Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 9, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1996 (06)

Posted by tyagaraju on 6:44 AM





09.05.2012  బుధవారము


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1996  6వ.భాగాన్ని చదువుకుందాము.


సాయి.బా.ని.స. డైరీ -  1996 (06) 





07.09.1996

శ్రీసాయి నిన్నరాత్రికలలో ఒక చిన్న స్కూల్ లోని టేచర్ రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నాతత్వ ప్రచారములో భాగముగా నీవు పదిమంది సాయి భక్తులుతో కలసి సత్ సంగాలు నిర్వహించు, లేదా అనేక వందలమందిని ఉద్దేశించి నాతత్వాన్ని ఉపన్యాసము రూపములో వారికి అందచేయి. ఎవరైనా ప్రశ్నలు వేసినపుడు ఓరిమితో వారికి సమాధానము చెప్పు.

2) అజ్ఞానము అనే అడవిలో తిరుగుతున్న నావాళ్ళకు సాయితత్వ ప్రచార పుస్తకాలను ముద్రించి వారికి పంచిపెట్టు

3) సత్ సంగాల తర్వాత నీవు నాకు హారతి ఇచ్చి నైవేద్యము పెడుతున్నావే, నేను వాటిని క్రిమికీటకాదుల రూపములో స్వీకరించుతున్నాను
నాకు అర్పించిన ఆనైవేద్యమును ప్రసాదముగా నావాళ్ళకు పంచిపెట్టు. 



08.09.1996

నిన్నరాత్రి కలలో శ్రీసాయి శిరిడీలోని వేప చెట్టుక్రింద కూర్చుని తన దగ్గరకు వచ్చిన భక్తులను ఉద్దేశించి అన్నమాటలు.

1) 1918 నాటి సినీమాల ప్రభావము సమాజము శ్రేయస్సుకు ఉపయోగపడేలాగ ఉండేదికాని నేటి సినీమాల ప్రభావము సమాజము వినాశనానికి ఉపయోగపడేలాగ మారుతున్నది.  

2) 1918 నాటి తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసము నమ్మకముతో దేవీదేవతలను పూజించేవారుకాని ఈనాడు తల్లితండ్రులు ధనసంపాదన కోసము దేవి దేవతలను పూజించుతు, పిల్లల భవిష్యత్ గురించి పట్టించుకోకపోవటము చాలా  విచారకరము.   

3) 1918నాటి డాక్టర్లు రోగులకు వైద్యము చేస్తు భగవంతుని సహాయము అర్ధించేవారుకాని, ఈనాడు వైద్యులు తమ వైద్యముతో రోగి ఆరోగ్యము పొందగలిగితే దానిని తమ ఘనతగా చెప్పుకొంటున్నారురోగి మరణించితే భగవంతుని దయలేదు అంటున్నారు.

13.09.1996

శ్రీసాయి నిన్నరాత్రి కలలో ఒక మందిరములోని పూజారి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) జీవితములోని కష్ఠాల వరదనుండి బయటపడి నీతల్లితండ్రుల ఆశీర్వచనములతో భగవంతుని గుడికి చేరుకొన్నావుకష్ఠాల వరదలో కొట్టుకొనిపోయి తమ ప్రాణాలను కోల్పోయినవారు అనేక మంది ఉన్నారునీవు చాలా అదృష్ఠవంతుడివిభగవంతుని గుడిమెట్లు పైకి ఎక్కగలగినావు.

*** 2) ఉద్యోగాలు లేక అనేకమంది బాధలుపడుతుంటే నీవు ఉద్యోగము మానివేస్తాను అంటావు ఎందుకుసరి అయిన సమయము రాగానే నేనే నీచేత ఉద్యోగము మానిపించి నాతత్వ ప్రచారానికి నిన్ను నియమిస్తానుఅంతవరకు ఉద్యోగము చేయి.

3) అడ్డదారులు త్రొక్కుతు ధనసంపాదన చేస్తున్న స్త్రీ, పురుషులనుండి దూరంగా జీవించు.

4) నీజీవితములో ఇంతవరకు పేరుకొనిపోయిన చెడు అనే మురికిని "సాయి" అనే పటికతో శుభ్రము చేసుకొని మంచిమార్గములో పయనించు.   

***శ్రీసాయి ఆదేశానుసారము శ్రీ సాయిబానిస రావాడ గోపాలరావుగారు తన ఉద్యోగమునుండి మార్చ్ 2000 సంవత్సరములో స్వచ్చంద పదవీ విరమణ చేసి శ్రీసాయి సేవకు అంకితమైనారు

27.09.1996

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) పరస్త్రీలను పొగడటము, నీపేరు ప్రఖ్యాతుల కోసము వారిని వాడుకోవడము మహాపాపము.

2) ఈజీవిత నాటక రంగములో నీవు ఒకనటుడివిఈవిషయాన్ని తెలుసుండికూడా నీవు స్వంతనాటకాలు ఆడుతు ఎవరిని మోసము చేయదలచినావు?

3) సంసారము అనే సముద్రములో కష్ఠాలు కలిగించే పాములు ఉన్నాయిమరియు ప్రశాంతతనిచ్చే ముత్యపు చిప్పలు ఉన్నాయినీవు భగవన్ నామము ఉచ్చరించుతు పాములకు దూరంగా యుంటు ఆముత్యపు చిప్పలులోని ముత్యాలను ఏరుకోవాలిజీవితాన్ని సార్ధకము చేసుకోవాలి

4) శ్రీసాయినాధుని బడిలో కడుపునిండ ఆధ్యాత్మిక విందు ఆరగించిన తర్వాత బయటకు వచ్చి చిరుతిళ్ళు తినడము ఎందుకు

 (ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List