26.09..2022 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 26 వ, భాగమ్
అధ్యాయమ్
– 24
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
మన
ఊహకందని అధ్బుతాలు….
గురువారమ్,
21, జనవరి, 2021, సమయమ్ గం. 3.55
ఉన్నత విద్యావంతులు, మంచి సంస్కారవంతుల కుటుంబంలో నేను జన్మించాను. మా కుటుంబంలోనివారందరూ అన్ని విషయాలు ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మేవారు కాదు. కాని భగవంతుని మీద మంచి నమ్మకం ఉన్నవాళ్ళు. మా తాతగారు ప్రతిరోజు పూజలు చేసేవారు కాదు. కాని ఆయన సాయిబాబా ఫోటోకి నమస్కరించడం నాకు గుర్తే. సాయిని ప్రార్ధించుకున్నపుడెల్లా మాకు ఎంతో నమ్మకం, మానసిక ప్రశాంతత కలుగుతూ ఉండేది. ప్రతి గురువారం మా నాన్నగారు బాబాకు మిఠాయి, పూలమాల తెస్తూ ఉండేవారు.
అది చూసినపుడు మాకు బాబా
మీద ఎంతో భక్తి భావం కలుగుతూ చాలా సంతోషంగా అనిపించేది. సర్వజీవుల కోసం మనం ప్రార్ధిస్తూ ఉండాలని మా నాన్నగారు
చెబుతూ ఉండేవారు. ప్రార్ధనతోపాటుగా మనం విజయంసాధించాలంటే
కష్టపడి పనిచేయాలని కూడా చెబుతూ ఉండేవారు.
బాబా అనుగ్రహం వల్లనే మనకు మంచి కలిగినా చెడు కలిగినా ఆ పరిస్థితులను తట్టుకునే
సామర్ధ్యం ఏర్పడుతుంది.
నాకు వివాహమయింది. మా అత్తవారిల్లు కూడా మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉన్నదే. కాని నాకు ఒక్కటే లోపం కనపడింది. వారింటిలో బాబా ఫొటో లేకపోవడం నాకెంతో నిరాశగా అనిపించింది. నేను ప్రతిరోజు ఉదయంవేళ నడకకి వెళ్ళివస్తూ ఉండేదానిని. ఆ విధంగా వెళ్ళి వస్తున్నపుడు ఒకసారి తిలక్ మందిర్ రోడ్దులో ఉన్న సాయిమందిరం కనిపిపించింది. ఈ మందిరంలోనికి అడుగుపెట్టగానే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇందులో ఉన్న బాబా విగ్రహం చాలా పెద్దది.
నేను ప్రతిరోజు సాయి మందిరానికి వెళ్ళి ఆయన దర్శనం
చేసుకుంటూ ఉండేదానిని. మన జీవితాలు కష్టసుఖాలతో
నిండి ఉన్నది. నాకు 45 సం.వయసులో ఆరోగ్యపరంగా
భరింపలేని బాధలు మొదలయ్యాయి. అన్ని పరీక్షలు
చేయించుకున్నాను. చివరికి వైద్యులు నాకు
హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయడానికి నిర్ణయించారు.
ఆపరేషన్ బాగా జరిగింది. కాని రెండు
కుట్లు మాత్రం మాడిపోకుండా ఇంకా పచ్చిగానే ఉండిపోయాయి. దానివల్ల నేనింకా బాధపడుతూనే ఉన్నాను. ఒకరోజున తెలతెలవారుతుండగానే సాయిబాబా మందిరానికి
వెళ్ళాను. నేను లోపలికి అడుగుపెట్టగానే ఒక
వ్యక్తి బయటకు వస్తూ నాకు కొబ్బరిముక్క ప్రసాదం ఇచ్చాడు. అతనిచ్చిన ప్రసాదాన్ని తీసుకున్నాను. బాబా విగ్రహం ముందు నిల్చుని బాబాని ప్రార్ధించుకుంటూ
ఉన్నాను. నేను బాబా విగ్రహం దగ్గర పరిశీలనగా
చూసినప్పుడు అక్కడ కొబ్బరికాయ ఏమీ కనిపించలేదు.
అక్కడ ఎవరూ ఎటువంటి ప్రసాదాలను బాబాకు సమర్పించినట్లుగా ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు. నేను నాకివ్వబడిన కొబ్బరి ముక్కను ఎంతో భక్తితోను,
నమ్మకంతోను తిన్నాను. కొద్దిరోజుల తరువాత నా
బాధంతా పూర్తిగా సమసిపోయింది.
ఒకసారి
నేను ప్రొద్దుటే నడుచుకుంటూ ఇంకొక రోడ్డులోకి వెళ్లాను. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. మానవమాత్రుడెవరూ లేరు. అనుకోకుండా నా ఎదుటినుంచి ఒకవ్యక్తి చేతిలో కొన్నిపళ్ళాలు
పెట్టుకుని వస్తూ కనిపించాడు. అతను నా వదకు
వచ్చి ఒక పళ్ళాన్ని కొనమన్నాడు. నాకు బాబా
వదనం ఇష్టం. బాబా వదనం ఉన్న పళ్ళాన్ని తీసుకుని
దానికి వెల చెల్లించాను. కాసేపటి తరువాత అటువంటిదే
మరొకటి మా చెల్లెలి కోసం తీసుకోవాలనిపించింది.
ఆవ్యక్తి కోసం వెనక్కి తిరిగి చూశాను.
కాని ఆరోడ్డులో ఎవరూ కనిపించలేదు. నేను ఆవ్యక్తి వెళ్ళినవైపుగా వెనక్కి చాలా
దూరం నడిచాను కాని అతను మాత్రం కనిపించలేదు.
అంత తక్కువ సమయంలో అతను ఎలా అదృశ్యమయ్యాడు. అది నా ఊహకందని విషయం, అధ్బుతం.
మాధవి
కుంతే
9819679550
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment