11.10.2022 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 36 వ, భాగమ్
అధ్యాయమ్
– 34
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 814362674
సాయి తలచుకుంటే ఎవ్వరూ అడ్డు పడలేరు, ఏ శక్తీ ఆపలేదు. శ్రీ సాయి సత్ చరిత్రలో బాబా అన్న మాటలు... "నా భక్తుడు ఎన్ని కోసుల దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్ళకు దారం కట్టి నా వద్దకు లాక్కుంటాను ." మన మనసులో సంకల్పం ఉంటే చాలు మిగతాదంతా ఏమి చేయాలో ఎలా చేయాలో బాబా చూసుకుంటారు. మనం నిశ్చింతగా ఉండటమే. ఇప్పుడు అటువంటి సంఘటనను తెలియ చెప్పేదే ఇప్పుడు మీరు చదవబోయే అధ్భుత లీల....
సాయి
తలుచుకుంటే…..
నా పేరు రవి సైనీ. నేను, నా భార్య అనితాసైనీతో భైందర్ లో ఉన్న దానిష్ మక్వానా గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ ఆయన ఇంటిలో సాయిబాబా గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. సాయిబాబా గురించి మాట్లాడుకోగానే మాకు సాయిమందిరానికి వెళ్ళాలనిపించింది.
కాని దగ్గరలో సాయిమందిరం
ఉందో లేదో మాకు తెలీదు. గూగుల్ లో వెతికి చూసాము. విలేపార్లేలోని తిలక్ మందిర్ రోడ్ లో ఉన్న సాయిమందిరం
గురించి తెలిసింది. వెంటనే మేము భైందర్ నుంచి
బయలుదేరి రాత్రి 8 గంటలకి పార్లేకి చేరుకున్నాము.
కాని అప్పటికే మందిరం మూసేశారు. మా
అదృష్టం కొద్దీ మందిరం యజమానురాలయిన శ్రీమతి ఉజ్వలాతాయి బోర్కర్ గారిని కలుసుకోవటం
జరిగింది. ఆవిడ మా కోసం మందిరాన్ని తెరిచారు. సాయి మాకు తన దర్శనభాగ్యాన్ని కలిగించినందుకు మేమెంతగానో
సంతోషించాము. శ్రీమతి ఉజ్వలాతాయి బోర్కర్ గారు,
చంద్రాబాయి బోర్కర్ గారి గురించి, మంగళతాయి బోర్కర్ గారి గురించి అన్ని వివరాలు చెప్పారు. అపుడు మేము బాబా మాకు ఇచిన అనుభవాన్ని ఎంతో ఆనందంతో
వివరించాము.
1990
వ. సంవత్సరంలో నేను, నా ఇద్దరు స్నేహితులు కృష్ణకుమార్ శర్మ, సురేష్ దివాన్ ముగ్గురం
దాదర్ లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాము.
ఎందుకనో హటాత్తుగా అప్పటికప్పుడే మా ముగ్గురికీ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలనే
సంకల్పం కలిగింది. ఆవెంటనే మాముందు షిరిడీకి
వెళ్ళే బస్సు కనిపించింది, బస్సులోకి ఎక్కేశాము. కాని మాదగ్గర
షిరిడీ వరకు వెళ్లడానికి సరిపడ డబ్బు మాత్రమే ఉంది. ఇక తిరుగు ప్రయాణానికి డబ్బు లేని పరిస్థితి. మరుక్షణంలో కండక్టర్ మావద్దకు వచ్చి టికెట్స్ అడగబోతుండగా
ఒక వ్యక్తి బస్సులోకి వచ్చి వీళ్ళు ముగ్గురూ మావాళ్ళే అని చెప్పడంతో కండక్టర్ మమ్మల్ని
టికెట్స్ అడగలేదు. ఆసమయంలో మాకు సహాయం చేయడానికి
వచ్చిన వ్యక్తి సాయిబాబా తప్ప మరెవరూ కాదని మా
ప్రగాఢ విశ్వాసం. మేము షిరిడీ వెళ్ళి
బాబా దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా ముంబాయికి చేరుకున్నాము. తిరుగు ప్రయాణానికి డబ్బు లేదన్న మా సమస్యను బాబా
పరిష్కరించారు. బాబా తలుచుకుంటే ఎవ్వరు గాని,
ఏశక్తి గాని ఆపలేదు.
రవి
సైనీ
9819977900
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment