29.04.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7వ.భాగమ్
ఈ
రోజు ఆధ్యాత్మిక జీవితం మీద బాబా గారు
సాయిబానిస గారికి ప్రసాదించిన మరికొన్ని సందేశాలు.
07.05.2006
61. లంచాలు
తీసుకుని భోగాలు అనుభవిస్తున్నపుడు బంధువులు చీమలలా మన చుట్టూ తిరుగుతారు. మన
సంపాదన వారికి బెల్లం దిమ్మలాగ కనిపిస్తుంది. అవినీతి
నిరోధకశాఖ వారు ఆ బెల్లం దిమ్మ తీసుకునిపోయినపుడు ఆ
చీమలన్నీ వాటంతటవే
వెళ్ళిపోతాయి. అపుడు
నీకు మిగిలేది ఏమీ లేదు.
13.06.2006
62. జీవితంలో
ఏదయినా సాధించాలంటే పంతం ఒక్కటే చాలదు. పట్టుదల,
ఓరిమికూడా ఉండాలి అన్నారు బాబా .
--- సాయిబానిస
11.07.2006
63. జీవిత రైలు
ప్రయాణంలో అనగా వృధ్ధాప్యంలో తక్కువ
సామాన్లతో ప్రయాణం కొనసాగించాలి. నీ
గమ్యాన్ని చేరే వరకు
అనవసరపు స్టేషన్లలో దిగరాదు. ప్రమాదాలు
కొని తెచ్చుకోరాదు. ప్రశాంత
ప్రయాణం నీ గమ్యం చేరడానికి చాలా ముఖ్యము.
(స్టేషనులు అనగా అనవసర విషయాలు)
19.08.2006
64. నీ
గత జీవితంలో నీతో
స్నేహాలు చేసిన వారిని కలలో నీతో గడిపినట్లుగా
భావించి వారిని మరచిపో. గత
స్నేహాలను కలగానే చూడు. కలలో
నీవు అనుభవించిన కష్టాలు సుఖాలు నీ నిజ జీవితంలో మంచి
చెడులను గుర్తించడానికి ఉపయోగించుకో.
19.08.2006
65. ఆనాటి
నీ చదువులు, నీ విద్యా ప్రమాణాలు ఈనాటి
వర్తమానానికి పనికిరావు. గతం
ఎంత గొప్పదయినా అది వర్తమానానికి పనికి
రాదు.
వర్తమాన పరిస్థితులను
అవగాహన చేసుకుని నిజం తెలుసుకుని మసలుకోవటం
నేర్చుకో.
27.08.2006
66. కష్టాలనే
వరదలు రావడం సహజం. అపుడు నీవు అందరికీ
ఉచిత సలహాలిచ్చిన వారు నీకు శత్రువులుగా
మారుతారు. అందుచేత
మనిషి ఎన్ని కష్టాలలో ఉన్నా
అడగనిదే అతనికి సలహాలివ్వరాదు. ఉచిత
సలహాలిచ్చి నీవు కష్టాలు కొనితెచ్చుకోరాదు.
30.08.2006
67. ఏ పనయినా
నమ్మకంతో చేయాలి. అంతేకాని,
ఎవరో ఏదో మొహమాటానికి అనుకుంటారేమోనని
చేయరాదు. నమ్మకం
లేనపుడు ఎవరి సలహాను తీసుకుందుకు
వెళ్ళరాదు. నమ్మకం
లేనపుడు ఏపనీ చేయరాదు.
13.09.2006
68. మన
గురువు మనకు తల్లి లాంటివారు. వారు
మనకు జీవితంలో చేసిన సహాయము మరచి
పోరాదు. బాబా ఏనాడూ
తాను భగవంతుడినని చెప్పుకోలేదు. తాను
భగవంతుని విధేయ సేవకుడిననే చెప్పారు. తాను
తన భక్తులకు కూడా సేవకుడిననే అన్నారు. తాను
సలహాను మాత్రమే ఇవ్వగలనన్నారు. తాను
శరీరంతో ఉన్న రోజులలో తన
భక్తుల కర్మలను తాననుభవించి వారి కష్టాలను తొలగించారు. ఈనాడు
మన గురువు శరీరంతో లేకపోయినా అనేక మందికి కలల
ద్వారా సందేశాలు ఇస్తూ వారి జీవితాలలో
సుఖశాంతులు ప్రసాదిస్తున్నారు.
సాయిబానిస
29.09.2006
69. జీవితంలో
లేనిదాని కోసం బాధలు పడుతూ జీవించేకన్నా
నీకు ఉన్నదానితో జీవించడం మంచిది. లేనిదాని
కోసం వెతుకుతూ తిరుగుతూ జీవించడం తెలివిహీనుల పని. భగవంతుడిచ్చిన
దానితో సుఖంగా జీవించడం విజ్ఞత కలవారి పని.
10.10.2006
70. చిన్న
తనంలో పోలియో వ్యాధితో బాధపడుతు నడవలేని స్థితిలో ఉన్న కుమారుడిని తండ్రి
తన భుజాలపై కూర్చోపెట్టుకుని బయట తిప్పుతాడు.
కాని, అదే పిల్లవాడు పెద్దవాడయిన
తరువాత నడవలేని స్థితిలో తండ్రి
ఎత్తుకుని బయటకు తిప్పలేడు కదా! ఈ
ఆలోచన నాలో ఎవరి ఖర్మ వారనుభవించాలి
అనే భావన కలిగించింది.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment