ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి దయా సాగరమ్ 27 వ, భాగమ్
అధ్యాయమ్ – 25
మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా
బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
9440375411 & 8143626744
ప్రమాదంనుండి
కాపాడిన బాబా
సోమవారమ్,
జనవరి 25, 2021 గం.9.30 రాత్రి
గత 25 సంవత్సరాలుగా నేను ప్రతిరోజు సాయి మందిరానికి వెళ్ళి సాయిసేవ చేస్తూ ఉండేవాడిని. కాని రెండు సంవత్సరాల క్రితం మా కుటుంబంతో సహా పార్లే నుండి దహసిర్ కి వచ్చేసాము. అయినప్పటికీ ప్రతిరోజూ పార్లేకి వెళ్ళి సాయిసేవను కొనసాగిస్తూ ఉన్నాను. ఒకసారి నేను అంధేరీ నుండి దెహసిర్ కి లోకల్ రైలులో వెడుతున్నాను.
రైలు బాగా రద్దీగా ఉండటం వల్ల కాళ్ళను బయటకు పెట్టి తలుపు దగ్గర కూర్చున్నాను. కొంతసేపట్లో జోగేశ్వరీ స్టేషన్ వస్తూండగా హటాత్తుగా నా రెండు కాళ్లను లోపలికి తీసుకున్నాను. జోగేశ్వరి స్టేషంలోకి రైలు ఆగినపుడు ప్లాట్ పారం రెండు వైపులా ఉంది.
కాని రైలు ప్లాట్ ఫారం
లోకి ప్రవేశించగానే హటాత్తుగా నా రెండు కాళ్ళను లోపలికి ఎందుకని తీసుకున్నానో నాకే
తెలీదు. లేనట్లయితే నా రెండు కాళ్ళకు ఎంత ప్రమాదం
జరిగి ఉండేదో తెలియదు. సాయి ఎల్లపుడూ తన భక్తుల
యోగక్షేమాలను చూస్తూ కనిపెట్టుకుని ఉంటారని గ్రహించుకున్నాను.
దిలీప్
ఆత్మారాం భోండే
9769339594
శ్రీ
సాయి దయా సాగరమ్ 28 వ, భాగమ్
అధ్యాయమ్
– 26
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
బాబా
మనవెనుకనే ఉంటారు
మన
జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక బాబా ఉంటారు.
అది సాయిభక్తులందరికీ, ఆయనను నమ్మినవారికి ఇది అనుభవమే.
బాబా
తలచుకుంటే తప్ప ఎవరూ షిరిడీలోకి అడుగుపెట్టలేరన్న విషయం సాయి సత్ చరిత్రలో చెప్పబడింది. సాయిని మనసా వాచా కర్మణా నమ్ముకున్నవారు ఈ విషయాన్ని
బాగా గ్రహించుకునే ఉంటారు. నేను శ్రీమతి ఫడ్కేతో
కలిసి, పార్లేలో ఉన్న సాయిమందిరంలో జరుగుతున్న అక్షయ తృతీయ ఉత్సవాలలో పాల్గొనటానికి
వెళ్ళాను.
సాయంత్రంవేళ
అకస్మాత్తుగా ఒక సాధువు మందిర ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ప్రసాదం పెట్టమని అడిగాడు.
మేమతనికి రాత్రి భోజనం ఏర్పాటు చేశాము. భోజనం పూర్తి చేసిన తరువాత ఆ సాధువు తిలక్ మందిర్
రోడ్ లోకి వెళ్ళి అంతలోనే అదృశ్యమయాడు. ఆ సాధువు
సాయి తప్ప మరెవరూ కాదని మాకు బాగా తెలుసు.
ఈ
సంవత్సరం కూడా మేము అక్షయతృతీయ ఉత్సవాలు చూడటానికి వెడదామనుమున్నాము కాని, నా వ్యక్తిగత
సమస్య వల్ల వెళ్లలేకపోయాను. దానికి నేను చాలా
బాధపడ్డాను. ఆరోజు రాత్రి నాకు కలలో బాబా నా
ఎదురుగా నిలబడి దర్శనమిచ్చారు. నేను మందిరానికి
వెడదామని ఎంతగానో అనుకున్నాను కాని వెళ్ళలేకపోయినందువల్ల బాబాయే స్వయంగా వచ్చి నన్ను
ఆశీర్వదించారు. మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. కాని బాబాకు అటువంటివేమీ లేవు. ఆయనను మనఃస్ఫూర్తిగా ప్రార్ధించుకుంటే చాలు, బాబా
మనల్ని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటారు.
మమతా
రామస్వామి
9850838415
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment