28.04.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీసాయి వైభవమ్
గర్భధారణ
సాధ్యమా?
ఈ
రోజు ‘ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 28.04.2016 సంచికలో ప్రచురింబబడిన వైభవానికి తెలుగు
అనువాదం.ఇది అత్యద్భుతమైన వైభవమ్. మనమందరం
కలిసి ఈ వైభవాన్ని వీక్షిద్దాము.
బొంబాయి,
విలే పార్లే లోని చంద్రబాయి బోర్కర్ కి బాబా అంటే ఎంతో భక్తి. ఆయనకు అంకిత భక్తురాలామె. ఆమె భర్త రామచంద్ర బోర్కర్ గారు సివిల్ ఇంజనీరు. ఆయన నాస్తికుడు. ఆయనకు బాబా అంటే నమ్మకం లేదు. ఆవిడ షిరిడీ ఎప్పుడు వెడుతున్నా గాని ఆమె భర్త ఆగ్రహించేవాడు
కాదు, అడ్డు చెప్పేవాడు కాదు. ఆది ఆవిడ అదృష్టమనే
అనుకోవాలి.
రామచంద్ర గారు సివిల్ ఇంజనీరు కాబట్టి
విధి నిర్వహణలో వంతెనల నిర్మాణం ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళవలసి వస్తూ ఉండేది.
దాని ఫలితంగా భర్త ఊరిలో లేని సమయంలో చంద్రాబాయి
షిరిడీ వెళ్ళి బాబాతో గడుపుతూ ఉండేది. బహుశ
1892 లో ఆమె మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళింది.
బాబాగారి లీలలెన్నిటినో ప్రత్యక్షంగా దర్శించింది. దాని వల్ల ఆమెకు బాబా మీద భక్తి, ప్రేమ మరింతగా
ధృఢపడ్డాయి. బాబా ఆమెను ప్రేమతో “బాయీ” అని పిలిచేవారు. ఆమె ఎప్పుడు షిరిడీ వచ్చినా షిరిడీలో ఉన్న కొంత
మంది భక్తుల ఇంటిలో ఉండమని చెప్పేవారు. ప్రతి
రోజు ఆరతి అయిన తరువాత బాబా ఆమెకు ఊదీనిచ్చి ఆశీర్వదించేవారు. ఆ విధంగా బాబా అనుగ్రహించి ఇచ్చిన ఊదీని ఒక డిబ్బీలో
ఉంచి ఇంటిలో జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేది.
ఆమెకు ఆ ఊదీ యొక్క పవిత్రత, శక్తి బాగా తెలుసు కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా
ఉపయోగిస్తూ ఉండేది. ఎవరికయినా సుస్తీ చేసి
బలహీన పడిన వారికి వెంటనే ఊదీ ఇచ్చేది. బాబా ఆమెకి కూడా తన పన్నును ఇచ్చారు. కాశీబాయి లాగే ఆమె కూడా బాబా ఇచ్చిన పన్నుని ఒక తాయెత్తులో ఉంచి శ్రధ్ధగా పూజిస్తూ ఉండేది.
రామచంద్ర
ఎప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. అయినా గాని బాబా అతనిమీద తన అనుగ్రహాన్ని ప్రసరించారు. అతనికి ఏదయినా ఉపద్రవం కలగవచ్చని ఆయన చంద్రాబాయిని
తరచు హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ విధంగా చంద్రాబాయి
20 సంవత్సరాలపాటు అప్పుడప్పుడూ షిరిడీకి వెడుతూ
వస్తూ ఉండేది.
1918
వ.సంవత్సరంలో బాబా ఆమెతో “బాయీ! నీ మనసులోని కోరికేమిటో చెప్పు” అన్నారు. చంద్రాబాయి ఏమీ తడుముకోకుండా వెంటనే “బాబా, నువ్వు
అంతర్యామివి. చెప్పడానికేమున్నది?”
అంది. అప్పుడు ఆమెకు 48 సంవత్సరాల వయసు. ఆమెకు సంతానం కలగాలని కోరికగా ఉన్నా బాబాని ఎప్పుడూ
అడగలేదు.
వైద్యులు
చెప్పినట్లుగానే ఆమె స్నేహితులు, కుటుంబంవారు ఈ వయసులో గర్భధారణ అసంభవమని చెప్పారు. కాని ఏమయినప్పటికి చంద్రాబాయికి శ్రధ్ధ, సబూరి సంపూర్ణంగా
ఉన్నాయి. బాబాకి అసాధ్యమన్నది లేదని ఆమెకు
బాగా తెలుసు. మూడు సంవత్సరాలు గడిచాయి. ఆమెకు బహిష్టులు కూడా ఆగిపోయాయి. అయిదు నెలల తరువాత ఆమెకు పొట్ట ఉబ్బరించింది. అంతే కాకుండా దానితోపాటుగా వాంతులు మొదలయ్యాయి. పాదాలు కూడా వాచాయి. డా.పురందరే ఆమెను పరీక్షించి గర్భాశయంలో కంతి ఉంది,
ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చంద్రాబాయి ఆపరేషన్
కి ఒప్పుకోలేదు. “నేను పది నెలలు ఇలాగే సహించి, వేచి చూస్తాను. అప్పుడు నిర్ణయం తీసుకుంటాను”
అని చెప్పింది. డా.పురందరే ఆమెతో ఎంతో ఓపికగా
” అమ్మా! 51 సంవత్సరాల వయసులో అదీ కూడా మూడు సంవత్సరాలుగా బహిష్టులు ఆగిపోయిన తరువాత
గర్భధారణ అసాధ్యం” అని చాలా వివరంగా చెప్పారు.
కాని ఆమె తన మొండి పట్టును వదలలేదు.
బాబా
దయ ఉంటే అసాధ్యమనుకున్నవన్నీ సాధ్యమవుతాయన్న విషయం ఆమెకు బాగా తెలుసు. బాబాపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. ఈ పది నెలల కాలంలో ఆమె శారీరకంగా బాగా కృశించి పోయింది. ఆమె బాబా తనకు ప్రసాదించిన ఊదీనే నెలలపాటు నీటిలో
కలిపి త్రాగేది.
బాబా
మహాసమాధి చెందిన 3 సంవత్సరాలు, 2 రోజుల తరువాత ధనత్రయోదశినాడు ఆమెకు పుత్రుడు జన్మించాడు. అమెకు ప్రసవం జరిగే రోజు వరకు ఆమె తన ఇంటి పనులను
చేసుకుంటూనే ఉంది. వైద్యుడు, నర్సుల సహాయం లేకుండా మందులు కూడా ఏమీ వాడకుండా ఆమెకు సుఖప్రసవం జరగడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
జో
జో మజ భాజే జైసా జైసా భావ్
తైసా
తైసా పావె మేహి త్యాసె.
(మరికొన్ని
వైభవాలు ముందు ముందు)
చంద్రాబాయి
గారు ఎంతటి భక్తురాలో గమనించారు కదా. బాబా
మీద ఆమెకు ఎంతటి ధృఢమయిన భక్తి? 20 సంవత్సరాలపాటు ఆమె షిరిడికి వస్తూ పోతూ బాబాని దర్శించుకుంటూ
ఉండేది. బాబా దగ్గిర ఎంత చనువుగా ఉండేదో ఆమె.
కాని బాబాకు తన భక్తులందరూ సమానమే. ఎవ్వరినీ ఎక్కువ తక్కువలు చేసి చూడరు.
బాబాయే స్వయంగా
నీ మనసులోని కోరిక చెప్పమనగానే వెంటనే తడుముకోకుండా బాబా నువ్వు సర్వాంతర్యామివి అని
అన్నదే కాని తన మనసులో తనకు తల్లి కావాలానె కోరికను వెల్లడించలేదు. తనకు సంతానం కావాలన్న
కోరికను ఆమె వెలిబుచ్చకుండానే ఆయన తీర్చారు.
వైద్యులు ఆమెకు కడుపులో కంతి ఉన్నదని చెప్పినా వినిపించుకోలేదు. పది నెలలు వేచి
చూసింది. అంటే ఆమెకు బాబా మీద ఎంతటి నమ్మకం
ఉన్నదో గమనించండి.
భగవంతుడు
స్వయంగా అడిగితే కాదనే భక్తుడు ఎవరూ ఉండరు.
కాని భగవంతుడె మనకి తల్లీ, తండ్రీ అయినప్పుడు, మన భావమ్ కూడా అంతే బలంగా ఉన్నప్పుడు
మనకిక కోరికలు ఏమి ఉంటాయి. కోరికలకు అంతే ఉండదు.
మరొక దాని తరువాత మరొకటి కావాలనిపిస్తుంది. కోరికలను తీర్చేవాడు తేరగా దొరికితే కోరికల
చిట్టాకు అంతే ఉండదు. దానితో మనశ్శాంతి కూడా ఉండదు.
బాబా అడిగిన వెంటనే ఆవిడ తడుముకోకుండా తనకి ఫలనా
కోరిక వుందని చెప్పలేదు.బాబా నీవు సర్వాంతర్యామి కదా అనే అంది. బాబాకి ఆమె మనసులో ఉన్న కోరిక తెలియకుండా ఉండదు
కదా. బాబా వారే కానివ్వండి మరే దైవం కానివ్వండి
మనం కోరికలు లేకుండా పూజించాలి. మనకేది ప్రాప్తమో
అదే అనుగ్రహిస్తారు.
ఈ
రోజు శ్రీ షిరిడీసాయి వైభవమ్ లో ఏమి ప్రచురిద్దామా అని పుస్తకం చూస్తుంటే ‘మైల్ లో
ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ ఈ రోజు సంచిక పంపించారు. మధ్యాహ్నం దానిని అనువాదం చేసి తయారుగా ఉంచుకున్నాను. తయారు చేసినదానిని సేవ్ చేద్దామంటే తెలుగు టైటిల్
తో ఎంతకీ సేవ్ అవలేదు. మళ్ళి మైల్ ఓపెన్ చేసి,
అందులో డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకున్నాను. మైల్
తెరవగానే శ్రీమతి కృష్ణవేణి గారు పంపించిన మరొక లీల కనపడింది. ఇప్పుడు ప్రచురించినదానికి అనుబంధంగా ఉందనిపించింది. వెంటనే ఆ లీలను కూడా యధాతధంగా
ప్రచురిస్తున్నాను.
“మా
చెల్లెలికి పెళ్లయి మూడు సంవత్సరాలు అయింది.
ఆమె తనకు ఇంకా సంతానం కలగలేదని బాధ పడుతూ ఉండేది. మా చెల్లులు హైదరాబాదులో మియాపూర్ లో ఉంటారు. అక్కడ జనప్రియ అపార్ట్ మెంట్లు దగ్గిర బాబా గుడి
ఉంది.
అందులో ఈ సంవత్సరమే ‘సర్వే జనా సుఖినో
భవంతు’ అనే కార్యక్రమాన్ని క్రొత్తగా ఏర్పాటు చేశారు. అక్కడ డబ్బు కడితే ప్రతి గురువారం జరిగే ‘సర్వే
జనా సుఖినో భవంతు’ కార్యక్రమంలో మన తరఫున అందరూ బాబావారిని సమస్యల పరిష్కారం కోసం ప్రార్ధిస్తారు. గురువారమునాడు సాయంత్రం వేళలో కరెంటు దీపాలన్నీ
ఆర్పివేసి బాబాకు నవవిధ ఆరతులనిస్తారు. సంధ్యా ఆరతి తరువాత మంత్రోపదేశం ద్వారా ఏ భక్తునకయితే
సమస్య ఉందో, ఆ సమస్య నివారణకోసం (సంతానం కలగడానికి,
పిల్లల చదువు కోసం ఇలాంటివాటికి) పూజ చేస్తారు.
ఆ విధంగా ఈ సంవత్సరం జనవరిలో మా చెల్లెలు కూడా ఆ పూజలో పాల్గొంది. తరువాత కొద్ది రోజులకు కడుపులో నొప్పిగా అనిపించి
లైట్ గా బ్లీడింగ్ అవడంతో నీరసంగా పడుకుని ఉంది.
కాస్త నిద్రపట్టింది. కొంత సేపటికి
తెల్లని దుస్తులు ధరించి ఒక ఆజానుబాహువు వయసు మళ్ళినాయన మా చెల్లెలి వెనకె అలాగే చూస్తూ
కనిపించారట. ఆ తరువాత కొద్ది రోజులకు వాంతులుగా
ఉండటంతో ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళింది. వారు పరీక్షించి మూడవ నెల అని చెప్పారు. అంతా బాబా అనుగ్రహం.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment