10.05.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ
- 1996
(07)
28.09.1996
శ్రీసాయి నిన్నరాత్రి నాపినతండ్రి
శ్రీ యూ.పీ.సోమయాజులుగారి
రూపములో దర్శనము
ఇచ్చి నా
ఆధ్యాత్మిక జీవిత పురోభివృధ్ధికి ఇచ్చిన సలహాలు,
సూచనలు.
1) పిల్లవాడు అనారోగ్యముతో యుంటే
తల్లి వాని
ఆరోగ్యము కోసము ఉపవాసము, పత్యము చేస్తుంది. అదేవిధముగా
తన భక్తుల
బాధలను తొలగించటానికి
సద్గురువు ఆబాధలను స్వీకరించుతారు. తన భక్తుల క్షేమము
కోసము భగవంతునికి
ప్రార్ధనలు చేస్తారు. మనము అటువంటి
సద్గురువును ఎన్నుకోవాలి.
2) మనము రోడ్డుమీద నడుస్తున్నపుడు
మనకు తెలియకుండానే
పేడలో కాలు
వేస్తాము. అలాగే
జీవితములో మనకు తెలియకుండానే బంధుప్రీతి అనే
పేడలో కాలు
వేస్తాము.
యింటిలోనికి
వచ్చేముందు రోడ్డుమీద అంటిన పేడను శుభ్రము
చేసుకొన్నట్లే నీవు ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించేముందు
బంధుప్రీతిని వదలించుకోవాలి.
3) శ్రీసాయి పేరుతో ఆధ్యాత్మిక
రంగ ప్రవేశము
మంచిదే. ఆధ్యాత్మిక
రంగములో శ్రీసాయి
పేరిట ఎంతసేపు
భజనలు చేసినాము
అనేది ముఖ్యము
కాదు.
శ్రీసాయి పేరుతో ఏవిధముగా
జీవితాన్ని సాగించినాము అనేది ముఖ్యము.
01.10.1996
నిన్నరాత్రి కలలో రెండు
ఎడ్లు కట్టినబండిలో
నాస్వగ్రామము బోడసకుర్రుకు బయలుదేరినాను.
ప్రయాణములో ఆబండివాడు నాకు ఇచ్చిన సలహాలునాకు చాలా
ఆశ్చర్యాన్ని కలిగించినవి.
1) నీగత జీవితములోని సంఘటనలను
గుర్తుచేసుకో. నీజీవితము
అనేకమంది నీబంధువుల జీవితముకంటే సుఖముగా గడచినది
కదా - దానికి
భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకో.
2) నీతండ్రి, వారి అన్నదమ్ముల
జీవితాలనుండి నేర్చుకొన్న గుణపాఠాలను
మర్చిపోకు. వాటిని
నీజీవిత అనుభవాలుగా
తలచుకొని మంచి మార్గములో ప్రయాణము చేస్తు
ప్రశాంత జీవితాన్ని
సాగించు.
3) జీవితములో స్నేహితులతో స్నేహ
సంబంధాలు మంచివేకాని ఆస్నేహము చెడిపోవడానికి ఆస్నేహితుల
మధ్య ఉన్న
ఆర్ధిక వ్యత్యాస,
ఆర్ధిక లావాదేవీలు
ముఖ్య కారణాలు. అందుచేత
ఈసత్యాన్ని గ్రహించి స్నేహాన్ని కొనసాగించటము మేలు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment