03.10.2022 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి దయా సాగరమ్ 29వ, భాగమ్
అధ్యాయమ్ – 27
మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా
బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్ --- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
9440375411 & 8143626744
పునర్జన్మను
ప్రసాదించిన సాయి
నేను, నా భర్త ఇద్దరం పట్టయ్య, సింగపూర్ విహార యాత్రకు వెడదామనుకున్నాము. జనవరి 2007 వ.సం.లో మేము అనుకున్న ప్రకారంగా తెల్లవారుఝాము 4 గంటలకు విమానం ఎక్కాము. ఉదయం 8 గంటలకు పట్టయ చేరుకున్నాము. ఉదయం చాలా తొందరగానే లేచి విమాన ప్రయాణం చేయడం వల్ల మేము నిద్రపోలేకపోయాము. పట్టయాలో బీచికి బస్సులో బయలుదేరాము. అక్కడ పారాగ్లైడింగ్ చేయడానికి కొన్ని బృందాలుగా ఉన్నాము.
మా బృందానికి సంబంధించిన నాయకుడు మా అందరినీ ఒక్కొక్కరిగా
బోటులోకి ఎక్కించడానికి సహాయపడుతూ ఉన్నాడు.
చివరికి నావంతు వచ్చింది. అతను నా చేయి
పట్టుకుని బోటులోకి ఎక్కించబోతుండగా నేను పట్టుతప్పి జారి నీళ్ళల్లో పడిపోయాను. గ్రూపు లీడరు నా చేయిపట్టుకుని ఉన్నా గాని పట్టు
బిగువుగా లేక నా చేయి జారిపోయేలా ఉంది. ఇంక
నాకు పట్టుకోవడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు.
నేను సాయిని ప్రార్ధిస్తూ ఉన్నాను.
ఏడుపు వచ్చేస్తూ ఉంది. నాకు సాయి మీద
మాత్రమే పూర్తి నమ్మకం ఉంది. ఆయనే నన్నీగండంనుంచి
రక్షించగలరు. అదేక్షణంలో బోటులో ఉన్న సహాయకుడు ఒకతను నన్ను పట్టుకుని బోటు మీదకి తోసాడు. నేను క్షేమంగా బోటు మీదకు చేరగలిగాను. నన్ను రక్షించడానికి ఆక్షణంలో అక్కడ సాయిమాత్రమే
ఉన్నారు. నాకు ఆనందంతో కళ్ళంబట నీళ్ళు కారాయి. నా జీవితంలో సాయి నా మీద కురిపించిన దయ చెప్పాలంటే
ఎన్నోసంఘటనలు ఉన్నాయి. కాని ప్రస్తుతం ఇదొక్కటే
వివరించాను. నా మరుసటి జన్మలో కూడా సాయినే
పూజించే కుటుంబంలో జన్మనివ్వమని సాయిని నేనెప్పుడూ ప్రార్ధిస్తూనే ఉంటాను.
మమతా
రామస్వామి
9850838494
శ్రీ
సాయి దయా సాగరమ్ 30 వ, భాగమ్
అధ్యాయమ్
– 28
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
ఒక అధ్భుతం
మనం
సాయి గూర్చి ఎంతో రాద్దామనుకుంటాము. కాని దానికి
పరిమితి లేదు. సాయిని గూర్చి వ్రాయడమంటే సముద్రాన్ని
చేతుల్లో నిలుపుకోవడంవంటిది. నక్షత్రాలను లెక్కపెట్టడంవంటిది. మనం ఆయన కృపాసాగరాన్ని అనుభవించాలి. అందులో ఆనందాన్ని పొందాలి. ప్రతిజీవరాశిపైన ప్రసరించే పండువెన్నెలలాంటిదే సాయి
అనుగ్రహపు జల్లులు.
సాయిబాబా
తన భక్తులందరినీ ప్రేమిస్తారు, వారిని దీవిస్తూ ఉంటారు. మనఃస్ఫూర్తిగా తనను ప్రార్ధించేవారినందరినీ రక్షించి
కాపాడుతూ ఉంటారు. అధ్భుతాలు చేసి బాబా తన భక్తుల
కోరికలను తీరుస్తూ ఉంటారు.
మా
అబ్బాయి IIM లో పట్టభద్రుడవాలనే కోరిక మాలో చాలా బలీయంగా ఉంది. మా అబ్బాయి మూడు సంవత్సరాలుగా IIM లో చేరడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు 2009 వ.సం. లో మా అబ్బాయికి IIM లో సీటు ఇవ్వలేకపోయినందుకు
విచారిస్తున్నామనే ఉత్తరం వచ్చింది. మేము చాలా
బాధ పడ్డాము. ఇక ఆవిషయాన్ని అంతటితో వదిలేద్దామనుకున్నాము. మేము సాయిని దర్శించుకోవడానికి షిరిడీ వెళ్లడానికి
నిర్ణయించుకుని షిరిడీకి బయలుదేరాము. సాయిని
దర్శించుకుని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాము. ఆ మరుసటిరోజే మా అబ్బాయికి IIM లో ప్రవేశం లబించిందనే
వార్త తెలిసింది. మేమంతా ఎంతో సంతోషించాము. అదంతా సాయి చేసిన అధ్భుతమయిన మహిమేనని మాకు తెలుసు. బాబా తన భక్తులందరినీ కనిపెట్టుకుని ఉంటారు.
శ్రీమతి
మాలతీ గోహిల్
7498992348
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment