చెప్పాడు. ఇక నేను సాధారణ దర్శనం
క్యూలో నిలబడి మూడు గంటల తరువాత బాబా విగ్రహం ముందు కన్నీటితో నిలబడ్డాను. టికెట్ ఉంది ఏమీ పరవాలేదనే అహంకారంలో పడిపోయిన నన్ను క్షమించమని బాబాను వేడుకున్నాను. మన హృదయంలోనే సాయి కొలువై ఉన్నపుడు ఇక ఎటువంటి వి.ఐ.పి.
పాసులు అవసరం లేదని గ్రహించుకున్నాను. మరుసటి
రోజు ఉదయాన్నే కాకడ ఆరతిని చూసేందుకు నన్ను తొందరగా లేవమని సాయిని ప్రార్ధించుకుని
ఆ రోజు రాత్రి పడుకున్నాను. తెల్లవారుఝాము
గం, 3.30 లకే లేచి తయారయి గం. 4.30 కల్లా తయారయి బాబా సమాధిమందిరంలో బాబా ముందుకు
చేరుకున్నాను. “నువ్వు నావద్దకు రావటానికి నీకు వి.ఐ.పి. పాసు అవసరమా” అని బాబా నన్ను అడుగుతున్నట్లుగా అనిపించింది.
శ్రీమతి
అల్కా విష్వద్కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment