10.10.2022 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 35 వ, భాగమ్
అధ్యాయమ్
– 33
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 814362674
సాయి
స్వయంగా నా కోరిక తీర్చారు
నేను క్రమం తప్పకుండా సంవత్సరానికి రెండు సార్లు షిరిడీకి వెడుతూ ఉంటాను. 2004 వ.సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను షిరిడీ వెళ్ళాను. సాయంత్రం 4 గంటలకి షిరిడీ చేరుకుని రెండు గంటలు విశ్రాంతి తీసుకున్నాను. లేచిన తరువాత శేజ్ ఆరతికి వెళ్ళాను. శేజ్ ఆరతి అయిన తరువాత గదికి తిరిగి వచ్చాను. మరుసటిరోజు ఉదయాన్నే కాకడ ఆరతికి వెళ్ళడం కోసం త్వరగా నిద్ర లేవాలి.
అందువల్ల తొందరగా నిద్ర పోయాను. తెల్లవారు ఝాము నాలుగు గంటలకే లేచి తయారయి కాకడ ఆరతికి బయలుదేరాను. అక్కడికి చేరుకునేటప్పటికి అప్పటికే చాలాపెద్ద క్యూ ఉంది. సాయికి అభిషేకం చేసే అవకాశం నాకు ఇక లభించదని అర్ధమయింది. ఇంక ద్వారకామాయిలోనే ఉండిపోదామనుకున్నాను.
ద్వారకామాయిలో బాబా ఫోటో
ముందుకూర్చుని బాబాకు ఉదయంపూట జరిగే పూజని సి సి టి వి లో వీక్షిస్తూ ఉన్నాను. ఆవిధంగా సి సి టి వి లో చూడటం నాకు తృప్తిగా అనిపించలేదు. చాలా నిరాశ కలిగింది. నీకు జరుగుతున్న అభిషేకాన్ని ఇలా ఎంతసేపని చూడాలి
బాబా అని మనసులోనే బాబాకు చెప్పుకున్నాను.
వెన్న, పంచదార లేకుండా నేనెంతసేపని ఉండగలను? ఇలా అనుకుంటూ కొంతసేపు కళ్ళు మూసుకుని
కూర్చున్నాను. ఇంతలో ఒక అధ్భుతం జరిగింది. ఒక వ్యక్తి నాకెదురుగా వచ్చి నిలుచున్నాడు. అతని చేతిలో వెన్న, పంచదార ఉన్నాయి. జై సాయిరాం అంటూ వాటిని నా చేతిలో పెట్టాడు. నా కళ్ళంబట కన్నీళ్ళు కారసాగాయి. ఈ అనుభవం నాకెంతో ఆశ్చర్యకరంగా అనిపించింది. ద్వారకామాయిలో చాలామంది భక్తులు ఉన్నారు. కాని ఆవ్యక్తి
నాకు మాత్రమే వెన్న, పంచదార ఇచ్చాడు. నేను
బాబా ఫోటో వంక చూస్తున్నాను. ఒక వృధ్దుడు నావైపే
చూస్తున్నాడు. అతని వదనం వింతగా ఉంది. అతను నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. అతని వదనంలో గమనించదగ్గ ఒక విధమయిన తేజస్సు ఉంది. ఆవృధ్ధునిలో నాకు అంతర్లీనంగా ఉన్న భావం బోధపడింది.
నువు నాగురించి నిరాశగా ఉన్నావు. నాబిడ్డను
నేను సంతోషపెట్టకపోతే మరెవరు సంతోష పెడతారు అని బాబా చెబుతున్నట్లనిపించింది. బాబా తన భక్తుల మనోగతాలకు అనుగుణంగా వారి కోరికలన్నిటినీ
తీరుస్తూ ఉంటారు.
శ్రీమతి
అల్కా రిష్వద్కర్
ఈ సందర్భంగా నాకు (త్యాగరాజు) షిరిడీలో కలిగిన
అనుభవాన్ని, అనుభూతిని వివరిస్తాను. ఈ అనుభవాన్ని
కొన్ని సంవత్సరాల క్రితం ఇదే బ్లాగులో ప్రచురించాను. అప్పట్లో చదివి ఉండని సాయిభక్తుల కోసం మరలా వివరిస్తున్నాను.
దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను, నాభార్య, మా రెండవ అమ్మాయి షిరిడీకి వెళ్లాము. మొదటిరోజు బాబా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిన తరువాత మందిరం బయట ఆవరణలో అన్నీ చూస్తూ తిరుగుతూ ఉన్నాము. ఒకచోట బాబా వారికి ధరింపచేసిన దుస్తులను మరునాడు వేలం వేస్తారని తెలిసింది. సరే మరునాడు మరలా వచ్చి కావలసినవాటిని కొనుక్కోవచ్చనుకున్నాము. మరునాడు హోలీ పండుగ. బాబా దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వచ్చారు.
మేము బాబా మందిరం వద్దకు వెళ్ళి నేరుగా బాబా దుస్తులు
వేలం వేసే ప్రదేశానికి వెడదామనే ఉద్దేశ్యంతో లోపలికి ఎక్కడినుండి వెళ్లాలో తెలియక తిరుగుతూ
ఉన్నాము. ఒకచోట కాస్త ఖాళీగా ఉంటే అందులో ప్రవేశించి
వెడుతున్నాము. కొంత దూరం వెళ్ళేటప్పటికి అది
బాబా దర్శనం కోసం అందరూ వెడుతున్న క్యూ. ఆ
క్యూ నేరుగా బాబా సమాధి మందిరానికి చేరుకుంటుందని మాకు తెలియదు. సరే బాబా దర్శనం చేసుకోవచ్చని అందులోనే వెడుతున్నాము. బాబా దర్శనం కోసం వెడుతున్నాము కాని బాబా కోసం కనీసం
ఏమీ తేకుండా ఉట్టి చేతులతో వెడుతున్నామని నా భార్య బాధ పడింది. బాబాకి కనీసం కోవా కూడా
పట్టుకురాలేదని మనసులోనే అనుకుంది. అందరి చేతులలో బాబాకు సమర్పించడానికి కోవాలు, గులాబీ పూల గుత్తులు ఉన్నాయి. మేము మాత్రం వట్టి చేతులతో వెడుతున్నాము. నేను మనసులో
బాబా నీ లీల ఏమయినా చూపించు అనుకున్నాను. కాసేపటికి
మేము సమాధి మందిరంలోకి ప్రవేశించాము. భక్తులందరూ
ఒక వరుసలో మెల్లగా కదులుతూ ఉన్నారు. ఇంతలో
లోపల ఉన్న సెక్యూరిటీ గార్డు నన్ను పిలిచాడు.
అతను నాకు అయిదారడుగుల దూరంగా ఉన్నాడు. బహుశ
నేను వరుసలో లేకుండా పక్కగా ఉన్నానని నన్ను హెచ్చరించాడేమో అనుకుని నేను మరలా సరిగా
నుంచున్నాను. కాని అతను నన్ను మళ్ళీ పిలిచాడు. అతను మిమ్మల్నే పిలుస్తున్నాడు అని నా భార్య అంది. నేను ఆతని దగ్గరకు వెళ్లాను. అతను నా చేతిలో రెండు గులాబీపూల గుత్తులు పెట్టి
బాబాకి సమర్పించమని అన్నాడు. అసలు సెక్యూరీటీ గార్డు వద్ద పూలగుత్తులు ఉండటమేమిటీ? అతనికి ఇవ్వడానికి కుదరక మనకి ఇచ్చాడేమో అని నా భార్య అంది. కాని నేను ఆమాటకి అంగీకరించలేదు. బాబాయే నామనసులో అనుకున్న లీలను చూపించమంటే ఈ విధంగా చూపించారని నేనెంతో సంతోషంగా
ఆ రెండిటిని బాబాకు సమర్పించాను. దీనిని బట్టి
బాబా తన భక్తుల మనసులోని అభీష్టాలను తీరుస్తారని ఈ సంఘటన ద్వారా గ్రహించుకోవచ్చు. ఇది నాకు బాబా కలిగించిన మొట్టమొదటి అనుభూతి.
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment