25.09..2022 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 25 వ, భాగమ్
అధ్యాయమ్
– 23
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 8143626744
శ్రీ
సాయి కృప
పార్లే
(తూర్పు) లో ఉన్న తిలక్ మందిర్ రోడ్డులో సాయిమందిరం ఉంది. ఈ సాయి మందిరానికి బోర్కర్ కుటుంబం వారు ట్రస్టీగా
ఉన్నారు. 1975 నుంచి నేను ఈ సాయిమందిరానికి
వెడుతూ ఉండేవాడిని. నేనే కాకుండా మా పార్లేకర్
కుటుంబమంతా ఈ సాయిమందిరాన్ని మా స్వంత మందిరంగా భావించుకుంటూ ఉండేవాళ్ళం. బాబా తన భక్తులను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉంటూ
ఉంటారు. నేను ఒకమ్మాయిని వివాహం చేసుకుందామనుకున్నాను. కాని ఆ అమ్మాయిది వేరు కులం వల్ల కులాంతర వివాహమని
మా నాన్నగారు ఒప్పుకోలేదు. మా నాన్నగారు ఈ వివాహానికి అనుకూలంగా ఉండేలాగా సహాయం చేయమని బాబాను
ప్రార్ధించుకోసాగాను. బాబా అనుగ్రహం వల్ల మా
వివాహం జరిగింది.
మేమెంతో
సంతోషంగా మా వైవాహిక జీవితాన్ని ప్రారంభించాము.
రెండు సంవత్సరాలకి నేను తండ్రినయ్యాను.
ఆ తరువాత నాకు కడుపులో నొప్పిరావడం మొదలయింది. వైద్యులు అన్ని పరీక్షలు చేసి కడుపులో అల్సర్
ఉందనీ, ఆపరేషన్ చేయవలసిందేనని చెప్పారు. పదిరోజులు
ఆస్పత్రిలో ఉండవలసి వస్తుందని అన్నారు. ఇది నాకొక పెద్ద సమస్య. నేను ఆస్పత్రిలో ఉంటే
నా కుటుంబాన్ని, నాకు పుట్టిన బిడ్దని ఎవరు చూస్తారు? మా నాన్నగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆయన కూడా పదిరోజులపాటు ఆస్పత్రిలో నాదగ్గరే ఉండాలి.
నా
సమస్యను పరిష్కరించడనికి బాబా ఉన్నారు అనే ధైర్యం నాకు ఉంది. ఆస్పత్రిలో నాదగ్గరే ఉండి అన్నీ చూసుకోవడానికి ఒకమ్మాయి
కుదిరింది. నాకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. కడుపులో నొప్పినుంచి బయటపడ్డాను. ఆస్పత్రినుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నాను. రెండురోజుల తరువాత మా నాన్నగారు ఆస్పత్రిలో చేరాల్సి
వచ్చింది. ఆయనకి ఒక కాలు తీసివేయాల్సివచ్చింది. మరలా మా కుటుంబానికి విచారించదగ్గ విషయం. మా జీవితంలో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి
బాబా అని ఆయనను ప్రశ్నించాను. ఆ పరిస్థితినుండి
బయటపడటానికి మా నాన్నగారికి ఆరు నెలలు పట్టింది.
మా నాన్నగారికి జైపూర్ కృత్రిమ కాలు
తెప్పించాము. ఆయన దాని సహాయంతో నిలబడగలిగేవారు. నడవగలిగేవారు.
అటువంటి భయంకర పరిస్థితులలో బాబా మాకు అండగా నిలబడటంవల్లనే మేము అన్నిటినీ తట్టుకోగలిగాము. 2012 వ.సం. లో నేను పెద్దకష్టంలో పడ్డాను. బాబా నన్ను ఆకష్టంనుంచి సురక్షితంగా బయటకు లాగారు.
జీవితంలో
కష్టసుఖాలు అనేవి సహజం. అన్నీ మన జీవితంలో
భాగమే. అటువంటి సమయాలలోనే మనం బాబామీద అచంచలమయిన
నమ్మకాన్ని నిలుపుకోవాలి. మనఃస్ఫూర్తిగా మనం
బాబాని ప్రార్ధించుకుంటూ ఉండాలి. మనం బాబా
అనుగ్రహాన్ని పొందుతాము.
మా
పార్లేకర్ కుటుంబమంతా బోర్కర్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పార్లేలో ఉన్న వారి సాయిమందిరంలో సాయి సేవలో తరిస్తున్నందుకు
మాకెంతో సంతోషంగాను. ఆనందదాయకంగాను ఉంది.
నేత్త్రా
బరోతీ
9870788879
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment