13.08.2016
శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
(7)
మానవజన్మ (1వ.భాగమ్)
హిందూ
శాస్త్రముల ప్రకారం ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులున్నాయి. (20 లక్షలు చెట్లు, మొక్కలు,
9 లక్షలు జలచరాలు, 11 లక్షలు క్రిమికీటకాలు, 10 లక్షలు పక్షులు, 30 లక్షలు జంతుజాలాలు,
4 లక్షల మానవజాతి). ఈ ఆత్మలన్నీ కూడా పూర్వజన్మలో
అవి చేసుకున్న కర్మలను బట్టి, వివిధ రకాల జన్మలలో తిరిగి జన్మిస్తూ ఉంటాయి. ఏమయినప్పటికీ పాపపుణ్యాలు రెండూ సమానంగా ఉన్న అవకాశం
ఏర్పడినప్పుడు ఆత్మలకి మానవ జన్మ పొంది తద్వారా మోక్షాన్ని పొందే అవకాశం ఇవ్వబడుతుంది.
ప్రపంచంలో
ప్రాణులందరికీ నాలుగు అంశాలు సర్వసాధారణం.
అవి ఆహారము, నిద్ర, భయము, శృంగారము.
కాని, మానవుని విషయానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమయిన సదుపాయం ఇవ్వబడింది. అదే ‘జ్ఞానం’.
ఈ జ్ఞానం ద్వారానే , మానవుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది జనన మరణ చక్రాలనుండి
విముక్తి పొందుతాడు. మిగిలిన జీవులలో ఇది అసాధ్యం.
అందుచేత
సాయిబాబా, క్షణిక సుఖాలకు లోనయ్యి, ఇటువంటి అరుదయిన మహదవకాశాన్ని వృధా చేసుకోవద్దని
తన భక్తులకు సలహా ఇచ్చారు.
ఆవిధంగా
జీవితాన్ని వృధాచేసుకొనే వ్యక్తిని బాబా కొమ్ములు లేని జంతువుతో పోల్చారు.
ఆధ్యాత్మిక
విషయాలలో ఆసక్తిని కనపర్చేవారంటే సాయిబాబాకు ఎంతో ఇష్టం.
ఆధ్యాత్మిక
జీవితంలో వారికెదురయే ఆటంకాలనన్నిటినీ తొలగించి వారిని సంతోషపెట్టేవారు. బాలకృష్ణదేవ్ కు ప్రతిరోజు జ్ఞానేశ్వరి పారాయణలో
కలిగే అవాంతరాలని సాయిబాబా ఏవిధంగా తొలగించారో మనం 41వ.అధ్యాయంలో గమనించవచ్చు. అంతేకాదు దేవ్ కు స్వప్నంలో దర్శనమిచ్చి జ్ఞానేశ్వరిని
పారాయణ ఏవిధంగా చేయాలో అర్ధమయేటట్లుగా బోధించారు.
“అనేకమంది
నావద్దకు వచ్చి, ధనము, ఆరోగ్యము, పలుకువడి, కీర్తి, గౌరవము, ఉద్యోగము, రోగనివారణ ఇటువంటి
ప్రాపంచిక విషయాలను గురించి అడగటానికే వస్తారు.
నావద్దకు బ్రహ్మజ్ఞానం కోరివచ్చేవారు చాలా అరుదు”
అధ్యాయం – 16
అందువల్ల
సాయిబాబా అటువంటివారిని బలవంతంగా తనవద్దకు రప్పించుకుని, వారు సరియైన ఆధ్యాత్మిక జీవనం
గడపడానికి రకరకాల పద్దతులను ఉపయోగిస్తూ ఉండేవారు.
అధ్యాయం – 28
1. నానాసాహెబ్ చందోర్కర్ అహమ్మదావాద్ డిప్యూటీ
కలెక్టర్ గారి వద్ద వ్యక్తిగత కార్యదర్శి.
సాయిబాబా, నానాసాహెబ్ కి గ్రామకరణం అప్పాకుల్ కర్ణి ద్వారా మూడుసార్లు కబురు
పంపించి షిరిడీకి రప్పించుకున్నారు. ఆతరువాత
చందోర్కర్ ఆధ్యాత్మిక, ఐహిక సుఖాలలోని ఆసక్తిని నిరంతరం గమనించుకుంటూ బాబాగారి అంకిత
భక్తులలో ప్రీతిపాత్రుడయిన ఒక భక్తునిగా ఏవిధంగా అయినదీ మనకందరకూ తెలిసినదే.
2.
సాయిబాబా లాలాలక్ష్మీచంద్, రామ్ లాల్ పంజాబీలు
ఇద్దరికీ స్వప్న దర్శనమిచ్చి వారిని షిరిడీకి రప్పించుకున్నారు.
3. సాయిబాబా, బెర్హంపూర్ మహిళకు స్వప్నంలో
దర్శనమిచ్చి కిచిడీ కావలెననే కోర్కెను వెల్లడించారు. ఆవిధంగా ఆమెను, ఆమె భర్తను షిరిడీకి రప్పించి స్వప్నంలో
తాను కోరిన కోర్కెను తీర్చుకున్నారు.
కొంతమంది తమతమ దేవతలను సాదువులను పూజించడం మానివేసినపుడు,
సాయిబాబా వారిని షిరిడీకి రప్పించేవారు. వారిచేత
తిరిగి పూర్వంవలెనే యదావిధిగా పూజలు సలుపుకొమ్మని బోధించి వారిని తిరిగి ఆధ్యాత్మిక
మార్గంలో పయనింపచేసేవారు.
కొన్ని
ఉదాహరణలు:
1. భగవంతరావు తండ్రి పండరీపూర్ విఠోభా భక్తుడు
(కృష్ణపరమాత్మ) ప్రతిసంవత్సరం పండరీపూర్ వెళ్ళి
విఠలుని దర్శనం చేసుకొనేవాడు. తన ఇంటిలో కూడా
ప్రతిరోజూ విఠలునికి పూజచేసుకొనేవాడు. తండ్రి
చనిపోగానే భగవంతరావు పండరీపూర్ కు వెళ్ళడం మానివేయడమే కాక ఇంటిలో పూజలు కూడా మానివేశాడు. భగవంతరావు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొన్నపుడు
బాబా అతనిని చూపిస్తూ “ఇతని తండ్రి నాస్నేహితుడు.
ఇతడు నాకు నైవేద్యం పెట్టకుండా ఆకలితో ఉంచుతున్నాడు. అందుకే ఇతనిని షిరిడీకి లాక్కుని వచ్చాను. ఇపుడు అతడు తిరిగి పూజలు సలిపేలా చేస్తాను.” అన్నారు.
2
. శాంతాక్రజ్ లోని రావుబహదూర్ ప్రధాన్ తన
కుటుంబానికి గురువయిన హరిబువానుండి గురుమంత్రోపదేశాన్ని పొందాడు. కాని ఆమంత్ర జపాన్ని నిర్లక్ష్యంచేశాడు. ఒకసారి సాయిబాబా మసీదు ముందర ఉన్న ఆవరణలో బీదలకు
అన్నదానం కోసం పెద్ద గుండిగలో అన్నం వండుతున్నారు. ఆయన తన వద్దకు ఎవ్వరినీ రానివ్వలేదు. కాని ప్రధాన్, చందోర్కర్ గారి ఇద్దరు కుమారులు తన
వద్దకు వస్తున్నా పట్టించుకోలేదు. ఆసమయంలో
బాబా గట్టిగా ఏదో పాడుకుంటూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. ప్రధాన్ బాబా పాడుతున్నది చాలా శ్రధ్ధగా విన్నారు.
3
. “మనం తిరిగి ఏమని పాడాలి! శ్రీరామ జయరామ
జయజయరామ” ఇది వినగానే ప్రధాన్ కి తన గురువు ఉపదేశించిన మంత్రం గుర్తుకొచ్చింది. ప్రధాన్ భావోద్వేగంతో బాబా పాదాలపై పడి కన్నీళ్ళతో
క్షమించమని అర్ధించాడు. అప్పటినుండి ప్రధాన్
తిరిగి మంత్ర జపం ప్రారంభించాడు.
4
. హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్చవ్యాధితో
బాధపడుతున్నాడు. పితలే అల్లోపతి, ఆయుర్వేదం
అన్ని వైద్యాలు చేయించినా గాని లాభం లేకపోయింది.
ఆఖరికి దాసగణుగారి కీర్తనల ద్వారా బాబా ఖ్యాతిని విని పితలే తన కొడుకుని షిరిడీ
తీసుకొనివెళ్ళి, బాబా దర్శనం చేయించాడు. బాబా
దృష్టి, ఆయన ఊదీ వీటి మహత్యం వల్ల పితలే కుమారునికి మూర్చవ్యాధి నయమయింది. పితలే తిరిగి బయలుదేరేటప్పుడు బాబా అతనికి మూడురూపాయలిచ్చి,
అంతకుముందు అతనికి అక్కల్ కోటస్వామి ఇచ్చిన రెండు రూపాయలను గుర్తుచేశారు. ఆవిధంగా పితలే మరలా అక్కల్ కోటస్వామిని తిరిగి పూజించేలా
ప్రేరేపించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment